Andhra Group 2 : ఆంధ్రా గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - వారు కోరుకున్నట్లుగానే పరీక్ష వాయిదా -ఎప్పటికంటే
Andhra : ఆంధ్రా గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు పదే పదే చేస్తున్న విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకుంది.
APPSC has decided to postpone the Andhra Group 2 exam: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 2 ఉద్యోగ పరీక్ష తేదీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్చింది. 2025 జనవరి 5న నిర్వహించాల్సిన పరీక్షను ఫిబ్రవరి 23కు రీషెడ్యూల్ చేశారు. ఇతర వివరాల కోసం కమిషన్ వెబ్‌సైట్ https://portal-psc.ap.gov.in/ సందర్శించాలని ఏపీపీఎస్సీ ప్రకటించింది.
పరీక్షల వాయిదా కోరుకున్న అభ్యర్థులు
గ్రూప్ 2 పరీక్షలకు ప్రిపరేషన్ కోసం సమయం సరిపోవడం లేదని కొంత కాలం వాయిదా వేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. ఇటీవల ఏపీపీఎస్సీ చైర్మన్ గా రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏఆర్ అనూరాధ నియమితులయ్యారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత.. అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల మేరకు వాయిదాకు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే వేపాడ చిరంజీవి రావు కూడా ఎపీపీఎస్సీ చైర్మన్ ను కలిసి ఉద్యోగార్థుల కోరిక మేరకు వాయిదా వేయాలని కోరారు. చివరికి అభ్యర్థులకు నెలన్నర వరకు అదనపు సమయం వచ్చేలా ఫిబ్రవరి 23వ తేదీకి రీ షెడ్యూల్ చేశారు.
Also Read : పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు-రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలుసా?
నిర్ణయం తీసుకున్న కొత్త చైర్మన్ ఏఆర్ అనూరాధ
ఏపీపీఎస్సీ మొత్తం 899 గ్రూప్-2 పోస్టులను ప్రకటించింది. గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్షను 2024 గత ఫిబ్రవరి 25న నిర్వహించి.. ఫతాలను ఏప్రిల్ 10న ప్రకటించారు. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు మొత్తం 92,250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరందరూ మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అప్పటి వరకూ ఏపీపీఎస్సీ చైర్మన్ గా చేసిన గౌతం సవాంగ్ రాజీనామా చేసి వెళ్లిపోయారు. కొత్త చైర్మన్ ను ఎంపిక చేసిన తర్వాత పరీక్ష జరగాల్సి ఉంది.
Also Read: నేటికీ కొనసాగుతున్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తి- అమల్లో ఉన్న విద్యా పథకాలు ఇవే
ప్రిపరేషన్‌లో అభ్యర్థులు
గ్రూప్ 2 మెయిన్స్ లో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఒక్కొక్క దానికి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు సిలబస్‌గా ఉన్నాయి. పేపర్-2లో భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు ఉంటాయి.