Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
Maharastra Elections: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. నాందేడ్ ప్రాంతంలో మూడు సభల్లో పాల్గొననున్నట్లుగా అక్కడి ఎన్నికల ఇంచార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
Pawan Kalyan will campaign in Nanded for two days: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరపున ఎన్డీఏ నేతలు రంగంలోకి దిగుతున్నారు. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మహారాష్ట్ర వెళ్తున్నారు. శని, ఆదివారాల్లో పవన్ కల్యాణ్ నాందేడ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయనున్నారు.
మహారాష్ట్రలో తెలుగు వారు ఉన్న పలు ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం సాగనుంది. నాందెడ్‌లో తెలుగు మూలాలున్న ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అందుకే వీరిని ఆకట్టుకునేందుకు పవన్ కల్యాణ్‌తో ప్రచారం చేయించాలని నిర్ణయించారు. పవన్ కల్యాణ్ నాందేడ్ ప్రాంతంలో మొత్తం మూడు బహిరంగసభల్లో పాల్గొంటారు. ఇతర ప్రాంతాల్లోనూ వారి పర్యటన ఉంటుంది.
Also Read: కేసీఆర్ అరెస్ట్ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
పవన్ కల్యాణ్‌తో పాటు మంత్రి సత్యకుమార్ కూడా ఈ ప్రచారంలో పాల్గొంటారు. నాందేడ్‌కు బీజేపీ తరపున ఎన్నికల ఇంచార్జ్‌గా ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. పవన ప్రచారం అంశాన్ని సోషల్ మీడియాలో ధృవీకరించారు.
మహారాష్ట్రకు ఎన్నికల ప్రచారంలో @JanaSenaParty అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక స్వాగతం.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) November 15, 2024
ఈ ఎన్నికల్లో మీరు మరియు @BJP4India జాతీయ కార్యదర్శి శ్రీ @satyakumar_y గారు ప్రచారం కారణంగా ఇక్కడి కూటమి అభ్యర్థులు విజయానికి బిజెపి ప్రభుత్వం… pic.twitter.com/CFcZqE1byZ
ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గత నెల రోజులుగా నాందేడ్‌లోనే బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేసుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా బీజేపీ ముఖ్య నేతలు అంతా ఇప్పటికే ఒక విడత నాందేడ్‌లో ప్రచారం పూర్తి చేశారు. ప్రచార గడువు పద్దెనిమిదో తేదీన సాయంత్రం ముగియనుంది. సమయం ముగియడంతో పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించడానికి బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు.
Also Read: ఫైనల్ స్టేజ్‌కు మహారాష్ట్ర ఎన్నికల వార్ - తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ బలగం !
పవన్ కల్యాణ్, సత్యకుమార్ నాందేడ్ ప్రాంతంలో మూడు సభల్లో పాల్గొంటారు. ఇతర ప్రాంతాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేస్తారు. పవన్, సత్యకుమార్ ప్రచారం వల్ల బీజేపీ విజయావకాశాలు మరింత మెరుగుపడి అభ్యర్థుల మెజార్టీలు భారీగా పెరుగుతాయని ఎన్నికల ఇంచార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాందేడ్ ప్రాంత అభివృద్ధి, అక్కడి ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ కూటమి చేసిన కృషి ఇక్కడి ప్రజలు మరోసారి బీజేపీ కూటమిని ఆదరిస్తారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. నాందేడ్ ఎన్నికల ఇంచార్జిగా బీజేపీ నాయకత్వం బాధ్యతలు అప్పగించిన తర్వాత నెల రోజులుగా అక్కడ ప్రచారాన్ని సమన్వయం చేసుకుంటున్నానని బీజేపీ విజయం ఎలాంటి డౌట్ లేదని ఆయన అంటున్నారు.