అన్వేషించండి

Naga Chaitanya - Sobhitha Wedding: నాగ చైతన్య, శోభిత అన్నపూర్ణ స్టూడియోలోనే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారో తెలుసా?

టాలీవుడ్ స్టార్ కపుల్ నాగ చైతన్య, శోభిత ధూలిపాళ్ళ అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు విన్పిస్తున్నాయి. వాళ్ళు అక్కడే ఎందుకు పెళ్లి చేసుకోబోతున్నారో తెలుసా?

ప్రస్తుతం అక్కినేని అభిమానులు అందరి దృష్టి నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ళ పెళ్లిపైనే ఉంది. ఈ జంట పెళ్లికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాకపోయినప్పటికీ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరగబోతోంది? అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. పెళ్లి వేదికకు సంబంధించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ జంట హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి చేసుకోబోతోంది అంటూ గత కొన్ని రోజుల నుంచి కొత్త రూమర్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. మరి అన్నపూర్ణ స్టూడియోలోనే ఎందుకు నాగ చైతన్య - శోభిత పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి. 

డిసెంబర్ చివరలో నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ళ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారంటూ రూమర్లు షికార్లు కొట్టిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లోనే చై - శోభిత ఏడు అడుగులు వెయ్యబోతున్నారు అన్న వార్త బయటకు వచ్చింది. అయితే దీనికి ఒక ప్రత్యేకమైన రీజన్ ఉందంటూ టాక్ నడుస్తోంది. నాగ చైతన్య కుటుంబానికి అన్నపూర్ణ స్టూడియోతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ జంట పెళ్లికి ఇదే కరెక్ట్ ప్లేస్ అని డిసైడ్ అయినట్టుగా ఇన్సైడ్ వర్గాల సమాచారం. అక్కడ నాగ చైతన్య తాతయ్య, లెజెండరీ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఆశీర్వాదం, ఆధ్యాత్మిక శక్తి ఉందని నాగ చైతన్యతో పాటు అక్కినేని ఫ్యామిలీ భావిస్తుందని తెలుస్తోంది. అందుకే ఇద్దరూ జీవితాంతం కలిసి ఉండడానికి తాతయ్య ఆశీర్వాదాలు కూడా తోడవుతాయనే ఉద్దేశంతో చై, శోభిత అక్కడ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారని అంటున్నారు. పవిత్రంగా భావించే ఈ ప్రదేశంలో నాగ చైతన్య, శోభిత దూళిపాళ్లతో తన జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తన తాత ఆశీర్వాదాలను కోరుతూ అక్కడ పెళ్లి చేసుకోబోతున్నాడు అన్నమాట. పైగా తమ సొంత నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి చేసుకుంటే అతని కుటుంబానికి ఇదొక గౌరవ చిహ్నంగా ఉంటుందని భావిస్తున్నారని టాక్ నడుస్తోంది.

Read Also : Prabhas: పెళ్లి గురించి మాట్లాడిన ప్రభాస్... రెబల్ స్టార్ పర్సనల్ లైఫ్‌లో కన్‌ఫ్యూజన్ అంతా ఆ పాటల వల్లేనా? 

అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. మరోవైపు ఈ జంట పెళ్లి వేడుక ప్రైవేట్ గా జరగబోతుందని, కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ ఇప్పటిదాకా అసలు పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనే విషయంపై అక్కినేని ఫ్యామిలీ క్లారిటీ ఇవ్వలేదు. కాగా ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీ శోభితకు అఫీషియల్ గా తమ కోడలి హోదా ఇచ్చారు. ఏఎన్ఆర్ అవార్డ్స్ వేడుకలో మొట్టమొదటిసారి నాగచైతన్య, శోభిత కలిసి కనిపించారు. అలాగే దీపావళి సెలబ్రేషన్స్ ను కూడా అక్కినేని ఫ్యామిలీతో కలిసి జరుపుకుంది శోభిత. ఇదిలా ఉండగా వీరిద్దరి నిశ్చితార్థం ఆగస్టు 8న హైదరాబాద్లో జరిగింది.

Read Also : Bollywood Actor: 40 ఇయర్స్ ఇండస్ట్రీ, బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ చేసినా సరే అద్దె ఇంట్లో ఉంటున్న బాలీవుడ్ స్టార్... ఎందుకో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget