అన్వేషించండి

Bollywood Actor: 40 ఇయర్స్ ఇండస్ట్రీ, బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ చేసినా సరే అద్దె ఇంట్లో ఉంటున్న బాలీవుడ్ స్టార్... ఎందుకో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో కలిసొస్తే నటీనటులు కోట్లాది డబ్బులు, ఆస్తులు కూడబెట్టుకుంటారు. కానీ అనుపమ్ ఖేర్ మాత్రం ఇంకా రెంట్ ఇంట్లోనే ఉంటున్నారట ! ఎందుకో తెలుసా?

ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher) తాను ఇప్పటికీ రెంట్ ఇంట్లోనే ఉంటున్నట్టుగా వెల్లడించి షాక్ ఇచ్చారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోని దిగ్గజ నటులలో అనుపమ్ ఖేర్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి పాపులారిటీ ఉండి, దాదాపుగా 40 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో నటుడిగా రాణిస్తున్న ఈ సీనియర్ నటుడు ఎందుకు సొంత ఇంట్లో కాకుండా అద్దె ఇంట్లో ఉంటున్నారు? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.

'కార్తికేయ 2', 'టైగర్ నాగేశ్వర రావు' సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్. హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్ లైఫ్ జీవించడమే తనకు ఇష్టమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన ఈ విషయం గురించి మాట్లాడుతూ తను సొంతంగా ఇంటిని కొనుగోలు చేయకూడదని నిర్ణయించుకున్నాను అంటూ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. అందుకే ఇప్పటికి తాను అద్దె ఇంట్లోనే ఉంటున్నాను అని చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ "అసలు ఇంటిని ఎవరి కోసం కొనాలి? ఆ ఇంటికి ఖర్చు పెట్టే డబ్బులు బ్యాంకులో దాచుకుని, ప్రతినెలా అద్దె కట్టుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే భవిష్యత్తులో ఆస్తుల పంపకం విషయంలో పిల్లల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే అలా ఆస్తులను కొనుగోలు చేయడానికి పెట్టే డబ్బులు అలాగే దాచిపెట్టి, ఫ్యూచర్లో పిల్లలకు సమానంగా పంచితే సరిపోతుంది. అప్పుడైతే ఆస్తులు పంపకం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు" అని వివరించారు. అలా సొంత ఇంటి గురించి ఎంతో మంది కలలు అంటుంటే ఆయన మాత్రం అలాంటి పని తనకు ఇష్టం ఉండదు అంటూ చెప్పుకోచ్చారు. 

Read Also : Prabhas: పెళ్లి గురించి మాట్లాడిన ప్రభాస్... రెబల్ స్టార్ పర్సనల్ లైఫ్‌లో కన్‌ఫ్యూజన్ అంతా ఆ పాటల వల్లేనా? 

అలాగే వరుస సక్సెస్ లతో బిజీగా ఉన్న టైంలో తనకోసం ఒక ఇల్లు కొనివ్వమని తన తల్లి కోరిందని, ఆమె కోసమే ఇంటిని కొని తన తల్లి కలను నెరవేర్చాను అని చెప్పుకొచ్చారు అనుపమ్ ఖేర్. తన తండ్రి బ్రతికి ఉన్నప్పుడు తాము అక్కడే ఉండే వాళ్ళమని, కానీ తండ్రి పోయాక ఆ ప్రాంతంలో చాలా తక్కువగా ఉండడం వల్ల దాన్ని ఒక సెంటిమెంట్ గా తన తల్లి భావించిందని అన్నారు. సిమ్లాలోనే ఇల్లు కావాలని ప్రత్యేకంగా తన తల్లి కోరారని అనుపమ్ ఖేర్ ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే ఆమె ఏదో బంగ్లా కాకుండా కేవలం సింగిల్ బెడ్ రూమ్ అయితే చాలు అని అడిగిందని, కానీ తాను మాత్రం ఎనిమిది పడకలున్న ఒక ఇంటిని బహుమతిగా ఇచ్చానని తన తల్లి కలను నెరవేర్చిన క్షణాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే తన భార్య కిరణ్ కు తన ఆలోచనలతో ఏకీభవించడానికి టైం పట్టినప్పటికీ ఇప్పుడు మాత్రం అర్థం చేసుకుంటుందని చెప్పుకొచ్చారాయన. 

అయితే ఇదంతా రతన్ టాటా లాంటి గొప్ప మనుషుల నుంచి పొందిన స్ఫూర్తి అని అనుపమ్ ఖేర్ వివరించారు. రతన్ టాటాకు కోట్లాది ఆస్తి ఉన్నప్పటికీ సింపుల్ గా జీవించేవారని, జీవించడానికి చిన్న ఇల్లు, చిన్న కారు మాత్రమే ఆయనకు ఉండేవని, ఆయనను చూసే తాను ఇలా బ్రతకాలని నిర్ణయించుకున్నానని అనుపమ్ ఖేర్ వివరించారు.

Read Also : Alia Bhatt - Nag Ashwin: నాగ్ అశ్విన్ లేడీ ఓరియంటెడ్ మూవీ ప్లాన్... బాలీవుడ్ హీరోయిన్, 'ఆర్ఆర్ఆర్' ఫేమ్ ఆలియాతో చర్చలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget