AP BJP On Sharmila: బడ్జెట్ అర్థం కావావాలంటే చట్టసభలకు వెళ్లాలి ప్రార్థనా కూటములకు కాదు - షర్మిలకు ఏపీ బీజేపీ కౌంటర్
BJP : బడ్జెట్ సరిగ్గా లేదన్న షర్మిల వ్యాఖ్యలకు కూటమి పార్టీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బడ్జెట్ అర్థం కావాలంటే అసెంబ్లీకి వెళ్లిన అనుభవం ఉండాలన్నారు.
AP BJP Vishnu: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అర్థం కాలేదని షర్మిల చేసిన వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బడ్జెట్ అర్థం కావాలంటే చట్టసభలకు వెళ్లాలి, మీరు ఇప్పుటి వరకు ప్రార్థన కూటమి సభలకు మాత్రమే వెళ్ళారు, మీకు బడ్జెట్ ఎలా అర్థం అవుతుందని ఆ పార్టీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.
ఏపిలో#NDA కూటమి బడ్జెట్ ఒక జోక్ , నిధుల కేటాయింపులపై స్పష్టత లేదు , అంతా మోసం!
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) November 12, 2024
- షర్మిల గారు విమర్శ.
బడ్జెట్ అర్థం కావాలంటే చట్టసభలకు వెళ్లాలి, మీరు ఇప్పుటి వరకు ప్రార్థన కూటమి సభలకు మాత్రమే వెళ్ళారు, మీకు బడ్జెట్ ఎలా అర్థం అవుతుంది? @realyssharmila #AndhraPradesh…
బడ్జెట్‌పై షర్మిల ఏమన్నారంటే ?
ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన షర్మిల బడ్దెట్‌పై విమర్శలు గుప్పించారు. ఇది బడ్జెట్ నో... మ్యానిఫెస్టో నో ప్రజలకు క్లారిటీ లేదు. ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు మళ్ళీ చెప్పారని విమర్శింంచారు. బడ్జెట్ అంటే కేటాయింపులు.. ఇది కేటాయింపులు లేని బడ్జెట్ ఇది మరో మ్యానిఫెస్టో అని వాదించారు. సూపర్ సిక్స్ అమలు చేయాలి అంటే ప్రతి ఏడాది లక్షా 20 వేల కోట్లు కావాలి... చంద్రబాబు ఈ బడ్జెట్ లో కనీసం పావు వంతు కూడా కేటాయింపు లేదన్నారు. మహిళా శక్తి కింద ప్రతి నెల 15 వందలు ఇస్తామన్నారు.. కోటి మంది మహిళలు రాష్ట్రంలో ఉన్నారు..ఈ పథకం కింద వచ్చే 5 నెలల్లో 7500 కోట్లు ఇవ్వాలి కానీ ఈ పథకానికి నిధులు రూపాయి కూడా కేటాయించలేదన్నారు. తల్లికి వందనం కింద 15 వేలు ప్రతి బిడ్డకు ఇస్తాం అన్నాడు దాదాపు 10 వేల కోట్లు ఇవ్వాలిబడ్జెట్ లో నిధులు కేవలం 2 వేల కోట్లు కేటాయించారన్నారు. ఏ పథకానికి నిధుల కేటాయింపు లేదని ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిన బడ్జెట్.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అన్యాయం చేసిన బడ్జెట్ అని విమర్శించారు.
బడ్దెట్‌ను పొగిడిన కూటమి పార్టీలు
ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పటికీ మంచి బడ్జెట్ ప్రవేశ పెట్టారని అన్ని పథకాలకూ నిధులు కేటాయించారని ఏపీలోని ఇతర కూటమి పార్టీలు ప్రశంసించాయి. జనసేన, బీజేపీ నేతలు బడ్జెట్ ను విమర్శిస్తున్న ఇతర పార్టీలపై మండిపడుతున్నారు. వైసీపీ హ యాంలో ఒక్క బడ్దెట్ కూడా సరిగ్గా అమలు చేయలేదని.. కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నిస్తూంటే విమర్శలు చేస్తున్నారని అంటున్నారు.
మహారాష్ట్రలో ఎన్నికల విధుల్లో విష్ణువర్ధన్ రెడ్డి
ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మహారాష్ట్రలో ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఆయన బీజేపీ తరపున నాందెడ్ ఎన్నికల ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ ఏపీలో రాజకీయాలపై.. కూటమిపై విమర్శలు చేసే నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు.
Tomorrow, Mukhed is all set for an important #Maharashtra elections meeting, with MLAs and key leaders coming together to review ongoing projects.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) November 12, 2024
Preparations are in full swing, from helipad arrangements to the public gathering venue. Special guests include Shri @Dev_Fadnavis… pic.twitter.com/MFrypQaLtT