అన్వేషించండి

Telangana Politics: ముఖ్య నేతల ఢిల్లీ టూర్లు పూర్తి - ఇక తెలంగాణలో రాజకీయ బాంబులు పేలుతాయా ?

Telangana: తెలంగాణ రాజకీయాలు ఊహకందని మలుపులు తిరుగుతాయని అనుకుంటున్నారు కానీ ఎక్కడివక్కడే ఉంటున్నాయి. అన్ని పార్టీల ముఖ్యనేతలంతా డిల్లీ వెళ్లి వచ్చారు. మరి ఇప్పుడేం జరుగుతుంది ?

Telangana Poliics In Delhi: తెలంగాణ రాజకీయాలు రోజు రోజు హాట్ హాట్ గా మారిపోతున్నాయి. తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశం రాజకీయం అయితోంది. పరిశ్రమల కోసం భూసేకరణ దగ్గర నుంచి మూసి ప్రాజెక్టు ప్రక్షాళన వరకూ ప్రతీది రాజకీయమే. ఇలాంటి హడావుడిలో రేవంత్ పై ఫిర్యాదుకు అంటూ కేటీఆర్ డిల్లీకి వెళ్లారు. తర్వాత హైకమాండ్ తో భేటీకి రేవంత్ వెళ్లారు. బట్టి విక్రమార్క కూడా వెళ్లారు. బీజేపీ అగ్రనేతలు కిషన్ రెడ్డి ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలతో ఈ ఢిల్లీ పర్యటనలు అందరిలోనూ ఆసక్తి రేపాయి. ఇంతకీ అక్కడేం జరిగింది..? వాటి పరిణామాలు తెలంగాణలో ఎలా ఉంటాయి ?

కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి వస్తుందా ?

ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో విదేశీ కంపెనీకి చట్ట విరుద్ధంగా రూ. 55 కోట్లు తెలంగాణ ఖజానా నుంచి బదిలీ అయ్యాయి. ఇదందా కేటీఆర్ చేసిన స్కామ్ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకే త్వరలో బాంబులు పేలబోతున్నాయని ప్రకటించారు. ఈ స్కామ్ ను విచారణకు ఏసీబీకి ఇచ్చారు. ఏసీబీ అధికారులు కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి కోసం లేఖ ఇచ్చారు. కేటీఆర్ ప్రజాప్రతినిధిగా తన పదవీ కాలంలో .. అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలపై కేసు కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ అనుమతి ఉండాలి. లేకపోతే ఏ చర్యలు తీసుకున్నా చెల్లవు. అయితే ఇప్పుడు గవర్నర్ నుంచి పర్మిషన్ వస్తుందా లేదా అన్నదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. గవర్నర్ అనుమతి రాకుండా చూసుకోవడానికే కేటీఆర్  ఢిల్లీ  పర్యటనకు వెళ్లారని అమృత్ స్కీమ్ టెండర్లలో స్కాం అనేది పెద్ద జోక్ అని కాంగ్రెస్ అంటోంది. 

ఇప్పుడంతా స్విగ్గీ రాజకీయాలు - కాంగ్రెస్ టీ-20ని టెస్ట్ మ్యాచ్‌లా ఆడుతోంది - సొంత పార్టీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

రేవంత్, పొంగులేటి జైలుకు వెళ్తారన్న కేటీఆర్

మరో వైపు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిశారు. అమృత్ పథకం కింద తెలంగాణలో చేపడుతున్న పనులకు సంబంధించిన టెండర్లలో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేశారు. టెండర్ల వివరాలేమీ వెబ్ సైట్లో లేవని రేవంత్ రెడ్డి బావమరిదికి టెండర్లు ఇచ్చారని ఆరోపించారు. ప్రెస్మీట్ పెట్టి అవే ఆరోపణలు చేశారు.జాతీయ మీడియాకు ఇంటర్యూలు ఇచ్చారు. త్వరలో రేవంత్ , పొంగులేటి జైలుకు వెళ్తారని ప్రకటించారు. కేటీఆర్‌కు అంత ధీమా ఏమిటన్నది మాత్రం క్లారిటీ లేదు. తనను జైలుకు పంపుతామని అంటున్నారు కాబట్టి తన కంటే ముందే వారు జైలుకు వెళ్తారని కౌంటర్ ఇస్తున్నారా లేకపోతే నిడంగానే..  ఢిల్లీలో ఆయనకు ఏమైనా గ్యారంటీ లభించిందా అన్నది సస్పెన్స్ గానే ఉంది. కేటీఆర్ ఫిర్యాదుల పని పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చారు. 

ఢిల్లీకి రేవంత్,  భట్టి !

రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్లారు. వారు ఢిల్లీలో అధికారికంగా పార్టీ హైకమాండ్‌తో మాట్లాడి.. ఆ తర్వాత తమకు కేటాయించిన రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తారు. రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. జార్ఖండ్‌లో భట్టి విక్రమార్క ప్రచారం చేస్తారు. అయితే ఢిల్లీ పర్యటనలో అంతర్గత రాజకీయాలపై చర్చ కూడా ఉంటుందని భావిస్తున్నారు.   

కలెక్టర్‌పైనే దాడి చేసేలా తెలంగాణలో రాజకీయాలు - తెలంగాణ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?

ఇక తెలంగాణ రాజకీయాల్లో మార్పులు వస్తాయా ?

ఢిల్లీ పర్యటనలు.. ప్రచారాలు పూర్తి చేసుకున్న తర్వాత అందరూ తెలంగాణకు చేరుకున్న తర్వాత కీలక పరిణామాలు ఉండే అవకాశం ఉంది. గవర్నర్ కేటీఆర్ విచారణకు అనుమతి ఇస్తే ఓ రకంగా.. ఇవ్వకపోతే మరో రకంగా రాజకీయాలు ఉంటాయి. ఏదైనా  తెలంగాణ పాలిటిక్స్ మాత్రం ఊహించని మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Embed widget