నిఖిల్ కెరీర్‌లో హిట్స్ అండ్ ఫ్లాప్స్... తప్పకుండా చూడాల్సిన ఫిలిమ్స్ ఏవో తెలుసా?

నిఖిల్ హీరోగా పరిచయమైన సినిమా 'హ్యాపీ డేస్'. అది ఎవర్ గ్రీన్ క్లాసిక్. ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్.

'హ్యాపీ డేస్' తర్వాత నటించిన 'అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్' ఫ్లాప్ కాగా... 'యువత' హిట్.

'ఓం శాంతి', 'కళావర్ కింగ్', 'ఆలస్యం అమృతం', 'వీడు తేడా', 'డిస్కో'... బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వచ్చాయి.

'స్వామి రారా'తో నిఖిల్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కారు. ఆ తర్వాత ఆయన స్టోరీ సెలక్షన్ మారింది.

'స్వామి రారా', 'కార్తికేయ', 'సూర్య వర్సెస్ సూర్య'తో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు నిఖిల్.

'శంకరాభరణం' నిఖిల్ హిట్స్ జోరుకు బ్రేకులు వేయగా... 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మళ్ళీ విజయం అందించింది.

'కేశవ', 'కిరాక్ పార్టీ', 'అర్జున్ సురవరం' ఏవరేజ్ విజయాలే. ఆ తర్వాత నిఖిల్ దశ మారింది.

'కార్తికేయ 2' నిఖిల్ పాన్ ఇండియా హిట్ సాధించారు. 'స్పై', '18 పేజెస్' ఫ్లాప్ అయినా ఆయనపై ఎఫెక్ట్ లేదు.

ప్రజెంట్ నిఖిల్ 'స్వయంభు', 'ది ఇండియా హౌస్' వంటి పాన్ ఇండియా ఫిలిమ్స్ చేస్తున్నారు నిఖిల్.