PM Modi On Caste Census: ఓబీసీలను విడగొట్టేందుకు కాంగ్రెస్ కొత్త నాటకం, కులగణనపై నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు
ఓబీసీలను విడగొట్టేందుకు కాంగ్రెస్ కొత్త నాటకం మొదలుపెట్టిందని, మహారాష్ట్రలో అధికారం ఇస్తే కులగణనతో మీ రిజర్వేషన్లు తగ్గిస్తుంది అంటూ నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Maharashtra Assembly Elections 2024 | విభజించి పాలించండం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని, ఓబీసీలు ఐక్యంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓబీసీ లను విభజిస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ అందుతుందని, అందుకే కుల గణన పేరుతో హస్తం పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓబీసీలు ఐక్యంగా ఉన్నంతవరకూ సేఫ్ అని, లేకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వే ఇటీవల ప్రారంభించింది.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ
త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సోలాపూర్ జిల్లాలో చిమూర్ సహా పలు ప్రాంతాల్లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్ నిర్వహిస్తున్న సమగ్ర సర్వేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమగ్ర సర్వే పేరుతో కుల గణన నిర్వహించి ఓబీసీల కోటా తగ్గిస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహారాష్ట్రలో కుల గణన చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో సైతం పేర్కొన్నారని.. ప్రజలు ఇది గుర్తించాలన్నారు. కులగణన పేరుతో కాంగ్రెస్ కొత్త కుట్రకు తెరలేపిందని, బీసీలు ఐక్యంగా ఉన్నంత వరకు ఏ సమస్య ఉండదన్నారు. సర్వేలు చేసి సమాజాన్ని విడగొట్టడం కాదు, అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పనులు చేయాలని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు.
कांग्रेस ने जम्मू कश्मीर विधानसभा में अनुच्छेद 370 फिर से लागू करने का प्रस्ताव पास किया है।
— BJP (@BJP4India) November 12, 2024
जो लोग संविधान की किताबें देश को दिखा रहे हैं और महाराष्ट्र में कोरे कागजों वाली किताब बांट रहे हैं, जरा मैं उनको पूछना चाहता हूं, 6-7 दशक तक उन्होंने (कांग्रेस) देश पर राज किया है,… pic.twitter.com/yVQcIRXNxX
ఓ సిద్ధాంతం, నైతికత లేని పార్టీ కాంగ్రెస్. వారికి అధికారం మాత్రమే కావాలి. అధికారం కోసం కాంగ్రెస్ ప్రజలను విభజిస్తుంది.మతం, భాష, ప్రాంతం ప్రాతిపదికన దేశాన్ని విభజించి అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడదు. ఇప్పుడు కూడా అధికారం కోసం కాంగ్రెస్ దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనుల (SC, ST, OBC)ను విభజించడానికి కుల గణన సర్వే అంటూ కొత్త నాటకం మొదలుపెట్టింది. ముందు సర్వే పేరుతో విడగొడుతుంది. తరువాత రిజర్వేషన్లను సైతం తగ్గించే ప్రయత్నాలు జరుగుతాయి. కనుక మీకు ఐక్యంగా ఉన్నంతవరకూ ఏ నష్టం జరగదు - ప్రధాని నరేంద్ర మోదీ
Also Read: EPFO Wage Ceiling: వేతన జీవులకు త్వరలోనే కేంద్రం గుడ్ న్యూస్ - ఈపీఎఫ్ఓ పరిమితి రూ.21 వేలకు పెంపు!
ఆదివారం జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని మోదీ దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. బొకారో స్టీల్ సిటీలో బీజేపీ ర్యాలో మాట్లాడుతూ.. ఓబీసీలను కాంగ్రెస్ విడగొట్టి కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుందన్నారు.