Top Headlines Today: ఏపీలో ఎన్నికలు ముందస్తేనా?; తెలంగాణలో ఆలస్యమా? - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
కేటీఆర్ భావిస్తున్నట్లుగా ఎన్నికలు ఆలస్యమైతే ఏం జరుగుతుంది ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావొచ్చని పార్లమెంట్ తో పాటు మే నెలలో జరిగినా ఆశ్చర్యం లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశాయి. భారత ప్రజాస్వామ్యంలో ఇలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యం కావడం అనేదే లేదు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ పదవి కాలం పూర్తయ్యే లోపు కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకునేలా ఈసీ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఎన్నికలు నిర్వహించలేని సందర్భమే లేదు. ఎన్నికలు నిర్వహించి తీరాలి. ఎందుకంటే అది రాజ్యంగ నిబంధన కానీ ఈ సారి జమిలీ ఎన్నికల ఆలోచనలో ఉన్న కేంద్రం.. మొదటి సారి మినీ జమిలీకి ప్లాన్ చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఈ కారణంగా ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ చేసి మరీ డిసెంబర్ లో జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను ఆలస్యం చేస్తారని అంటున్నారు. నిజంగా ఇలా చేస్తే తెలంగాణ రాజకీయాల్లో పరిస్థితి ఏమిటన్నది అప్పుడే చర్చనీయాంశంగా మారింది. ఇంకా చదవండి
కేసు కొట్టేయండి, హైకోర్టులో చంద్రబాబు లాయర్ క్వాష్ పిటిషన్
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో సీఐడీ నమోదు చేసిన కేసు, ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్లను కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ ముగిసేవరకూ ఏసీబీ కోర్టులో విచారణపై స్టే విధించాలని కోరారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ మంగళవారం (సెప్టెంబరు 12) హైకోర్టు ప్రారంభ సమయంలో ఈ పిటిషన్ వేశారు. ఇంకా చదవండి
తెలంగాణకు మరోసారి అమిత్ షా, డేట్ ఫిక్స్
తెలంగాణ విమోచన దిన వేడుకల కోసం కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా తెలంగాణకు రానున్నారు. సెప్టెంబరు 17న ఈ వేడుకల్లో పాల్గొనడానికి ఒక్కరోజు ముందే అమిత్ షా హైదరాబాద్‌కు వస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 16న రాత్రి 7.55 గంటలకు ఔరంగాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఆర్పీఎఫ్ సెక్టార్స్ ఆఫీసర్స్ మెస్‌కు చేరుకుని ఆ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు. 17న ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుని తెలంగాణ విమోచన దిన వేడుకల్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో తెలంగాణ ప్రజల నుద్దేశించి అమిత్ షా ప్రసంగించనున్నారు. ఇంకా చదవండి
AP స్కిల్ డెవలప్ మెంట్ లో స్కాం జరగలేదు, డీజీ టెక్ కంపెనీ ఎండీ కీలక విషయాలు వెల్లడి
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‍తో ఒప్పందంలో ఎలాంటి స్కాం జరగలేదని డిజిటెక్ కంపెనీ ఎండీ ఖన్వెల్కర్ స్పష్టం చేశారు. ఏపీలో స్కిల్ స్కామ్ జరిగిందని చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరం అన్నారు. ఒప్పందానికి సంబంధించి మొత్తం వ్యవహారాన్ని వివరిస్తూ కంపెనీ తరపున వీడియో విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రూ. 371 కోట్ల విలువైన మొత్తం సామగ్రిని సరఫరా చేశామని తెలిపారు. ఇంకా చదవండి
ఇంకా ఎవరి నుంచో క్లారిటీ రావాలి - బీజేపీలో చేరిక ఆలస్యంపై చీకోటి ప్రవీణ్
చికోటి ప్రవీణ్ బీజేపీలో చేరికపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరి నిమిషంలో బీజేపీలో చేరిక రద్దయింది. పార్టీలో చేరికపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు చీకోటి ప్రవీణ్. ఇంకా ఎవరి నుంచో క్లారిటీ రావాలన్న ఆయన...ఇదేం పెద్ద సమస్య కాదన్నారు. ఎన్నో ఆటు పోట్లను చూశానని., ఇంతకంటే పెద్ద సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పారు. పార్టీలో చేరికపై త్వరలోనే క్లారిటీ ఇస్తానన్నారు చీకోటి ప్రవీణ్. ఇంకా చదవండి
306 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు, టాప్ లో బీజేపీ నేతలు: ఏడీఆర్ నివేదిక
లోక్ సభ, రాజ్యసభలోని 763 మంది సిట్టింగ్ ఎంపీలలో 306 మంది అంటే 40 శాతం మంది ఎంపీలపై హత్యలు, మహిళలపై అత్యాచారం లాంటి నేరారోపణలతో క్రిమినల్ కేసులు ఉన్నాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) తాజా అధ్యయనం దేశంలోని సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుల క్రిమినల్ బ్యాగ్రౌండ్ కు సంబంధించిన వివరాలను బహిర్గతం చేసింది. మంగళవారం విడుదల చేసిన ఏడీఆర్ నివేదిక ప్రకారం.. లోక్‌సభ, రాజ్యసభలోని 763 మంది ఎంపీలలో 306 (40 శాతం) మంది తమపై హత్యలు, మహిళలపై దాడి లాంటి నేరారోపణలు ఉన్నట్లు నేతలు స్వయంగా ప్రకటించారు. ఇంకా చదవండి
హాట్ టాపిక్ గా హర్ష గోయెంకా ట్వీట్, ఇస్రో ఛైర్మన్ జీతం గురించి ఏమన్నారంటే?
ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష గోయెంకా.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అతి తక్కువ మంది ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఆయన కూడా ఒకరు. సోషల్ మీడియాలో ఆయన పెట్టే పోస్టులతో ఆలోచనలు రేకెత్తిస్తారు. వినోదభరితంగా సందేశాలు అందిస్తారు. ప్రేరణాత్మక, ఆసక్తికరమైన పోస్టులు చేస్తుంటారు. ఆయన చమత్కారమైన, హాస్యభరితమైన ట్వీట్లు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇంకా చదవండి
‘బిగ్ బాస్’ బిల్డప్ - ‘బ్రహ్మాస్త్ర’ స్టైల్‌లో మాయాస్త్రకు హైప్
బిగ్ బాస్ సీజన్ 7 ముందు నుండే అంతా ఉల్టా పుల్టాగా ఉంటుందని చాలా హైప్ క్రియేట్ చేశారు. అందుకే అస్త్రాలను గెలుచుకోవాలని, అలా అయితేనే హౌజ్‌మేట్స్‌గా కొనసాగే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ కూడా ముందు నుండే క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7లోని మొదటి వారంలో పవర్ అస్త్రా అనే ఒక అస్త్రాన్ని సొంతం చేసుకున్నాడు సందీప్. దీంతో తను బిగ్ బాస్ హౌజ్‌లో పర్మనెంట్ హౌజ్‌మేట్ అయిపోయాడు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా మాయాస్త్రం కోసం పోటీపడాలి అంటూ ‘బ్రహ్మాస్త్ర’ సినిమా స్టైల్‌లో ఒక పిట్టకథను అందరికీ వినిపించారు బిగ్ బాస్. ఇంకా చదవండి
అత్యంత ఖరీదైన ఐఫోన్ లాంచ్ చేసిన యాపిల్
ఐఫోన్ 15 ప్రో సిరీస్‌ను యాపిల్ గ్లోబల్‌గా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఏ17 బయోనిక్ ప్రాసెసర్లపై ఈ ఫోన్లు పని చేయనున్నాయి. యాపిల్ వాచ్ అల్ట్రాలో అందించిన ప్రోగ్రామబుల్ యాక్షన్ బటన్‌ను ఈ సిరీస్‌లో అందించారు. ఛార్జింగ్ కోసం లైట్‌నింగ్ పోర్టు కాకుండా యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఉండనున్నాయి. ఇంకా చదవండి
తక్కువ స్కోరును కాపాడుకున్న భారత్ - లంకపై 41 పరుగులతో విజయం!
శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ 2023 సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం శ్రీలంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంకా చదవండి