Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP Desam
నీలం రంగు సముద్రంపై కనిపిస్తున్న ఈ వంతెన అలాంటి ఇలాంటిది కాదు. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న రైల్వే బ్రిడ్జి ఇది. తమిళనాడులోని రామేశ్వరంలో సముద్రంపై శరవేగంగా పనులు పూర్తి చేసుకున్న ఈ బ్రిడ్జి పేరు పాంబన్ రైల్వే బ్రిడ్జి. ఆల్రెడీ దీని పక్కనే పాత బ్రిడ్జి ఒకటి ఉండేది. అక్కడే ఈ కొత్త బ్రిడ్జి ని నిర్మించారు.
దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా సముద్రంలో ఓడలు దీని దగ్గరకు వస్తే సెన్సార్ తో ఆటోమెటిక్ గా బ్రిడ్జి ఇదిగో ఇలా పైకి లేస్తుంది. ఇలా సముద్రంపై నిర్మితమైన తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జి ఇదే. 2070 మీటర్ల పొడవైన ఈ రైల్వే బ్రిడ్జిపై రైలు పరుగులు తీస్తుంది. కింద ఓడలు సాఫీగా వెళ్లిపోతాయి. సముద్రంపై జీవించే మత్స్యకారులకు ఇబ్బందులు లేకుండా...సరుకు రవాణాకు అడ్డంకి కాకుండా అటు రైలు ప్రయాణాలు సాఫీగా సాగేలా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశారు.
ఇంతకు ముందున్న పాత బ్రిడ్జి దాదాపుగా ఇక్కడ 110 ఏళ్ల క్రితం నిర్మించారు. ఏవైనా ఓడలు వస్తే దాన్ని కున్న పాసింగ్ గేట్స్ ను మనుషులు నిలబడి లాగాల్సి వచ్చేది. ఫలితంగా బ్రిడ్జి పైకి లేచి ఓడలు వెళ్లేందుకు వీలు కలిగేది. 110 ఏళ్ల తర్వాత ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించి మనుషులు అవసరం లేకుండా సెన్సార్లతో పనిచేసేలా ఈ సముద్రపు రైల్వే వంతెన భారతీయ రైల్వేశాఖ సొంతంగా నిర్మించింది. ఫుల్లీ ఆటోమెటేడ్ ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్ ద్వారా 17 మీటర్లు ఈ బ్రిడ్జి పైకి లేచేలా ఏర్పాట్లు చేశారు... ఇప్పటికే దీనిపై టెస్ట్ రన్ ను కూడా విజయంవంతగా పూర్తి చేశారు. ఇకపై దీని మీద రైలు ప్రయాణాలు ప్రారంభించే విధంగా అనుమతులు ఇవ్వాలని కేంద్రానికి రైల్వే శాఖ అధికారులు లేఖలు కూడా రాశారు. సేఫ్టీ రన్స్ అన్నీ పూర్తి అవటంతో కేంద్రం నుంచి అనుమతులు రాగానే దీనిపై రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఫలితంగా దేశంలోనే సముద్రంపై నిర్మించిన తొలి వర్టికల్ రైల్వే వంతెనగా పాంబన్ వర్టికల్ రైల్వే బ్రిడ్జి చరిత్రపుటల్లోకి ఎక్కనుంది.