అన్వేషించండి

Mohanbabu to Manoj: భార్య మాటలు విని గుండెల మీద తన్నావు - నా ఆస్తి నా ఇష్టం - మనోజ్‌కు తేల్చి చెప్పిన మోహన్ బాబు

Machu Family Dispue: మంచు మనోజ్ పై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆడియో రిలీజ్ చేశారు. తాగుడుకు బానిసై అందర్నీ కొడుతున్నావని మండిపడ్డారు. తన ఆస్తి తన ఇష్టమన్నారు.

Mohan Babu released an audio expressing his anger on Manchu Manoj: మనోజ్‌ను ఉద్దేశించి ఆడియో రిలీజ్ చేసిన మోహన్‌బాబు.. అందులో సంచలన ఆరోపణలు చేశారు.  మనోజ్‌.. నిన్ను అల్లారుముద్దుగా పెంచానని..  చదువు కోసం చాలా ఖర్చు పెట్టాననని గుర్తు చేశారు.  భార్య మాటలు విని మనోజ్‌ నా గుండెలపై తన్నావ్‌ అని ఆడియోలో మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాగుడుకు అలవాటుకు పడి చెడు మార్గంలో వెళ్తున్నావని.. కొన్ని కారణాల వల్ల ఇద్దరు ఘర్షణ పడ్డామన్నారు. ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయన్నారు. 

ఇంట్లో ఉన్న అందరినీ ఎందుకు కొడుతున్నావని మోహన్ బాబు ప్రశ్నించారు. బతుకుదెరువు కోసం వచ్చిన పనివాళ్లను కొట్టడం మహాపాపమన్నారు.  నీ దాడిలో కొందరికి గాయాలయ్యాయి, అయినా కాపాడాననన్నారు. విద్యాసంస్థల్లో ప్రతీది లీగల్‌గా ఉంది, తప్పులు ఎక్కడా జరగలేదని స్పష్టం చేశారు. అన్నతో పాటు వినయ్‌ను కొట్టడానికి వచ్చావు. నీ అన్నను చంపుతానని అన్నావని ఆరోపించారు. నా ఇంట్లోకి అడుగుపెట్టడానికి నీకు అధికారం లేదని స్పష్టం చేశారు. ఇది నా కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లని తేల్చి చెప్పారు.  

Also Read:  ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?

రోడ్డుకెక్కి నా పరువు తీశావవని మోహన్ బాబు మండిపడ్డారు.  ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా.. వద్దా అనేది నా ఇష్టమని మోహన్‌బాబు స్పష్టం చేశారు.  0పిల్లలకు ఇస్తానా.. దానధర్మాలు చేస్తానా అనేది నా ఇష్టమని .. మా నాన్న నాకు ఆస్తులు ఇవ్వలేదు, అయినా నేను సంపాదించుకున్నానని మోహన్ బాబు తెలిపారు. మనోజ్ నన్ను కొట్టలేదు, మేమిద్దరం ఘర్షణ పడ్డామని..  నా ఇంట్లోకి నువ్వే అక్రమంగా చొరబడ్డావ్, నా మనుషులను కొట్టావ్ అని మోహన్ బాబు స్పష్టం చేశారు.  నాకు రక్షణ కావాలని పోలీసులను కోరానన్నారు. 

మళ్లీ తప్పు చేయనని చెప్పి ఇంట్లోకి వచ్చావని.. నీకు జన్మనివ్వడమేనా నేను చేసిన పాపం అని మోహన్ బాబు ప్రశ్నించారు. మంచు మనోజ్ కుమార్తె ఇంట్లోనే ఉంది.  నీ కూతురును వచ్చి తీసుకెళ్లు, నా దగ్గర వదిలిపెట్టినా ఇబ్బంది లేదని మోహన్‌బాబు తెలిపారు.  జరిగిన సంఘటనతో మీ అమ్మ ఆస్పత్రిలో చేరిందన్నారు.  పోలీసుల సమక్షంలోనే నీ బిడ్డను నీకు అప్పగిస్తానన్నారు. మోహన్ బాబు ఆడియో వైరల్ గా మారింది.         

                               

Also Read:  మెగా ఫ్యామిలీలో ఉన్న యూనిటీ మంచు ఫ్యామిలీలో లేదా? మరోసారి తెరపైకి కంపేరిజన్

కుమారుడు పోలీసుల వద్దకు వెళ్లిన సమయంలో ఆయనను ఉద్దేశించి మోహన్ బాబు ఈ ఆడియో రిలీజ్ చేశారు. అయితే ఆ తర్వాత మనోజ్ ఇంటికి రావడంతో పెద్ద గొడవ జరిగింది. మీడియాపై కూడా మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. మనోజ్ పై కూడా బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fine Rice Price Down: సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
Supreme Court Serious: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
BYD Plant In Telangana: తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Shreyas Iyer Ishan Kishan BCCI Contracts | ఐపీఎల్ ఆడినంత మాత్రాన కాంట్రాకులు ఇచ్చేస్తారా | ABP DesamShreyas Iyer Asutosh Sharma Batting IPL 2025 | అయ్యర్, అశుతోష్ లను వదులుకున్న ప్రీతిజింతా, షారూఖ్ | ABP DesamShashank Singh on Shreyas Iyer 97 Runs | GT vs PBKS మ్యాచ్ లో అయ్యర్ బ్యాటింగ్ పై శశాంక్ ప్రశంసలుShreyas Iyer 97 Runs vs GT IPL 2025 | గుజరాత్ బౌలర్లను చెండాడిన శ్రేయస్ అయ్యర్ | GT vs PBKS | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fine Rice Price Down: సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
సామాన్యులకు గుడ్‌న్యూస్ - భారీగా దిగొస్తున్న సన్న బియ్యం ధరలు, రీజన్ ఏంటంటే
Supreme Court Serious: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే - కేంద్రానికి, యూపీ ప్రభుత్వానికి నోటీసులు
BYD Plant In Telangana: తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
తెలంగాణలో BYD పెట్టుబడులు - హైదరాబాద్‌ సమీపంలో తయారీ యూనిట్!
Kodali Nani: ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత, ఛాతీలో నొప్పితో హాస్పిటల్‌లో చేరిక
Telangana Latest News:ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
Jr NTR: ఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!
ఎవరీ చరణ్ దేవినేని? రాముడి వెంట లక్ష్మణుడిలా... ఎన్టీఆర్ వెంట జపాన్ వెళ్ళినోడు!
Property Tax: ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
CM Chandrababu: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Embed widget