Pawan Kalyan Vacate Office: ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Andhra Pradesh : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుత క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్నారు. ప్రస్తుతం తన వసతి గృహాన్నే క్యాంపు ఆఫీస్‌గా మార్చుకోనున్నారు.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యామ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తనకు కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసి తిరిగి ఇచ్చేస్తున్నారు. ఆఫీస్‌లోనే ఇప్పటి వరకు తను బస చేస్తున్న బిల్డింగ్‌నే క్యాంపు కార్యాలయంగా మార్చుకోనున్నారు.
విజయవాడలోని ఇరిగేషన్ భవన్‌ను డిప్యూటీ సీఎంగా, కీలక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ క్యాలణ్‌కు ప్రభుత్వం కేటాయించింది. అక్కడే వరుస సమీక్షలు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు అక్కడ సమస్యలు ఎదురవుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో ఆ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంగా ఉన్న భవనానికి వెనుకాలే కోర్టుల సముదాయం ఉంది. అందుకే అక్కడకు వెళ్లి వచ్చే వారికి పవన్ కల్యాణ్ రాకపోకలతో ఇబ్బందిగా మారుతుందని ఫిర్యాదులు అందాయి. పవన్ వచ్చి వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నిలిపేయడం, అధికారుల రాకపోకలతో కూడా కోర్టులకు వెళ్లే వచ్చే వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదని ఆయన దృష్టికి వచ్చింది.
ప్రజలు పడుతున్న ఇబ్బంది గమనించిన పవన్ కల్యాణ్ ఆ భవనాన్ని ఖాళీ చేయాలని భావించారు. గత కొద్ది రోజులుగా పార్టీ దగ్గర ఉన్న తను బస చేసే బిల్డింగ్‌లోనే సమీక్షలు నిర్వహించారు. ఇకపై దాన్నే క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని చూస్తున్నారు. అందుకే అధికారికంగా తనకు కేటాయించిన భవనాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. తనకు ఆ భవనాన్ని కేటాయించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞత చెప్పారు.
Also Read: తిరుపతి జనసేనలో వర్గభేదాలు, ఇంతకీ ఏం జరిగింది?
మంగళగిరిలో జనసేన కోసం ఐదు అంతస్తుల ఆఫీస్ కడుతున్నారు. ఇప్పటికే నిర్మాణం శరవేగంగా సాగుతోంది. మొదటి రెండు అంతస్తులు మరింత వేగంగా పూర్తి చేసి అందులోకి త్వరలో వెళ్లిపోవాలని చూస్తున్నారు. ఈ లోపు తాత్కాలిక క్యాంపు కార్యాలయంగా తను బస చేసే బిల్డింగ్‌ను వాడుకోనున్నారు. ఇప్పటికే జనసేనకు సంబంధించిన కార్యక్రమాలన్నీ అదే బిల్డింగ్‌లో జరుగుతున్నాయి. ఇకపై దాన్నే అధికారి క్యాంపు కార్యాలయంగా మార్చుకుంటున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు.
Also Read: ఏపీ 'టెట్' అభ్యర్థులకు అలర్ట్, హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్- డౌన్‌లోడింగ్ ఎప్పటినుంచంటే?