అన్వేషించండి

Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?

Matka Review in Telugu: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన 'మట్కా' నేడు థియేటర్లలోకి వచ్చింది. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉంది? హిట్ వస్తుందా?

Matka Movie Review Rating In Telugu: కథానాయకుడిగా వరుణ్ తేజ్ ప్రయాణం భిన్నమైంది. హిట్టూ ఫ్లాపులకు అతీతంగా డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. అయితే, ఆయనకు సరైన విజయాలు లభించడం లేదు. సోలో హీరోగా లాస్ట్ రెండు సినిమాలు 'గాంఢీవధారి అర్జున', 'ఆపరేషన్ వేలంటైన్' బాక్సాఫీస్ దగ్గర సౌండ్ చేయలేదు. మరి, 'మట్కా' ఎలా ఉంది? ఈ సినిమా అయినా వరుణ్ తేజ్ (Varun Tej)కు విజయం అందిస్తుందా? లేదా? రివ్యూలో చూడండి. 

కథ (Matka Movie Story): బర్మా నుంచి విశాఖ వచ్చిన శరణార్థి వాసు (వరుణ్ తేజ్). శరణార్థి శిబిరంలో ప్రసాద్ ('సత్యం' రాజేష్) పరిచయం అవుతుంటాడు. అక్కడ జరిగిన ఓ గొడవ వల్ల చిన్నతనంలో జైలుకు వెళతాడు. బయటకు వచ్చిన తర్వాత పూర్ణ మార్కెట్టులో అప్పల్ రెడ్డి (అజయ్ ఘోష్) దగ్గర పనికి చేరతాడు. 

కొబ్బరికాయల కొట్టులో పని చేసే వాసు... మట్కా కింగ్ ఎలా అయ్యాడు? సుజాత (మీనాక్షి చౌదరి)తో ప్రేమలో ఎలా పడ్డాడు? వాసు ప్రయాణంలో ఎంపీ నాని బాబు (కిశోర్), సోఫియా (నోరా ఫతేహి) పాత్రలు ఏమిటి? వాసు మీద సీబీఐ కన్ను పడటానికి కారణం ఏమిటి? సాహు (నవీన్ చంద్ర) పట్టుకోగలిగాడా? లేదా? చివరకు ఏమైంది? అనేది సినిమా. 

విశ్లేషణ (Matka Review Telugu): 'మట్కా' క్లైమాక్స్‌లో వాసు (వరుణ్ తేజ్ పాత్ర పేరు) ఓ డైలాగ్ చెబుతాడు... 'పాత సారా, కొత్త సీసా' అని తాను చేయబోయే కొత్త వ్యాపారం గురించి! సినిమా గురించి చెప్పడానికి సరిగ్గా ఆ డైలాగ్ సరిపోతుంది. ఈ సినిమా దర్శకుడు కరుణ కుమార్ తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే పదుల సంఖ్యలో చూసిన టెంప్లెట్ / కమర్షియల్ ఫార్మటులో కథను చెప్పాలని ట్రై చేశారు. ఆసక్తిగా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు.

'మట్కా'లో మట్కా ఆట మాత్రమే కొత్తది. ఆ కథ గానీ, కథలో పాత్రలు గానీ మన ప్రేక్షకులకు కొత్త కాదు. హీరో క్యారెక్టరైజేషన్ అంత కంటే కాదు. చేతిలో చిల్లిగవ్వ లేని హీరో కోట్లాది కోట్లకు అధిపతి కావడం, తన కనుసన్నల్లో నడిచే వేల కోట్ల నేర సామ్రాజ్యాన్ని స్థాపించడం, ఈ ప్రయాణంలో తనకు అడ్డొచ్చిన / తనను మోసం చేసిన వ్యక్తులను పైలోకాలకు పంపించడం... క్లుప్తంగా చెప్పాలంటే ఇదీ 'మట్కా' కథ. ఇంటర్వెల్ వరకు మట్కా ఆట మొదలు కాలేదు. అప్పటి వరకు వచ్చిన ఆ సీన్లు పలు పాత సినిమాలను తలపించాయి. సెకండాఫ్ సైతం ఎగ్జైట్ చేయదు. 

ఇటువంటి కథలు, సినిమాల్లో 'కేజీఎఫ్' తరహాలో భారీ యాక్షన్ సీక్వెనులు లేదంటే 'నాయకుడు' తరహాలో బలమైన భావోద్వేగాలు, పాత్రల మధ్య సంఘర్షణ ఉంటే తప్ప... సన్నివేశాలతో ప్రేక్షకులు ప్రయాణం చేయలేరు. అటు యాక్షన్, ఇటు ఎమోషన్ మధ్యలో ఏది ఎంచుకోవాలో తెలియక దర్శకుడు తడబడ్డారు. అవసరం అయితే 'మట్కా'లో కావాల్సినంత యాక్షన్ యాడ్ చేయొచ్చు. 'మాస్టర్'లో విజయ్ సేతుపతి లేదా 'కేజీఎఫ్'లో యష్ తరహాలో హీరో క్యారెక్టర్ డిజైన్ చేయవచ్చు. కానీ, ఆ పని చేయలేదు. పోనీ 'నాయకుడు'లో కమల్ హాసన్ తరహాలో డిజైన్ చేశారా? అంటే అదీ లేదు. ఈ తరహాలో ఫార్ములా కథలతో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఆ మేజిక్ రిపీట్ చేయడంలో కరుణ కుమార్ ఫెయిల్ అయ్యారు.  

యాక్షన్, ఎమోషన్ మధ్య సంఘర్షణలో సినిమా నలిగింది. కుమార్తెకు వాసు (వరుణ్ తేజ్) మేక - నక్క కథ చెబుతాడు. అందులో బలమైన ఎమోషన్ ఉంది. కానీ, ఆ కథ చెప్పే సమయానికి ప్రేక్షకుడు యాక్షన్ లేదంటే ఎత్తుకు పైఎత్తు వేస్తూ హీరో మైండ్ గేమ్ ఆడతారనో ఆశిస్తాడు. అందుకు భిన్నంగా ఒక్కసారిగా ఎమోషనల్ కథ చెప్పడంతో చిరాకు పడతాడు. కూతుర్ని కిడ్నాప్ చేసినప్పుడు హీరో వెళ్తున్న సమయంలో వచ్చే పాట కూడా 'ఇప్పుడు ఇవన్నీ ఎందుకు?' అని అసహనం వ్యక్తం చేసేలా ఉన్నాయి. హీరో హీరోయిన్ల ప్రేమ కథ, హీరో ఎదిగిన తీరు... ఏదీ ఆసక్తిగా అనిపించదు.

యాక్షన్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో జీవీ ప్రకాష్ కుమార్ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. పాటల్లో బావున్నవి ఉన్నా సరైన సందర్భంలో రాలేదు. కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైన్ 1960 నుంచి మొదలు పెడితే అప్పటి కాలాన్ని చాలా చక్కగా ఆవిష్కరించాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. ఖర్చుకు అసలు ఆలోచించలేదు.

Also Read: కంగువ రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉందా? - కోలీవుడ్ స్టార్ హిట్ కొట్టారా?


కథ, సినిమాను పక్కన పెట్టి... వాసు పాత్రను చూస్తే? ఆయా సన్నివేశాలకు ప్రాణం పోశారు వరుణ్ తేజ్. నటుడిగా ఆయన వైపు నుంచి ఎటువంటి లోపం లేదు. వివిధ దశల్లో వాసు పాత్రను ఆవిష్కరించిన తీరు అద్భుతం. ఆయన నటనలో ఇంటెన్స్ కనిపించింది. డైలాగ్ డెలివరీలో కమాండ్ వినిపించింది. సుజాతగా మీనాక్షి చౌదరి డీ గ్లామర్ రోల్ చేశారు. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ రోల్ అది. ఆమెకు ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు. సోఫియాగా అందాల ప్రదర్శన చేయకుండా కేవలం కళ్లతో ఆ పాత్రకు అవసరమైన ఫీల్ తీసుకొచ్చారు నోరా ఫతేహి. పద్మగా సలోని డిఫరెంట్ రోల్ చేశారు. కిశోర్, జాన్ విజయ్, 'సత్యం' రాజేశ్, నవీన్ చంద్ర తదితరులు తమ తమ పాత్రలు తగ్గట్టు చేశారు.

మట్కా... వెండితెరకు ఈ ఆట కొత్త. కానీ, ఆ ఆట నేపథ్యంలో రాసిన కథ కాదు. హీరో వరుణ్ తేజ్ (Varun Tej Matka Review)కు ఈ క్యారెక్టర్ కొత్త. కానీ, ప్రేక్షకులకు కాదు. రొటీన్ కథతో కమర్షియల్ ఫార్ములాలో తీసిన ఈ సినిమా లెంగ్తీగా సాగింది. వరుణ్ తేజ్ నటన, లుక్స్ పరంగా చూపించిన వేరియేషన్ బావున్నా... 'మట్కా' మాత్రం మనల్ని డిజప్పాయింట్ చేస్తుంది.

Also Readవరుణ్ తేజ్ సూపర్ హిట్ సినిమాలు... ఏయే ఓటీటీల్లో ఉన్నాయో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Embed widget