అన్వేషించండి

KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు

Telangana News: లగచర్లలో అధికారులపై దాడి ఘటనకు సంబంధించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే తనను టార్గెట్ చేశారని మండిపడ్డారు.

KTR Media Chit Chat: సీఎం రేవంత్ రెడ్డికి (CM Revanth Reddy) తానంటే చాలా ప్రేమ ఉన్నట్లు ఉందని.. అందుకే తనను టార్గెట్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. గురువారం మీడియా ప్రతినిధులతో పలు అంశాలపై ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 'లగచర్లలో భూముల సేకరణ అంశంలో ప్రభుత్వం తీవ్రంగా భంగపడింది. దాన్ని కవర్ చేసుకునేందుకే ఇది కుట్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రైతుల పట్ల సర్కారు అమానుషంగా వ్యవహరిస్తోంది. దాడి చేశారంటూ దాదాపు 50 మంది రైతులను స్థానిక ఎస్పీ దగ్గరుండి కొట్టించాడు. సంఘటన జరిగినప్పుడు అక్కడ లేని బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకెళ్లి అమానుషంగా కొట్టారు. సురేశ్ అనే వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్తే.. ఆయనకూ భూమి ఉంది. లగచర్ల ఘటనలో పూర్తిగా ఇంటెలిజెన్స్, పోలీసుల వైఫల్యం ఉంది. రైతులపై దాడికి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్‌కు వెళ్లినట్లు వెళ్లారు. రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే గతంలో మానవ హక్కుల గురించి మాట్లాడిన కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదు. నిజంగా లగచర్లలో మేము కుట్ర చేసినట్లైతే మీడియా వాళ్లు వెళ్లి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు.' అని పేర్కొన్నారు. 

'నాలుగేళ్లలో మాదే అధికారం'

పోలీసులు, ఐపీఎస్ అధికారులూ ఇంత స్వామి భక్తి వద్దని కేటీఆర్ హితవు పలికారు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. 'తప్పు చేసిన అధికారుల విషయంలో ఇప్పుడు ఏపీలో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. లగచర్లలో అభిప్రాయ సేకరణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఎందుకు అక్కడ లేరు. పట్నం నరేందర్ రెడ్డి ఏదో నా పేరు చెప్పాడని రిమాండ్ రిపోర్ట్‌లో రాశారు. కానీ అదంతా బక్వాస్ అని పట్నం నరేందర్ రెడ్డి లేఖ రాశారు. నా మీద కేసు పెడితే నేను ఊరుకుంటా అనుకుంటే రేవంత్ రెడ్డి అంతే పిచ్చోడు మరొకరు ఉండరు. జైలు నుంచి వచ్చాక కూడా పోరాటం చేస్తా. ఈ విషయాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల, మహిళా కమిషన్ వరకు తీసుకెళ్తా.' అని అన్నారు.ఇప్పుడు ఆయన ప్రతిపాదిస్తున్న ఫార్మా విలేజ్ లకు పర్మిషన్ రావటానికి కూడా ఏడాది కి పైగా సమయం పడుతుంది. 

అమృతం ఏమైనా వస్తుందా.?

సీఎం రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ అంటూ మాటలు చెబుతున్నాడని.. కానీ అది జరగటం సాధ్యం కాదని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ చేసిన దానికి వ్యతిరేకంగా చేయాలన్న ఉద్దేశంతోనే ఫార్మా సిటీకి  ఫార్మా విలేజ్ పేరు మార్చి మేము చేసిన దానికి విరుద్ధంగా చేస్తున్నాడని మండిపడ్డారు. 'ఫార్మా సిటీ వస్తే కాలుష్యం అవుతుందని మీరే కదా గతంలో ప్రజల మనసులో విషం నింపారు. ఇప్పుడు కొడంగల్‌లో ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? ప్రజలు కూడా ఇదే విషయాన్ని అడుగుతున్నారు. సీఎం నియోజకవర్గంలో కలెక్టర్‌పై దాడి చేసేంత బలమైన వ్యక్తులా మేము?. ప్రాజెక్టులు, పెట్టుబడులు తేవాలంటే ఎంతో కష్టపడాలి. మా ప్రభుత్వంలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు హరీష్ రావు ఎంత కష్టపడ్డారో గుర్తు లేదా?. వీళ్లకు ప్రభుత్వాన్ని నడపటం చేతకావటం లేదు. కేవలం ఢిల్లీకి మూటలు పంపించేందుకే మూసీ ప్రాజెక్టును ముందు పెట్టుకున్నారు.' అని మండిపడ్డారు. 

'ఏం పీక్కుంటావో పీక్కో'

'నేను డ్రగ్స్ తీసుకోలేదు, ఫోన్లు ట్యాపింగ్ చేయలేదు, అవినీతి అంతకన్నా చేయలేదు. ప్రధాని మోదీనే మోడీయా బోడీయా ఏం పీక్కుంటారో పీక్కో అన్నాను. చిట్టి నాయుడికి కూడా అదే చెబుతున్నా.. ఏం పీక్కుంటావో పీక్కో. నిజాయితీకి ఉన్న ధైర్యమే ఇది. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఫినిష్ చేస్తా అంటాడు. ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో. నీ పదవికి ఎసరు పెట్టటానికి నల్గొండ, ఖమ్మం బాంబులు వేచి చూస్తున్నాయి. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చాక భూముల ధరలు భారీగా పెరిగాయి. రైతులకు ఆ భూములే ఆసరా అయ్యాయి. అలాంటి భూములను గుంజుకుంటా అంటే వారికి కోపం రాదా?. పదేళ్లు ప్రజలు మాకు అవకాశం ఇవ్వటాన్ని అదృష్టంగా భావించా. రేవంత్ రెడ్డి  ప్రభుత్వం 5 ఏళ్లు ఉండాలని నేను కోరుకుంటున్నా. వాళ్లు పూర్తికాలం అధికారంలో ఉంటేనే మళ్లీ బీఆర్ఎస్ 15 ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటుంది.' అని అన్నారు.

Also Read: Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Rashmika Mandanna : పుష్ప 2 సినిమా విడుదల దగ్గరయ్యే కొద్ది రష్మికకు టెన్షన్ పెరిగిపోతుందట, ఇన్​స్టా పోస్ట్​లో చెప్పేసిన బ్యూటీ
పుష్ప 2 సినిమా విడుదల దగ్గరయ్యే కొద్ది రష్మికకు టెన్షన్ పెరిగిపోతుందట, ఇన్​స్టా పోస్ట్​లో చెప్పేసిన బ్యూటీ
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Embed widget