Top Headlines Today: అనుకున్నది సాధించిన గంటా శ్రీనివాసరావు - కడియం రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్
AP Telangana Latest News 29 March 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Telugu News Today: మదనపల్లెలో షాజహాన్ బాషాకు టీడీపీ, జనసేన నేతలు సహకరిస్తారా ? రెబెల్స్‌గా పోటీ చేస్తారా ?
ఉమ్మడి చిత్తూరు (Chittoor)జిల్లాలోని మదనపల్లె నియోజకవర్గం టిడిపి (TDP)కి కంచుకోట. అలాంటి చోట అభ్యర్థి ఎంపిక వివాదంగా మారింది. నియోజకవర్గంలో ఐదు సంవత్సరాలుగా పార్టీ నేతలు, కేడర్ డక్కీలు మొక్కీలు తిని రాజకీయపోరాటం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో...చాలా మంది నేతలు టికెట్ ఆశించారు. ఆశావహుల జాబితా కూడా చాలా పెద్దదే. ఇలాంటి సమయంలో మదనపల్లి అసెంబ్లీ టికెట్...మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఇచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఓ చీడ పురుగు అని వరంగల్ బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వరంగల్‌లో మీడియా సమావేశం పెట్టిన బీఆర్ఎస్ నేతలు కిడయంపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీహరి పదేండ్ల కాలంలో ఎన్నో పదవులు అనుభవించారని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆ గౌరవం కేసీఆర్ కల్పించారన్నారు.శనివారం స్టేషన్ ఘన్‌పూర్‌లో మీటింగ్ పెడుతున్నాం. మీరు లేనప్పుడే స్టేషన్ ఘన్‌పూర్‌లో కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగిరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో సీనియర్ నేత , బీఆర్‌ఎస్ ఎంపీ కే. కేశవరావు సమావేశం అయ్యారు. డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డితో కలిసి సీఎం నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దీప్‌దాస్ మున్షీ కూడా పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించి 24 గంటలు కాక ముందే కేకే నేరుగా సీఎంతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన కుమార్తె విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కాంగ్రెస్ లో చేరేందుకు ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరవడంతో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగేస్తున్నారు. సిర్పూర్, ముథోల్ మాజీ ఎమ్మెల్యేలు హస్తం పార్టీ కండువా కప్పేసుకున్నారు. మరోవైపు నిర్మల్, ముథోల్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ కార్యకర్తలంతా పార్టీ మారారు. తాజాగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy) చేరికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆయన పార్టీలోకి రావడాన్ని స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన వద్దంటే వద్దంటూ ధర్నాలు చేశారు. మంత్రి సీతక్క సమావేశాల్లో సైతం మాజీ మంత్రిని తీసుకొవద్దని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అనుకున్నది సాధించిన గంటా - టీడీపీ తాజా లిస్ట్ ఇదే
తెలుగుదేశం పార్టీ పెండింగ్ ఉన్న సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు భీమిలి నియోజకవర్గం కేటాయించారు. ఆయనను చీపురుపల్లి నుంచి బొత్స మీద పోటీ చేయించాలని చంద్రబాబు భావించారు. కానీ ఆయన అందుకు అంగీకిరంచలేదు. భీమిలీలో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఆ మేరకు గంటాకు టీడీపీ అధినేత చాన్సిచ్చారు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై పోటీకి ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావును ఖరారు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి