Tirupati News: తిరుపతి జనసేనలో వర్గభేదాలు, ఇంతకీ ఏం జరిగింది?
Tirupati Latest News: తిరుపతి జనసేన పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక నామినేట్ పోస్ట్ ఇవ్వడంపై వివాదం జరిగింది. ఇందులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
Tirupati Latest News: తిరుపతి ఆధ్యాత్మిక నగరం లో గత ఎన్నికల పరిణామాల నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీ సీటును కూటమి పార్టీలు జనసేనకు కట్టబెట్టాయి. ఇక పార్లమెంటు సీటును కూటమి నుంచి బీజేపీకి కట్టబెట్టారు. 100 రోజుల పరిపాలనలో వర్గవిభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
తిరుపతి ఎమ్మెల్యేగా గతంలో టీడీపీ నుంచి సుగుణమ్మ పోటీ చేసారు. తిరుపతి ఎమ్మెల్యేగా గతంలో టీడీపీ నుంచి సుగుణమ్మ పోటీ చేసారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి గెలుపు స్వల్పంగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె గెలుపు అమ్మకానికి మారింది అనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ఆ అంశం ప్రధానంగా తీసుకున్న టీడీపీ పార్టీ అభ్యర్థి ఎంపికలో కొంచెం గందరగోళం నెలకొంది. చిత్తూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే గా ఉన్న ఆరణి శ్రీనివాసులు అనూహ్యంగా చిత్తూరు వైసీపీని వీడి జనసేన పార్టీ లో చేరారు. తిరుపతి సీటు జనసేన కు అప్పగించినట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో కొంత మంది నాయకులు సైతం జనసేన వైపు చూసిన అప్పటికే జనసేన తిరుపతి సీటును ఎమ్మెల్యే అభ్యర్థి గా ఉన్న ఆరణి శ్రీనివాసులకు కట్టబెట్టింది పార్టీ. అనుకోని పరిణామంతో కూటమి పార్టీలు కొంత ఆసంతృప్తి వ్యక్తం చేసాయి. సమావేశాలు నిర్వహించారు.. కులాల వారీగా చర్చలు చేసారు.. అసమ్మతి వర్గం మొత్తం ఒక్కటిగా మారిపోయింది. ఈ పరిణామంతో గెలుపు సంగతి అటుంచి ప్రచారం సైతం పోలేని పరిస్థితి కి ఎమ్మెల్యే అభ్యర్థి చేరుకోవడం తో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి అసమ్మతి వర్గాలను శాంతింపజేసి అందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చారు.
నాటి నుంచి వ్యతిరేక వర్గాలు
తిరుపతి ఎమ్మెల్యే సీటు ప్రకటించిన నాటి నుండి జనసేన, టీడీపి లోని కొంత మంది నాయకులు కూటమి నిర్ణయం పై వ్యతిరేక స్వరం వినిపించారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థిని మార్చి స్థానికులకు ప్రధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే పార్టీల నిర్ణయం మేరకు అందరూ కలిసి ప్రచారం చేసి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిని 60వేల మెజారిటీతో గెలిపించారు. పార్టీ గెలుపు తరువాత 100 రోజులు కాలం గడవకముందే పార్టీలో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
నామినేటెడ్ పదవి ఇచ్చి
రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టుల కోసం నాయకులు ఎదురుచూస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి కేసులు పెట్టించుకుని ఐదేళ్ల పాటు ఇబ్బందులు పడిన వారు ఎందరో తమకు పోస్టు వస్తుందని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరుపతిలో ఎమ్మెల్యే సహకారంతో తిరుపతి రుయా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడి నామినేటెడ్ పోస్టు ఇవ్వడం పై తిరుపతి జనసేన నాయకులు మధ్య వివాదం బయటపడటానికి కారణమైంది. ఎన్నికల ముందు వరకు వైసీపీ లో ఉన్న బండ్ల లక్ష్మీపతి రాయల్ అనే వ్యక్తికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సిఫార్సు తో కమిటీ సభ్యుడిగా తెచ్చుకోవడం పట్ల జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సీనియర్లను పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చిన వారికి సీట్లు ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే ను ప్రశ్నించారు. ఆయన తన నివాసానికి రావైలని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్ రాయల్, వారి మద్దతుదారులను పిలిచారు. బుధవారం రాత్రి అందరూ ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే లేకపోవడం.. తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుని బయటకు వచ్చేసారు. అదే సమయంలో ఎమ్మెల్యే వర్గం.. కిరణ్ రాయల్ వర్గం లోని కొందరు మాట మాట పెంచుకుని తోపులాట, దాడి జరిగింది. దీంతో అక్కడ ఉన్న వారు సర్దిచెప్పి పంపివేసారు. ఈ పంచాయితీ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వరకు చేరినట్లు సమాచారం.
కిరణ్ రాయల్ వివరణ
‘‘పార్టీలో ఇటివల జరిగిన కొన్ని పరిణామాలపై ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తో చర్చించేందుకు జనసేన నేతలతో కలిసి వెళ్లాం. ఎమ్మెల్యే లేకపోవడంతో తిరిగి వస్తుండగా అటువైపు వెళుతున్న కొందరు వైసీపీ ఆకతాయిలు మా నేతలపై దాడి చేసారు. మేము వారిపై దాడులు చేసినట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తమ మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారు’’ అని కిరణ్ రాయల్ అన్నారు.