KTR Arrest: కేసీఆర్ అరెస్ట్ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Telangana: ఏదో ఓ కేసులో కేటీఆర్ ను అరెస్టు చేయడం ఖాయమన్న ప్రచారం ఊపుందుకుంది. ఒక వేళ అదే జరిగితే తర్వాత ఏం చేయాలన్నదానిపై బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ కూడా ప్రణాళికలు రెడీ చేసుకుంటోంది.
Will KTR be arrested: తెలంగాణ రాజకీయాల్లో అరెస్టులు అనే పదం ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయింది. ముఖ్యంగా ఈ పదం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడంట్ కేటీఆర్ చుట్టూ తిరుగుతోంది. బీఆర్ఎస్‌పై త్వరలో తాము బాంబులు వేయబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రటించిన తర్వాత అది మొదటగా కేటీఆర్ పైనే పడుతుందన్న సంకేతాలు వచ్చాయి. ఫార్ములా ఈ రేసు కేసులో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసి విచారించేందుకు అనుమతి కోసం గవర్నర్ కోసం లేఖ రాసింది. ఆ లేఖకు ఇంకా సమాధానం రాక ముందే కలెక్టర్‌పై దాడి ఘటనలో కేటీఆర్ హస్తం ఉందని పోలీసులు అనుమానాలతో మరో వైపు నుంచీ ఆయనకు అరెస్టు ముప్పు ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
రాజకీయాల్లో అరెస్టులు మరో మెట్టు ఎక్కడానికి అవకాశాలు
రాజకీయాల్లో అరెస్టులు ఎప్పుడూ మైనస్‌లు కావు. ఇంకా చెప్పాలంటే ప్లస్ అవుతుంది. అరెస్టు జరిగే పరిణామాల్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే.. తర్వాత అధికారానికి అదే మెట్టు అవుతుంది. గతంలో ఎన్నో ఘటనలు ఈ అరెస్టుల వ్యవహారంతో రాజకీయంగా కీలక మలుపులకు కారణం అయ్యాయి. రేవంత్ రెడ్డిని కూడా చాలా సార్లు అరెస్టు చేశారు. ఆయన ఇప్పుడు సీఎం అయ్యారు. చంద్రబాబును గత ఎన్నికలకు ముందు అరెస్టు చేశారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కూడా రానంతగా పరాజయం ఎదురయింది. ఇవన్నీ లెటెస్ట్ ఘటనలో భారత ప్రజాస్వామ్య చరిత్రలో అరెస్టులకు చాలా ప్రాధాన్యం ఉంది. అలా అరెస్టులు అయిన వారు రాజకీయంగా ఉన్నత పదవులు సాధించారు.
Also Read: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
అరెస్ట్ చేస్తే తర్వాత పొలిటికల్ ప్లాన్ రెడీ చేసుకున్న బీఆర్ఎస్
ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కేటీఆర్ అరెస్టును అలాగే ఉపయోగించుకునేలా ప్రణాళిక సిద్దం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నో రోజులు జైల్లో పెట్టలేని మహా అయితే రెండు, మూడు నెలలు పెట్టగలరని తర్వాత బయటకు వస్తే ఇక దూసుకెళ్లడమేనని కేటీఆర్ అనుకుంటున్నారు. ఆయన మానసికంగా అరెస్టుకు సిద్ధమయ్యారు. తాను అరెస్టు అయితే ప్రజల్లోకి ఎలా ఆ పరిణామాల్ని పంపాలో కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో సోషల్ మీడియా ద్వారా రాజకీయాలు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీనే. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వెనుకబడి పోయి ఉంది.
Also Read: సోషల్ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు- కేసులు పెడితే తప్పేంటని ప్రశ్న
కాంగ్రెస్ వేచి చూస్తుందా ?
కేటీఆర్ అరెస్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ తొందరపడుతుందా.. వేచి చూస్తుందా అన్నది కీలకంగా మారింది. బుధవారం రాత్రి అరెస్టు చేస్తారన్న ప్రచారంతో కేటీఆర్ ఇంటి వద్ద అనుచరులు మోహరించారు. కానీ పోలీసులు ఆ దిశగా రాలేదు. కలెక్టర్ పై దాడి ఘటనలో ఆయన పేరు రిమాండ్ రిపోర్టులో ఉంది. ఇంకా ఎఫ్ఐఆర్‌లో చేర్చలేదు. అయితే ప్రధాన సూత్రధారిగా ఆయన పేరు చేల్చేలా రిమాండ్ రిపోర్టులో అభియోగాలు ఉన్నాయి.. అందుకే అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో కార్యకర్తల్ని మోహరించారు. కానీ పోలీసులు ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకునేవరకూ అరెస్టుల్లాంటి నిర్ణయాలు తీసుకోకపోవచ్చు. రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలుసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించే అవకాశం ఉంది.