అన్వేషించండి

Matka Day 1 Collection: వరుణ్ తేజ్‌కు మరో షాక్... 'మట్కా' ఫస్ట్ డే కలెక్షన్స్ అంతేనా?

Matka First Day Collection: మెగా హీరో వరుణ్ తేజ్‌కు మరో భారీ షాక్ 'మట్కా' అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు మొదటి రోజు మరీ తక్కువ కలెక్షన్ వచ్చిందని తెలుస్తోంది.

Matka box office collection day 1: మెగా ఫ్యామిలీ హీరోలు అందరికీ ఫ్యాన్స్ సపోర్ట్ వుంటుందని చెప్పలేం. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ మూవీస్ చేస్తుంటే అభిమానులకు అయినా సరే మొదటి రోజు థియేటర్లకు రావడానికి ఇబ్బందిగా వుంటుంది. అందుకు రీసెంట్ ఎగ్జాంపుల్ 'మట్కా'. మొదటి రోజు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ మరీ షాక్ ఇచ్చాయి.

ఆల్మోస్ట్ 50 కోట్లు పెడితే కోటి కూడా రాలేదా?
వరుణ్ తేజ్ కెరీర్ హయ్యస్ట్ బడ్జెట్ మూవీగా 'మట్కా' తెరకెక్కింది. ఈ సినిమాకు ఆల్మోస్ట్ 50 కోట్లు ఖర్చు చేశారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అయితే, ఫస్ట్ డే రిజల్ట్ ఆ రేంజ్‌లో లేదు. పెట్టిన ఖర్చులో మినిమమ్ 2 పర్సెంట్ కూడా రికవరీ చేయలేదని ఎర్లీ రిపోర్ట్స్ బట్టి తెలుస్తోంది.

ఇండియాలో ఫస్ట్ డే 'మట్కా' కలెక్షన్స్ 70 లక్షల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు చెప్పాయి. స్టార్ హీరోలు, క్రౌడ్ పుల్లర్స్ అయితే తప్ప గురువారం రిలీజ్ అయ్యే సినిమాలకు కోట్లకు కోట్లు రావడం కష్టం. అయితే, వరుణ్ తేజ్ సినిమాకు మినిమమ్ ఓపెనింగ్ కూడా లేకపోవడం షాక్ ఇచ్చే అంశం. బుకింగ్స్ లేని కారణంగా కొన్ని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు మొదటి రోజే షోస్ క్యాన్సిల్ చేశారు. ఓవర్సీస్ మార్కెట్ రిజల్ట్ కూడా అంత ఆశాజనకంగా లేదు. 

'మట్కా' ఫస్ట్ డే షేర్ కలెక్షన్ కోటి లోపే వుంటుందని ట్రేడ్ టాక్.  ఓపెనింగ్ డే కోటి కంటే తక్కువ షేర్ వచ్చేటప్పుడు వరుణ్ తేజ్ మీద కోట్ల రూపాయలు ఖర్చు చేసే విషయంలో నిర్మాతలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారని చెప్పడంలో సందేహాలు అవసరం లేదు.

Also Readమట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?


వరుణ్ తేజ్ లాస్ట్ మూవీస్ రిజల్ట్ ఎంతో తెలుసా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సోలో హీరోగా నటించిన లాస్ట్ ఫిలిమ్స్ రిజల్ట్ చూస్తే... 'గని' మూవీ టోటల్ రన్ రూ. 8 కోట్లు. ఆ తర్వాత చేసిన 'గాంఢీవధారి అర్జున్'కు మొదటి రోజు నుంచి ఫ్లాప్ టాక్ రావడంతో మొత్తం మీద మూడు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. 

పాన్ ఇండియా రిలీజ్, సర్జికల్ స్ట్రైక్ వంటి పొటెన్షియల్ ఉన్న కథతో తెరకెక్కిన 'ఆపరేషన్ వేలంటైన్' కలెక్షన్స్ కూడా 10 కోట్లు లోపే. ఆ మూవీ టోటల్ రన్ రూ. 9 కోట్లు. 'మట్కా' టోటల్ రన్ ఎన్ని కోట్ల దగ్గర ఆగుతుందో చూడాలి. మూవీకి మొదటి రోజు ఫ్లాప్ టాక్ రావడంతో మూడు కోట్లు అయినా కలెక్ట్ చేస్తుందా? లేదా? అనేది చూడాలి.

Also Readకంగువ రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉందా? - కోలీవుడ్ స్టార్ హిట్ కొట్టారా?

కరుణ కుమార్ దర్శకత్వం వహించిన 'మట్కా' సినిమాలో మీనాక్షీ చౌదరి హీరోయిన్ కాగా... బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కీలక పాత్ర చేసింది. 'సత్యం' రాజేష్, నవీన్ చంద్ర, కిషోర్, జాన్ విజయ్, అజయ్ ఘోష్, సలోని తదితరులు ఇతర కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాను వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్ మీద డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ప్రొడ్యూస్ చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండ ఒకే దాంట్లోే -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లోే - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget