అన్వేషించండి

iPhone 15 Pro Series: అత్యంత ఖరీదైన ఐఫోన్ లాంచ్ చేసిన యాపిల్ - కొత్త యాక్షన్‌తో వచ్చిన ఐఫోన్ 15 ప్రో!

iPhone 15 Pro Series: యాపిల్ ఐఫోన్ 15 ప్రో సిరీస్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ సిరీస్ ధర రూ.1,34,900 నుంచి ప్రారంభం కానుంది.

ఐఫోన్ 15 ప్రో సిరీస్‌ను యాపిల్ గ్లోబల్‌గా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఏ17 బయోనిక్ ప్రాసెసర్లపై ఈ ఫోన్లు పని చేయనున్నాయి. యాపిల్ వాచ్ అల్ట్రాలో అందించిన ప్రోగ్రామబుల్ యాక్షన్ బటన్‌ను ఈ సిరీస్‌లో అందించారు. ఛార్జింగ్ కోసం లైట్‌నింగ్ పోర్టు కాకుండా యూఎస్‌బీ టైప్-సీ పోర్టు ఉండనున్నాయి.

ఐఫోన్ 15 ప్రో ధ‌ర‌, సేల్ వివరాలు
దీని ధర మనదేశంలో రూ.1,34,900 నుంచి ప్రారంభం కానుంది. ఇది 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర. వీటిలో 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,44,900గా ఉంది. 512 జీబీ వేరియంట్ ధరను రూ.1,64,900గానూ, 1 టీబీ వేరియంట్ ధరను రూ.1,84,900గానూ నిర్ణయించారు. వీటికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి, సేల్ సెప్లెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధ‌ర‌
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర మనదేశంలో రూ.1,59,900 నుంచి ప్రారంభం కానుంది. ఇది 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ 128 జీబీ నుంచి కాకుండా 256 జీబీ నుంచి మొదలవుతుంది. ఇందులో 512 జీబీ వేరియంట్ ధరను రూ.1,79,900గానూ, 1 టీబీ వేరియంట్ ధరను రూ.1,99,900గానూ నిర్ణయించారు. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌కు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి, సేల్ సెప్లెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. బ్లాక్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం, వైట్ టైటానియం కలర్ మోడల్స్‌లో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లు కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ టాప్ ఎండ్ వేరియంట్ ధర దాదాపు రూ.2 లక్షలు టచ్ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇదే.

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ స్పెసిఫికేషన్లు
ఐఫోన్ 15 ప్రోలో 6.1 అంగుళాల, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని పీక్ బ్రైట్‌నెస్ట 2000 నిట్స్‌గా ఉంది. అదనపు ప్రొటెక్షన్ కోసం సెరామిక్ షీల్డ్ మెటీరియల్ కూడా ఈ స్మార్ట్ ఫోన్లలో అందించారు. యాపిల్ కొత్త 3ఎన్ఎం ఏ17 బయోనిక్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్లు పని చేయనున్నాయి. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఐఫోన్ 15 ప్రో సిరీస్‌లో ఉన్నాయి.

ఈ స్మార్ట్ ఫోన్లను గ్రేడ్ 5 టైటానియం, అల్యూమినియం సబ్ స్ట్రక్చర్‌తో రూపొందించారు. దీని ద్వారా ఫోన్ మరింత బలంగానూ, బరువు తక్కువగానూ ఉండనుంది. మ్యూట్ బటన్ స్థానంలో కొత్త యాక్షన్ బటన్ అందించారు. దీన్ని ఎన్నో డిఫరెంట్ యాక్షన్స్‌కు ఉపయోగించవచ్చు.

ఐఫోన్ 15 ప్రోలో 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అందించారు. లెన్స్ గ్లేర్ తగ్గించడానికి ప్రత్యేకమైన కోటింగ్ కూడా ఇందులో అందించారు. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ 3x టెలిఫొటో కెమెరా అందుబాటులో ఉన్నాయి.  ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో కూడా ఇదే కెమెరా సెటప్ ఉంది. కానీ టెలిఫొటో కెమెరా బదులు 12 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరాను అందించారు. ఇది 5x ఆప్టికల్ జూమ్‌ను అందించనుంది. ఈ రెండు ఫోన్లలోనూ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్ కెమెరా అందించారు.

ఛార్జింగ్, కనెక్టివిటీ కోసం యూఎస్‌బీ టైప్-సీని ఇందులో అందించారు. యూఎస్‌బీ 3.0 స్పీడ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆప్షనల్ కేబుల్ ద్వారా 10 జీబీపీఎస్ డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్‌ను ఇది అందించనుంది. ఐఫోన్ 15 ప్రో ఒక రోజు పూర్తిగా, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ అంత కంటే కొంచెం ఎక్కువగా బ్యాటరీని అందించనుందని కంపెనీ ప్రకటించింది.

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Ranabaali Day 1 Collections : రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
రణబాలి ఫస్ట్ డే కలెక్షన్స్ - తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ... విరోష్ కపుల్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఒక్క మూవ్‌తో గేమ్ మార్చేసిన త్రిగుణ్! ముకేశ్‌ని హర్ట్‌ చేసిన ఝాన్సీ! కెప్టెన్‌గా రాంప్రసాద్!
Surya Luxury Living:  దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
దుబాయ్‌లో షారుఖ్ ఖాన్ ప్రాజెక్టులో లగ్జరీ ఇల్లు కొన్న సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ సరికొత్త ఇన్వెస్ట్‌మెంట్
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
కారు ధరకు బైక్.. Royal Enfield Classic 650 హైపర్‌షిఫ్ట్- ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే
Embed widget