అన్వేషించండి

Thaman: నిన్న చూపు లేని యువకుడికి గాయకుడిగా అవకాశం... నేను కిడ్నీ పేషెంట్‌కు సాయం- తమన్‌పై నెటిజన్ల ప్రశంసలు

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మంచి మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ రోగికి అండగా నిలిచారు. ఆయన సాయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Music Director Thaman Help: తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న తమన్ తన మంచి మనసు చాటుకుంటున్నరు. ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందివ్వడంలో ముందుంటున్నారు. రీసెంట్ గా ఓ చూపు లేని యువకుడికి ఇండియన్ ఐడల్ తెలుగులో పాడే అవకాశం కల్పించిన ఆయన, తాజాగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ పేషెంట్ కు అండగా నిలిచారు. కిడ్నీ మార్పిడికి కోసం ఆర్థికసాయం చేసి ప్రాణాలు కాపాడారు.   

సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన డాక్టర్

తమన్ సాయం గురించి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేసిన డాక్టర్ లీలా క్రిష్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తమన్ ఆర్థిక సాయం చేసి, ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడారని వెల్లడించారు. “ ప్రియమైన బ్రదర్ తమన్ కు కృజ్ఞతలు. ఓ పేషెంట్ కిడ్నీ మార్పికి సాయం చేసి ప్రాణాలు కాపాడావు. మీ సాయం వాళ్లు ఎప్పటికీ మర్చిపోలేరు. మీ సాయం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను” అని రాసుకొచ్చారు. డాక్టర్ లీలా క్రిష్ పెట్టిన పోస్టును తమన్ షేర్ చేశారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా నిర్వహించిన డాక్టర్ ను అభినందించారు. “గాడ్ ఈజ్ గ్రేట్ డియర్ డాక్టర్ లీలా క్రిష్” అని రాసుకొచ్చారు.

తమన్ పై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

అటు తమన్ సాయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచి మనసుతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడటం నిజంగా అభినందనీయం అంటున్నారు. “మీ సాయం ఎంతో మందికి ఆదర్శం కావాలి” అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.  “ఆపదలో మీరు చేసిన సాయం.. ఓ కుటుంబాన్ని నిలబెట్టింది” అని ఇంకొందరు అభినందిస్తున్నారు.

చూపు లేని యువకుడిగా తమన్ అవకాశం

ఇటీవల చూపులేని ఓ యువకుడు అద్భుతంగా పాడుతున్న వీడియో చూసి సాయం చేయడానికి తమన్ ముందుకు వచ్చారు. ఇండియన్ ఐడల్ సీజన్ 4లో పాడే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. “ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 4లో ఈ యువకుడు తప్పకుండా పాడతాడు. ఆహా టీమ్ నా అభ్యర్థన అనుకోండి, ఆర్డర్ అనుకోండి.. తనను ఇండియన్ ఐడల్ స్టేజి మీద పాడే అవకాశం కల్పించండి. ఇండియన్‌ ఐడల్‌ లో తన ప్రత్యేక ప్రదర్శన ఉంటుంది. అతడితో కలిసి నేను పర్ఫార్మెన్స్ ఇస్తాను. తనలో చాలా టాలెంట్ ఉంది. పర్ఫెక్ట్ పిచింగ్ లో పాటలు పాడుతున్నాడు. దేవుడు కొన్నిసార్లు కఠినంగా ఉంటాడు. కానీ మనం మనుషులం అందరం కలిసి అతడిని అందరూ గర్వించే స్థాయికి తీసుకొద్దాం” అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఈ తమన్ అవకాశం కల్పించడం పట్ల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. నెటిజన్లు సైతం తమన్ సాయం పట్ల అభినందనలు కురిపించారు.

Also Readకంగువ ఫస్ట్ డే కలెక్షన్స్... టార్గెట్ రీచ్ అయ్యిందా? సూర్యకు పాన్ ఇండియా సక్సెస్ వచ్చిందా?

వరుస సినిమాలతో ఫుల్ బిజీ

అటు ప్రస్తుతం తమన్ వరుస సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గేమ్ ఛేంజర్’కు తమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న ఈ సినిమా విడుదలకానుంది. ఈ మూవీతో పాటు పలు ప్రతిష్టాత్మక చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.

Also Readవరుణ్ తేజ్‌కు మరో షాక్... 'మట్కా' ఫస్ట్ డే కలెక్షన్స్ అంతేనా?

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget