అన్వేషించండి
Advertisement
Top Headlines Today: నేడు చంద్రబాబుతో ఎన్టీఆర్, రాంచరణ్ భేటీ- హీటెక్కిన తెలంగాణ రాజకీయం -మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Top 10 Headlines Today:
1. నేడు చంద్రబాబుతో ఎన్టీఆర్, రాంచరణ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబుతో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నేడు సమావేశం కానున్నారు. తుపాను బాధితులకు ప్రకటించిన విరాళాన్ని..ఈ ఇద్దరు స్టార్లు నేరుగా ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. టీడీపీ, ఎన్టీఆర్ మధ్య ఎప్పటి నుంచో గ్యాప్ ఉన్న వేళ ఎన్టీఆర్ ఈ భేటీకి వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు సమావేశం అయ్యేది వరద బాధితుల కోసమే అయినా ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
2. ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేసేస్తున్న పవన్
ప్రభుత్వం తనకు కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని పవన్ కల్యాణ్ ఖాళీ చేస్తున్నారు. విజయవాడలోని ఇరిగేషన్ భవన్‌ను పవన్ కల్యాణ్‌కు ప్రభుత్వం కేటాయించింది. పవన్ అక్కడే వరుస సమీక్షలు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే పవన్ క్యాంపు కార్యాలయం వెనకాలే కోర్టుల సముదాయం ఉంది. అక్కడకు వెళ్లి వచ్చే వారికి పవన్ కల్యాణ్ రాకపోకలతో ఇబ్బందిగా మారుతుందని ఫిర్యాదులు అందాయి. ప్రజల ఇబ్బందులు గమనించిన పవన్ ఆ భవనాన్ని ఖాళీ చేయాలని భావించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
3. ఆస్తి కోసం కన్నతండ్రినే చంపేసి...
ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తి కోసం ఓ కసాయి కొడుకు కన్నతండ్రినే కిరాతకంగా హత్య చేశాడు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మొలకలపూండ్లలో పాలెపు వెంకటేశ్వర్లు, అతని కుమారుడు శివాజీకి ఆస్తి విభేదాలు ఉన్నాయి. తాను చెప్పినట్లు ఆస్తి పంచాలని తండ్రిని శివాజీ కోరగా.. ఆయన నిరాకరించాడు. ఈ క్రమంలోనే గురువారం ఇద్దరికి గొడవ జరగగా తండ్రి వెంకటేశ్వర్లుపై బండరాయితో దాడి చేసి శివాజీ చంపేశాడు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
4. హీటెక్కిన తెలంగాణ రాజకీయం
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీ సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం హీటెక్కింది. హరీశ్‌రావు సహా బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు అర్ధరాత్రి సమయంలో విడుదల చేశారు. ఇవాళ కూడా కాంగ్రెస్-బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనకు దిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
5. ఇవాళ గాంధీ ఇంటికి కౌశిక్‌రెడ్డి
గురువారం జరిగిన ఘటనలకు కచ్చితంగా ప్రతిఘటన ఉంటుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానంటున్న గాంధీ ఇంటికి కార్యకర్తలతో వెళ్లి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేసి తెలంగాణ భవన్‌కు వస్తామన్నారు. మరోవైపు గాంధీ ఇంట్లో మేడ్చల్ బీఆర్‌ఎస్ నేతలంతా వచ్చి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ భేటీకి రావాలని కౌశిక్ రెడ్డికి కూడా ఆహ్వానం అందింది. ఆయన సమావేశానికి వస్తే మరోసారి ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
6. తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాన ముప్పు
తెలుగు రాష్ట్రాలకు వాన ముప్పు తప్పింది. ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఏపీలో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
7. ఆరేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడికి ఉరి
ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి సంగారెడ్డి జిల్లా కోర్టు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. బిహార్‌కు చెందిన గఫాఫర్(56) గతేడాది బానూరులో ఆరేళ్ల బాలికకు కూల్‌డ్రింక్‌లో మద్యం కలిపి తాగించి.. అత్యాచారం చేసి చంపేశాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేయగా.. తాజాగా కోర్టు అతడికి శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
8. ఢిల్లీ ఎయిమ్స్‌కు సీతారాం ఏచూరి పార్థివ దేహం
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంతో దేశ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. సీతారాం ఏచూరి పార్థివ దేహాన్ని అంత్యక్రియలు చేయడం లేదని.. ఆయన కోరిక మేరకు ఆయన దేహాన్ని ఢిల్లీ ఎయిమ్స్‌కు అప్పగించనున్నట్లు సీపీఎం నేతలు వెల్లడించారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ కూడా ధ్రువీకరించింది. రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ ఎయిమ్స్‌కు సీతారాం ఏచూరి పార్థివ దేహం అప్పగిస్తారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
9. ఈ సినిమా నటి... రియల్ విలన్
దాదాపు రూ.2 వేల కోట్ల ఆన్ లైన్ ట్రేడింగ్ స్కాంకు సంబంధించిన కేసులో అస్సాం నటి సుమిబోరాతోపాటు ఆమె భర్త తార్కిక్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాం పోలీసులు ఇటీవలే రూ.2 వేల కోట్ల కుంభకోణం గుట్టు రట్టు చేశారు. పెట్టుబడిని రెట్టింపు చేస్తామని.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ల పేరిట ప్రజల నుంచి మోసగాళ్లు సొమ్మును సమీకరించారు. ఈ కేసులో ఇప్పటికే విశాల్ పుకాన్‌ను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10.ఇషాన్... మెరిసెన్
అనంతపురంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ చెలరేగాడు. భారత్-సీ జట్టుకు ఆడుతున్న ఇషాన్ 121 బంతుల్లోనే (103*) సెంచరీ చేశారు. 14 ఫోర్లు, 2 సిక్సులతో ప్రేక్షకులను అలరించారు. ఇషాన్ బ్యాటింగ్ ముందు ఇండియా బీ జట్టు బౌలర్లు తేలిపోయారు. ఈ సీజన్లో అనంతపురంలో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. మరో బ్యాటర్ బాబా ఇంద్రజిత్ 62* పరుగులతో రాణించడంతో ప్రస్తుతం సీ జట్టు 63 ఓవర్లలో 270 పరుగులు చేసింది .పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement