Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Journalist Injured in Mohan Babu Attack: తన నివాసం వద్ద మీడియా ప్రతినిధిపై నటుడు మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. గాయపడిన జర్నలిస్టుకు ఎముక విరిగిందని డాక్టర్లు తెలిపారు.
Mohan Babu Attack on Media at His home: హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై వీరంగం చేశారు. తన కుమారుడు మనోజ్ జల్‌పల్లిలోని తన నివాసం వద్దకు వచ్చిన సమయంలో జర్నలిస్ట్ రంజిత్‌పై దాడికి పాల్పడ్డారని తెలిసిందే. చేతిలో ఉన్న మైక్ ను లాక్కొని జర్నలిస్ట్ రంజిత్ తలపై మోహన్ బాబు బలంగా కొట్టారు. న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడం కలకలం రేపింది. జర్నలిస్టుకు గాయం కాగా, శంషాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. జర్నలిస్ట్ రంజిత్‌కు ఎముకలు విరిగి బోన్ ఫ్యాక్చర్ అయినట్టుగా డాక్టర్లు తెలిపారు. జైగోమాటిక్ ఎముక మూడు చోట్ల విరిగినట్లు సమాచారం. కంటికి, చెవికి మధ్య మూడు లెవెల్స్‌లో బోన్ ఫ్రాక్చర్ అయింది.
మూడు చోట్ల విరిగిన ఎముక, తప్పని సర్జరీ
ఆయనకు సర్జరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్ చెప్పడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. మీడియా ప్రతినిధులకు మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. క్షమాపణ చెప్పకపోతే ఆందోళనకు దిగుతామని సైతం మోహన్ బాబును జర్నలిస్ట్ సంఘాలు హెచ్చరించాయి. మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా మోహన్ బాబు ప్రవర్తించారని, ఆయనపై హత్యాయత్నం కేసు సైతం నమోదు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. మీడియా ప్రతినిధుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు కోరుతున్నారు. మరోవైపు మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్ట్ అయ్యప్ప మాలధారి కావడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. పవిత్రమైన అయ్యప్ప మాలధారి అయిన మీడియా ప్రతినిధిపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నారు.
మోహన్ బాబు, విష్ణు, మనోజ్‌లకు పోలీసుల నోటీసులు
జర్నలిస్టుపై దాడికి పాల్పడిన నటుడు మోహన్ బాబుపై పోలీసులు చర్యలు సిద్ధమయ్యారు. మోహన్ బాబుకు రాచకొండ పోలీసులు షాకిచ్చారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశారు. మోహన్ బాబు వద్ద ఉన్న గన్ సరెండర్ చేయాలని పోలీసులు ఆదేశించారు. మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మంచు మనోజ్‌లకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు.
మోహన్ బాబుపై మండిపడుతున్న జర్నలిస్ట్ సంఘాలు, ప్రతినిధులు
మోహన్ బాబు అహంకారపూరితంగా వ్యవహరించాలని, జర్నలిస్టుపై దాడికిగానూ బహిరంగ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ పెరుగుతోంది. తెలంగాణ హౌసింగ్ సొసైటీ, జర్నలిస్ట్ సంఘాలు, కేఏ పాల్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్, బీసీ జర్నలిస్టుల అసోసియేషన్ ఫౌండర్, తదితరులు మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడిని తీవ్రంగా ఖండించారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.
Also Read: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?