అన్వేషించండి

Bigg Boss Season 7 Day 9 Updates: ‘బిగ్ బాస్’ బిల్డప్ - ‘బ్రహ్మాస్త్ర’ స్టైల్‌లో మాయాస్త్రకు హైప్, తుస్సుమన్న టాస్క్!

ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా రెండు టీమ్స్‌లాగా విడిపోయారు. ఆ టీమ్స్‌కు రణధీర, మహాబలి అని పేర్లు పెట్టారు.

బిగ్ బాస్ సీజన్ 7 ముందు నుండే అంతా ఉల్టా పుల్టాగా ఉంటుందని చాలా హైప్ క్రియేట్ చేశారు. అందుకే అస్త్రాలను గెలుచుకోవాలని, అలా అయితేనే హౌజ్‌మేట్స్‌గా కొనసాగే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ కూడా ముందు నుండే క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7లోని మొదటి వారంలో పవర్ అస్త్రా అనే ఒక అస్త్రాన్ని సొంతం చేసుకున్నాడు సందీప్. దీంతో తను బిగ్ బాస్ హౌజ్‌లో పర్మనెంట్ హౌజ్‌మేట్ అయిపోయాడు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా మాయాస్త్రం కోసం పోటీపడాలి అంటూ ‘బ్రహ్మాస్త్ర’ సినిమా స్టైల్‌లో ఒక పిట్టకథను అందరికీ వినిపించారు బిగ్ బాస్. 

అచ్చం ‘బ్రహ్మాస్త్ర’ కథ..
ముందుగా కంటెస్టెంట్స్ అందరినీ లివింగ్ రూమ్‌లో కూర్చోమని చెప్పిన బిగ్ బాస్.. ఆ తర్వాత ఎన్నో ఏళ్లుగా ఆయన మనసులో ఒక రహస్యాన్ని దాచిపెడుతున్నానని, ఆ రహస్యాన్ని ఈరోజు మీకు చెప్తున్నాను అంటూ కథ మొదలుపెట్టారు. ఈ కథ కొన్ని వేల సంవత్సరాలు క్రితం జరిగింది అంటూ కథను ప్రారంభించారు. మంచి, చెడు మధ్య జరిగిన యుద్ధం గురించి చెప్పారు. మంచివైపు ఉండే మాయా జీవుల గురించి చెప్పారు. మాయా జీవుల దగ్గర ఉన్న మాయను సంపాదించుకోవాలని చెడు ప్రయత్నం చేసింది. అది జరగకూడదనే ఉద్దేశ్యంతో మాయా జీవులు.. ప్రపంచంలోని మాయను ఒక అస్త్రంలో బంధించారు. 7000 సంవత్సరాల క్రితం ఆ మాయాస్త్రం దాచిన చోటు ఇప్పటి బిగ్ బాస్ హౌజ్ అని, అందులోని కంటెస్టెంట్సే అప్పటి మాయాజీవులు అని బిగ్ బాస్ కథను వినిపించారు. కథ పూర్తయిన తర్వాత టాస్క్ గురించి వివరించారు.

మాయాస్త్రం గెలుచుకునే అవకాశం..
ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా రెండు టీమ్స్‌లాగా విడిపోయారు. ఆ టీమ్స్‌కు రణధీర, మహాబలి అని పేర్లు పెట్టారు. రణధీర టీమ్‌లో అమర్‌దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, శివాజీ, షకీలా ఉండగా.. మహాబలి టీమ్‌లో టేస్టీ తేజ, దామిని, శుభశ్రీ, రతిక, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ ఉన్నారు. సందీప్.. సంచాలకులు వ్యవహరించాడు. సమయానుసారం బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్‌లను ఎదుర్కుంటూ రెండు టీమ్స్ పోటీపడాలి. అలా పోటీపడుతున్న క్రమంలో గెలిచిన టీమ్‌కు మాయాస్త్రం చేరువవుతుంది. దానికి సంబంధించిన క్లూ కూడా దొరుకుతూ ఉంటుంది. 

అన్యాయంగా ఓడిపోయారు..
రణధీర, మహాబలి టీమ్స్ మధ్య జరిగిన మొదటి ఛాలెంజ్.. ‘పుల్ రాజా పుల్’. ఈ ఛాలెంజ్‌లో రెండు టీమ్స్ నుంచి నలుగురు, నలుగురు సభ్యులు వచ్చి మధ్యలో ఉన్న లాగ్‌ను తమవైపు లాగే ప్రయత్నం చేయాలి. ఈ ఛాలెంజ్‌ను వారు మూడుసార్లు ఆడాలి. చివరిగా గెలిచిన టీమ్‌కు మాయాస్త్రానికి సంబంధించిన కీ దొరుకుతుంది. రణధీర టీమ్ నుంచి ప్రిన్స్ యావర్, శివాజీ, అమర్‌దీప్, షకీలా రంగంలోకి దిగారు. మహాబలి టీమ్ నుంచి టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, శుభశ్రీ, గౌతమ్ కృష్ణ వచ్చారు. ఛాలెంజ్‌లో మూడుసార్లు రణధీర టీమే విజయం సాధించింది. మొదటి ఛాలెంజ్‌లోనే మహాబలి సైడ్ ఉన్న కర్ర విరిగిపోవడంతో వారి పట్టు జారిపోయింది అని టీమ్ సభ్యులు తెలిపారు. ఇక మూడో ఛాలెంజ్ సమయానికి మహాబలి టీమ్ సైడ్ ఉన్న మ్యాట్ పూర్తిగా జారిపోవడంతో, వారు గట్టిగా నిలబడలేక కింద పడిపోయారు. అప్పుడు రణధీర టీమ్‌కు వారిని ఓడించడం సులభంగా మారింది. ఇదే విషయాన్ని సంచాలకుడికి అర్థమయ్యేలా చెప్పడానికి మహాబలి టీమ్ ప్రయత్నించింది. కానీ సందీప్ వినిపించుకోలేదు. రణధీర టీమ్‌ను విజేతలుగా ప్రకటించి, మాయాస్త్రానికి సంబంధించిన తాళంచెవిని ఆ టీమ్ సభ్యులకు అందించాడు.

Also Read: నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పానా? పల్లవి ప్రశాంత్ ప్రశ్నకు రతిక షాకింగ్ ఆన్సర్ - ఆశలన్నీ ఉల్టా ఫల్టా!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget