అన్వేషించండి
Advertisement
Morning Top News: లగచర్ల అధికారులపై దాడి కేసులో ట్విస్ట్, కులగణనపై మోదీ సంచలన వ్యాఖ్యలు వంటి టాప్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Morning Top News:
లగచర్ల అధికారులపై దాడి కేసులో ట్విస్ట్
తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్లలో అధికారులపై దాడి చేసిన కేసు కీలక మలుపు తిరిగింది. ఈ దాడి వెనుక మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉందని అనుమానిస్తున్న పోలీసులు ఆయన్ని ఈ ఉదయం అరెస్టు చేశారు. మార్నింగ్ వాkకు వెళ్లిన నరేందర్ రెడ్డిని ఫిలింనగర్‌లో అరెస్టు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
దూకుడు పెంచిన గులాబీ పార్టీ
తెలంగాణలో బీఆర్‌ఎస్ దూకుడు పెంచింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ట్రబుల్ షూటర్ హరీశ్ రావు ఇద్దరూ అధికార కాంగ్రెస్ నిప్పులు చెరుగుతున్నారు. అంశాల వారీగా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతుల రుణ మాఫీ, హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన, ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే అరికలపూడి గాంధీ సవాళ్ల వంటి అంశాలపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఆరు గ్యాంరటీ అమలుపైన వాగ్భాణాలు సంధిస్తూ పార్టీలో నూతనోత్తేజం నింపుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
యురేనియం తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ
యురేనియం తవ్వకాలపై ఏపీ ప్రభుత్వం నియమించిన నిజనిర్ధారణ కమిటీ మంగళవారం కీలక ప్రకటన చేసింది. యురేనియం తవ్వకాలు జరుగవని.. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని కమిటీ సభ్యులు వెల్లడించారు. ఇప్పటికే ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. దేవనకొండ ప్రజలు ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడులు
ఏపీలో రూ.65 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రిలయన్స్ ఎనర్జీ ముందుకు వచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలో 500 ఆధునిక బయోగ్యాస్ ప్లాంట్‌లను రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. రిలయన్స్ పెట్టుబడులతో రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది.
షర్మిలకు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అర్థం కాలేదని షర్మిల చేసిన వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బడ్జెట్ అర్థం కావాలంటే చట్టసభలకు వెళ్లాలి, మీరు ఇప్పుటి వరకు ప్రార్థన కూటమి సభలకు మాత్రమే వెళ్ళారు, మీకు బడ్జెట్ ఎలా అర్థం అవుతుందని ఆ పార్టీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
సజ్జల భార్గవ్‌రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ
YCP సోషల్ మీడియా కార్యకర్తలైన సజ్జల భార్గవ్‌రెడ్డి, అర్జున్ రెడ్డి సహా మరికొందరిపై కడప పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 8న పులివెందులలో వర్రా రవీందర్‌రెడ్డితో పాటు సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదైంది. ఏపీలో భార్గవ్ రెడ్డిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. విదేశాలకు పారిపోతారనే అనుమానంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
అల్పపీడనం ఎఫెక్ట్.. భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురవనున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్పపీడనం క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ నైరుతి దానిని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా తీరాల వెంట కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఆధునిక హంగులతో చర్లపల్లి రైల్వే స్టేషన్
430 కోట్ల రూపాయలతో ఆధునికంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ ను చూస్తే ఔరా అనాల్సిందే. ఇప్పటికే ఉన్న 5 ప్లాట్ ఫామ్స్ ను 9 ప్లాట్ ఫామ్స్ గా విస్తరించారు. 9 రైల్వే ట్రాక్స్ ను 19 చేశారు. 9 లిప్టులు, 5 ఎస్కలేటర్లు, భారీ స్దాయిలో పార్కింగ్ ఏరియా, రెస్టారెంట్స్, రెస్ట్ రూమ్స్ ,సెంట్రలైజ్డ్ ఏసి, వీటితోపాటు నాలుగు పిట్ లైన్లతో చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ పిట్ లైన్స్ లోనే ఏకకాలంలో నాలుగు రైళ్లు క్లీనింగ్ అండ్ రిపేరింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
గ్రూప్-2 మెయిన్స్ వాయిదా
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు APPSC ప్రకటించింది. జనవరి 5వ తేదీన జరగాల్సి పరీక్షలను ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొంది. పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి భారీగా విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు APPSC వెల్లడించింది. కాగా, 905 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
కులగణనపై మోదీ సంచలన వ్యాఖ్యలు
ఓబీసీలను విభజిస్తేనే కాంగ్రెస్‌కు ఆక్సిజన్ అని.. అందుకే కుల రాజకీయాలు చేసేందుకు సిద్ధమైందని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన సోలాపూర్ జిల్లాలో అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 'కులగణన పేరుతో కాంగ్రెస్ కొత్త కుట్రకు తెరలేపారు. బీసీలు ఐక్యంగా ఉంటేనే సేఫ్‌గా ఉంటారు. అందుకే కాంగ్రెస్ కుట్రను బీసీలు గమనించాలని' పిలుపునిచ్చారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
స్డూడియోలోనే నాగచైతన్య-శోభిత పెళ్లి
ప్రస్తుతం అక్కినేని అభిమానులు అందరి దృష్టి నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ళ పెళ్లిపైనే ఉంది. ఈ జంట పె పెళ్లి వేదికకు సంబంధించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ జంట హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి చేసుకోబోతోంది అంటూ కొత్త రూమర్ చక్కర్లు కొడుతోంది. నాగ చైతన్య కుటుంబానికి అన్నపూర్ణ స్టూడియోతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ జంట పెళ్లికి ఇదే కరెక్ట్ ప్లేస్ అని డిసైడ్ అయినట్టుగా ఇన్సైడ్ వర్గాల సమాచారం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion