అన్వేషించండి

TDP Lokasabha Candidates : అనుకున్నది సాధించిన గంటా - టీడీపీ తాజా లిస్ట్ ఇదే

TDP Candidates : భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేయనున్నారు. నలుగురు ఎంపీలతో పాటు పెండింగ్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను టీడీపీ విడుదల చేసింది.

TDP List :   తెలుగుదేశం పార్టీ పెండింగ్ ఉన్న సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు  భీమిలి నియోజకవర్గం కేటాయించారు. ఆయనను  చీపురుపల్లి నుంచి బొత్స మీద పోటీ చేయించాలని చంద్రబాబు భావించారు. కానీ ఆయన అందుకు అంగీకిరంచలేదు. భీమిలీలో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు.  ఆ మేరకు గంటాకు టీడీపీ అధినేత చాన్సిచ్చారు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై పోటీకి ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు  కళా వెంకట్రావును ఖరారు చేశారు. ఆయన నియోజకవర్గం ఎచ్చెర్ల బీజేపీ ఖాతాలోకి వెళ్లడంతో చీపురుపల్లి ఖరారు చేశారు.                                                                                             
TDP Lokasabha Candidates :  అనుకున్నది సాధించిన గంటా - టీడీపీ తాజా లిస్ట్ ఇదే

మరో నాలుగు ఎంపీ స్థానాలకు కూడా చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేశారు.  విజయనగరం- అప్పలనాయుడు , ఒంగోలు- మాగుంట శ్రీనివాసుల రెడ్డి , అనంతపూరం- అంబికా లక్ష్మీనారాయణ, కడపకు భూపేష్ రెడ్డి పేరును ఖరారు చేశారు. భూపేష్ రెడ్డి జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు.                                                           
TDP Lokasabha Candidates :  అనుకున్నది సాధించిన గంటా - టీడీపీ తాజా లిస్ట్ ఇదే

పెండింగ్ ఉన్న ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ప్రకటించారు. అరకు నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించంతో పాడేరుకు అభ్యర్థిగా కిల్లు వెంకట రమేష్ నాయుడును ఖరారు చేశారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అభ్యర్థి అయ్యారు. శిద్దా రాఘవరావు టీడీపీలోకి వస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ ఆయన రాలేదు. రాజంపేట నియోజకవర్గం నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం పేరును ఖరారు చేశారు. ఈ నియోజకవర్గం కోసం బీజేపీ పట్టుబట్టినా చంద్రబాబు అంగీకరించలేదు. ఇక టీడీపీలో చేరిన వైసీపీ మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు అందరూ ఊహించినట్లుగానే  గుంతకల్లు నియోజకవర్గాన్ని కేటాయించారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు నుంచి టీడీపీ తరపున వీరభద్రగౌడ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అనంతపురం అర్బన్ కూడా టీడీపీ ఖాతాలోనే పడింది. అక్కడ టిక్కెట్ ఆశిస్తున్న ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు షాక్ ఇచ్చారు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే  నేతకు అవకాశం కల్పించారు.                   

గతంలోనే కదిరి నియోజకవర్గానికి కందికంట వెంకట ప్రసాద్ సతీమణి యశోదా దేవిని అభ్యర్థిగా ప్రకటించారు. దీనికి కారణం  కందికుంట వెంకట ప్రసాద్ పై కొన్ని కేసుల్లో శిక్ష పడి ఉండటమే. సాంకేతిక సమస్యలు వస్తాయన్న కారణంగా ఆయన భార్యకు చాన్సిచ్చారు. అయితే ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆ శిక్షలన్నిటినీ కొట్టి వేసింది. దీంతో లైన్ క్లియర్ కావడంతో..  కందికుంట .వెంకట ప్రసాదే పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అభ్యర్థి పేరును టీడీపీ హైకమాండ్ మార్చింది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో BRS ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ కేసులో BRS ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Pig Kidney Transplant Dies : బతికించేందుకు పంది కిడ్నీని పెట్టారు.. ఆపరేషన్ సక్సెస్ కానీ పేషంట్ చనిపోయాడు.. ఎందుకంటే?
బతికించేందుకు పంది కిడ్నీని పెట్టారు.. ఆపరేషన్ సక్సెస్ కానీ పేషంట్ చనిపోయాడు.. ఎందుకంటే?
Modi Nominations Updates: వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధానమంత్రి మోదీ- అట్టహసంగా కార్యక్రమం
వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధానమంత్రి మోదీ- అట్టహసంగా కార్యక్రమం
AP Polling 2024 Updates: ఘర్షణలు దాటుకొని ఓటేసిన ప్రజలు- సహకరించిన సూర్యుడు, వరుణుడు
ఘర్షణలు దాటుకొని ఓటేసిన ప్రజలు- సహకరించిన సూర్యుడు, వరుణుడు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Madhavi Latha | Old city Elections 2024 |మాధవీలత రిగ్గింగ్ ఆరోపణలపై ఈసీ స్పందిస్తుందా.?| ABP DesamDirector Buchi Babu Sana Pithapuram | ఓటు వేయటం కోసం పిఠాపురం వచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు |ABP DesamNagababu Sensational Comments on Allu Arjun | బన్నీ ..మనోడు కాదని మెగా ఫ్యామిలీ భావిస్తుందా.? | ABPPM Modi Varanasi Nomination | వారణాసి ఎంపీగా మూడోసారి మోదీ నామినేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో BRS ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ కేసులో BRS ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Pig Kidney Transplant Dies : బతికించేందుకు పంది కిడ్నీని పెట్టారు.. ఆపరేషన్ సక్సెస్ కానీ పేషంట్ చనిపోయాడు.. ఎందుకంటే?
బతికించేందుకు పంది కిడ్నీని పెట్టారు.. ఆపరేషన్ సక్సెస్ కానీ పేషంట్ చనిపోయాడు.. ఎందుకంటే?
Modi Nominations Updates: వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధానమంత్రి మోదీ- అట్టహసంగా కార్యక్రమం
వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధానమంత్రి మోదీ- అట్టహసంగా కార్యక్రమం
AP Polling 2024 Updates: ఘర్షణలు దాటుకొని ఓటేసిన ప్రజలు- సహకరించిన సూర్యుడు, వరుణుడు
ఘర్షణలు దాటుకొని ఓటేసిన ప్రజలు- సహకరించిన సూర్యుడు, వరుణుడు
Telangana Polling Updates: తెలంగాణలో పెరిగిన పోలింగ్ శాతం - రెండంకెల స్కోర్ సాధిస్తామన్న పార్టీలు
తెలంగాణలో పెరిగిన పోలింగ్ శాతం - రెండంకెల స్కోర్ సాధిస్తామన్న పార్టీలు
Nagababu: నాగబాబు టార్గెట్ ఎవరు? పరాయివాడు అన్నది మేనల్లుడు బన్నీనా?
నాగబాబు టార్గెట్ ఎవరు? పరాయివాడు అన్నది మేనల్లుడు బన్నీనా?
PM Modi Nominations: నామినేషన్‌కు ముందు దశ అశ్వమేథ ఘాట్‌, కాల భైరవ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
నామినేషన్‌కు ముందు దశ అశ్వమేథ ఘాట్‌, కాల భైరవ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
Telugu Anchor: పాపం యాంకర్... పొలిటికల్ పబ్లిసిటీకి పోయి కెరీర్ రిస్క్ చేసిందా? ఇప్పుడు ఫీలైతే ఎలా?
పాపం యాంకర్... పొలిటికల్ పబ్లిసిటీకి పోయి కెరీర్ రిస్క్ చేసిందా? ఇప్పుడు ఫీలైతే ఎలా?
Embed widget