News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Chikoti Praveen: ఇంకా ఎవరి నుంచో క్లారిటీ రావాలి - బీజేపీలో చేరిక ఆలస్యంపై చీకోటి ప్రవీణ్

కోటి ప్రవీణ్‌ బీజేపీలో చేరికపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇంకా ఎవరి నుంచో క్లారిటీ రావాలన్న ఆయన...ఇదేం పెద్ద సమస్య కాదన్నారు.

FOLLOW US: 
Share:

చికోటి ప్రవీణ్‌ బీజేపీలో చేరికపై నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరి నిమిషంలో బీజేపీలో చేరిక రద్దయింది. పార్టీలో చేరికపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు చీకోటి ప్రవీణ్. ఇంకా ఎవరి నుంచో క్లారిటీ రావాలన్న ఆయన...ఇదేం పెద్ద సమస్య కాదన్నారు. ఎన్నో ఆటు పోట్లను చూశానని., ఇంతకంటే పెద్ద సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పారు. పార్టీలో చేరికపై త్వరలోనే క్లారిటీ ఇస్తానన్నారు చీకోటి ప్రవీణ్. 

ప్రాంతాలతో సంబంధం లేకుండా విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అభిమానులు వచ్చారని అన్నారు. బీజేపీ అంటే క్రమశిక్షణకు మారుపేరన్న చీకోటి ప్రవీణ్...పార్టీ పెద్దలతో భేటీ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. మీ అందరి బలం, ఆశీర్వాదం, అభిమానం నాకుందంటూ ఫ్యాన్స్ తో అన్నారు. రాజకీయాల్లో ఆవేశం పనికి రాదని ఓపికతో ఉండాలన్నారు. రేపు దీక్ష కారణంగా సీనియర్లు అందుబాటులో లేరని బీజేపీ కార్యాలయం సిబ్బంది చెప్పడంతో ఆయన నిరాశగా వెనుదిరిగారు. 

కేసినో కింగ్ చికోటి ప్రవీణ్ కు షాక్ తగిలింది. కమలం పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్న చీకోటి ప్రవీణ్‌కు చుక్కెదురైంది. తన అనుచరులతో కలిసి సంతోష్‌ నగర్‌ నుంచి ర్యాలీగా.. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోసం గంటల పాటు వేచి చూశారు. చీకోటి, తన అనుచరులు పడిగాపులు కాశారు. చీకోటి రాకముందే పార్టీ కార్యాలయం నుంచి కిషన్‌రెడ్డి వెళ్లిపోయారు. దీంతో హంగు ఆర్భాటాలతో వచ్చిన చీకోటి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈడీ సోదాలతో ఫేమస్‌ అయిపోయిన చికోటి.. అసలు ఎవరు? అనేది ఆసక్తికరం. అతడి లైఫ్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ఇప్పుడు మంత్రులు, మాజీ మంత్రులు, కీలక ప్రజాప్రతినిధులతో సెల్ఫీ దిగేవరకు వెళ్ళాడు. ఈవెంట్లకు బాలీవుడ్‌, టాలీవుడ్‌ హీరోయిన్లను పిలిచి రెమ్యునరేషన్‌ ఇచ్చినా, తన చుట్టూ హంగు ఆర్భాటం ఉన్నా క్యాసినోతో పాటు.. చీకటి వ్యాపారాన్ని నడుపుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం చీకోటి ప్రవీణ్ చిన్న సిరామిక్‌ టైల్స్‌ వ్యాపారి.. సినిమాలంటే ఆసక్తి ఉండడంతో.. నిర్మాతగా మారి సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు.. విలన్‌గా నటించినా సంపాదించింది లేదు కానీ.. అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అప్పుల నుంచి బయటపడేందుకు వనస్థలిపురంలో ఒక డాక్టర్‌ను కిడ్నాప్‌ చేయడం, ఆ కేసులో జైలుకు సైతం వెళ్లాడు.

ఆ తర్వాత గోవాలో ఓ పేకాట క్లబ్‌లో కొన్ని టేబుళ్లను అద్దెకు తీసుకుని పేకాట నిర్వహిస్తూ వచ్చాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ క్యాసినో సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అలా ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు.. అన్ని డిపార్ట్‌మెంట్లతో టచ్‌లోకి వెళ్లాడు. రాజకీయ నేతలను సైతం బుట్టలో వేసుకున్నాడు. 

Published at : 13 Sep 2023 06:45 AM (IST) Tags: BJP Chikoti Praveen Casino King Telangana

ఇవి కూడా చూడండి

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన

Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన

Hyderabad Traffic Restrictions: గురువారం హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం, ట్రాఫిక్ ఆంక్షలు ఇలా

Hyderabad Traffic Restrictions: గురువారం హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం, ట్రాఫిక్ ఆంక్షలు ఇలా

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Revanth Reddy: చంద్రబాబు జాతీయ నేత, నిరసనలకు అనుమతి ఇవ్వరా? కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

Revanth Reddy: చంద్రబాబు జాతీయ నేత, నిరసనలకు అనుమతి ఇవ్వరా? కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

టాప్ స్టోరీస్

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్‌ మాక్సీ! రాజ్‌కోట్‌ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రం, సీబీఐ విచారణకు ఆదేశం

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్

Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్