Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Nagababu Minister Post: ఏపీ మంత్రివర్గ విస్తరణలో భాగంగా జనసేనాని పవన్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఖాయమని ప్రకటన విడుదల చేశారు. ఆయనకు ఏ శాఖను ఇస్తున్నారు అంటే?
Janasena Party Minister List: రాజ్యసభకు వెళ్లాలని అనుకున్న మెగా బ్రదర్ ఆశలకు ఇప్పట్లో అవకాశం లేకపోవడంతో ఏపీ మంత్రి వర్గంలోకి వస్తున్నారా? తన రెండో అన్నయ్య, మెగా బ్రదర్ నాగబాబు (Nagababu)ను ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలోకి జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకు వస్తున్నారా? అంటే 'అవును' అని వినబడుతోంది. మరి నాగబాబుకు ఏ మంత్రి పదవి ఇస్తున్నారో తెలుసా? ఏపీ కేబినెట్‌లోకి నాగబాబు అని ప్రకటన విడుదల చేశారు. అంటే నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్లు ప్రకటించారు. శాఖ మాత్రం కేటాయించలేదు. ఆయనకు కేటాయించనున్న శాఖపై ఉత్కంఠ నెలకొంది.
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిగా నాగబాబు!?
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు కావచ్చు... తమ్ముడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనసేన పార్టీని మొదలు పెట్టినప్పుడు కావచ్చు... మెగా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటూ పార్టీని బలోపేతం చేసిన వ్యక్తి నాగబాబు. గత ఎన్నికల్లో జనసేన తరఫున అనకాపల్లి ఎంపీగా ఆయన పోటీ చేస్తారని బలంగా వినిపించింది. అయితే, పొత్తులో భాగంగా ఆ సీటును బిజెపికి త్యాగం చేయడంతో అప్పట్లో నాగబాబు ప్రత్యక్ష రాజకీయాలలో పోటీ చేయలేకపోయారు.
AP Cinematography Minister For Nagababu: అనకాపల్లి ఎంపీ సీట్లు త్యాగం చేసిన అన్నయ్య నాగబాబును రాజ్యసభకు పంపించాలని పవన్ కళ్యాణ్ భావించారని వినిపించింది. కానీ, ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు. దాంతో అన్నయ్యను ఏపీ మంత్రిని చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. నాగబాబుకు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖను ఇస్తున్నారని సమాచారం అందుతోంది.
ప్రస్తుతం ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ కందుల దుర్గేష్ దగ్గర ఉంది. దాంతో పాటు ఏపీ టూరిజం శాఖ కూడా ఆయన దగ్గర ఉంది. ఆ రెండిటిలో దుర్గేష్ దగ్గర టూరిజం ఉంచి సినిమా శాఖను నాగబాబుకు ఇవ్వనున్నారట. మరో వైపు సినిమాటోగ్రఫీ లేదంటే గనుల శాఖ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది.
టికెట్ రేట్లకు కీలకంగా మారిన సినిమా శాఖ
స్టార్ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాటోగ్రఫీ శాఖ ప్రస్తావన వస్తుంటుంది. టికెట్ రేట్లు పెంచుతూ జీవో విడుదల చేయాల్సింది సినిమాటోగ్రఫీ శాఖ దగ్గరకు నిర్మాతలు, దర్శకులు, హీరోలు వెళుతున్నారు. సినిమా వర్గాల్లో సినిమాటోగ్రఫీ శాఖకు విలువ ఉంటుంది.
Also Read: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
నాగబాబు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయితే ఇటు ఇండస్ట్రీ, అటు ప్రభుత్వం మధ్య వారధిగా ఉంటారని... ఇరు వర్గాలతో మంచి సత్సంబంధాలు మైంటైన్ చేస్తారని అందరూ భావిస్తున్నారు. ఆల్రెడీ సినిమా వర్గాల నుంచి నాగబాబుకు శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. ఆయనకు పలువురు కంగ్రాట్స్ చెబుతున్నారు.
Also Read: రామ్ చరణ్ సినిమాలో సల్మాన్ ఖాన్ ఉన్నాడా? డైరెక్టర్ ఏం చెప్పాడంటే?
Inspirational leader, outstanding achievement- Hearty Congratulations @NagaBabuOffl Anna! #nagababukonidela #JanaSenaParty #Janasena #Pawanakalyan #inspiration pic.twitter.com/Ua2wbK3Sr4
— RK Sagar (RK Naidu) (@urRKsagar) December 10, 2024