అన్వేషించండి

BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్

Telangana News : ఎమ్మెల్యే పదవికి కడియం శ్రీహరి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌కు నమ్మకం ద్రోహం చేశారని మండిపడ్డారు.

Kadiam Srihari Politics : స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి ఓ చీడ పురుగు అని వరంగల్ బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వరంగల్‌లో మీడియా సమావేశం పెట్టిన బీఆర్ఎస్ నేతలు కిడయంపై తీవ్ర విమర్శలు చేశారు.  బీఆర్ఎస్ పార్టీలో క‌డియం శ్రీహ‌రి ప‌దేండ్ల కాలంలో ఎన్నో ప‌ద‌వులు అనుభ‌వించారని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.   ఆ గౌర‌వం కేసీఆర్ క‌ల్పించార‌న్నారు.శనివారం  స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో మీటింగ్ పెడుతున్నాం. మీరు లేన‌ప్పుడే స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో కేసీఆర్ నాయ‌క‌త్వంలో గులాబీ జెండా ఎగిరింది. ఆనాటి టీఆర్ఎస్‌లో మీకు చావుదెబ్బ తగిలింది. 2001లో పార్టీ పుట్టిన‌ప్పుడే అన్ని మండలాల్లో ఎంపీపీలు, జ‌డ్పీటీసీలు గెలిచాం. గులాబీ కోట‌లో చీడ పురుగుల్లా వ‌చ్చి.. కోట‌ను నాశ‌నం చేసేందుకు, కార్య‌క‌ర్త‌ల‌ను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. 

శనివారం స్టేషన్  ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ క్యాడర్ సమావేశం 

శనివారం స్టేషన్ ఘన్‌పూర్‌  మీటింగ్ బ్ర‌హ్మాండంగా స‌క్సెస్ అవుతుంది. అంద‌రూ కేసీఆర్ వెంటే ఉంటారు అని సుద‌ర్శ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.  ప‌దేండ్ల కాలంలో ఏ ఒక్క రోజు కూడా క‌డియం ఖాళీ లేరు. ఉప ముఖ్య‌మంత్రిగా, ఎమ్మెల్సీ, ఎంపీగా అవ‌కాశం ఇచ్చారు కేసీఆర్. పార్టీ నాయ‌కులు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డి, ప‌ని చేసి ఎంపీగా గెలిపించారు. ఇత‌ర నాయ‌కులు మీ కోసం ఎంతో త్యాగం చేశారు. ఆత్మ విమ‌ర్శ చేసుకోవాలి. మీరు టీఆర్ఎస్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు మీతో ప‌ది మంది కూడా రాలేదు. ఇవాళ మీతో ప‌ది మంది కూడా రారు. నిత్యం విలువల‌ గురించి మాట్లాడ‌టం బంద్ పెట్టాలి. మీరే పునీతులు అని ఇత‌రులు అప‌విత్ర‌లు అనే మాట‌లు ఇక చెల్ల‌వు అని క‌డియం శ్రీహ‌రిని పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి హెచ్చ‌రించారు.

ప్రజాబలం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్న  వినయ్ భాస్కర్ 

కడియం శ్రీహరి కోసం బీఆర్‌ఎస్‌ చాలా మంది నాయకులను కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌  విమర్శించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియానికి స్టేషన్‌ ఘన్‌పూర్‌ టికెట్‌ను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇచ్చారని చెప్పారు. పార్టీ నేతలతో కలిసి ఆయన వరంగల్‌లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలన్నారు. కడియం శ్రీహరికి ప్రజాబలం ఉంటే రాజీనామా చేసి గెలవాలని డిమాండ్‌ చేశారు. ఆయన ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. కడియం ఏ పార్టీలో ఉన్నా కార్యకర్తలను అణచివేశారని ఆరోపించారు. ఆయన ఎంతో మందిని బలిపశువులను చేశారని విమర్శించారు. 

కడియం కావ్య నమ్మక ద్రోహి 

కడియం కావ్య తీరు  బాధ కలిగించిందని బీఆర్ఎస్ నేతలు  చెప్పారు. శ్రీహరి నమ్మక ద్రోహి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. వరంగల్‌లో జరుగుతున్ పరిణామాలకు కడియం బాధులని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి అన్నారు. జిల్లా రాజకీయాలను కడియం బ్రష్ఠుపట్టించాని ఫైర్‌ అయ్యారు. గులాబీ కోటలో చీడపురుగులా కడియం చేరారని విమర్శించారు. ఆయనకు సిగ్గు, శరం ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Polling Percentage: ఏపీలో ఎన్నికల్లో 11 గంటలకు ఓటింగ్ శాతం ఇదీ, పురుషులే అధికం
ఏపీలో ఎన్నికల్లో 11 గంటలకు ఓటింగ్ శాతం ఇదీ, పురుషులే అధికం
Andhra Pradesh Polling Updates: నర్సరావుపేట, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థులపై  వైసీపీ నేతల దాడి- కార్లు ధ్వంసం- పరిస్థితి ఉద్రిక్తం
నర్సరావుపేట, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థులపై వైసీపీ నేతల దాడి- కార్లు ధ్వంసం- పరిస్థితి ఉద్రిక్తం
Tenali News: తెనాలిలో ఉద్రిక్తత- ఎమ్మెల్యే శివకుమార్‌పై తిరుగబడ్డ ఓటర్లు
తెనాలిలో ఉద్రిక్తత- ఎమ్మెల్యే శివకుమార్‌పై తిరుగబడ్డ ఓటర్లు
Orry: రోజుకు రూ.50 లక్షల సంపాదన - నాతో ఫొటో కావాలన్నా, ముట్టుకోవాలన్నా డబ్బులివ్వాలి - ఇవే నా రేట్లు: ఓర్రి
రోజుకు రూ.50 లక్షల సంపాదన - నాతో ఫొటో కావాలన్నా, ముట్టుకోవాలన్నా డబ్బులివ్వాలి - ఇవే నా రేట్లు: ఓర్రి
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

PM Modi Patna Gurudwara | పాట్నా గురుద్వారాలో ప్రధాని మోదీ సేవ | ABP DesamKTR Voting Video | కుటుంబంతో కలిసి ఓటు వేసిన కేటీఆర్ | ABP DesamGreen Polling Stations Attracting | గ్రీన్ పోలింగ్ స్టేషన్...ఈ ఎలక్షన్స్ లో ఎట్రాక్షన్ | ABP DesamYS Sharmila on AP Elections 2024 | ఏపీ ఎన్నికల పోలింగ్ పై మాట్లాడిన ఏపీసీసీ చీఫ్ షర్మిల | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Polling Percentage: ఏపీలో ఎన్నికల్లో 11 గంటలకు ఓటింగ్ శాతం ఇదీ, పురుషులే అధికం
ఏపీలో ఎన్నికల్లో 11 గంటలకు ఓటింగ్ శాతం ఇదీ, పురుషులే అధికం
Andhra Pradesh Polling Updates: నర్సరావుపేట, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థులపై  వైసీపీ నేతల దాడి- కార్లు ధ్వంసం- పరిస్థితి ఉద్రిక్తం
నర్సరావుపేట, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థులపై వైసీపీ నేతల దాడి- కార్లు ధ్వంసం- పరిస్థితి ఉద్రిక్తం
Tenali News: తెనాలిలో ఉద్రిక్తత- ఎమ్మెల్యే శివకుమార్‌పై తిరుగబడ్డ ఓటర్లు
తెనాలిలో ఉద్రిక్తత- ఎమ్మెల్యే శివకుమార్‌పై తిరుగబడ్డ ఓటర్లు
Orry: రోజుకు రూ.50 లక్షల సంపాదన - నాతో ఫొటో కావాలన్నా, ముట్టుకోవాలన్నా డబ్బులివ్వాలి - ఇవే నా రేట్లు: ఓర్రి
రోజుకు రూ.50 లక్షల సంపాదన - నాతో ఫొటో కావాలన్నా, ముట్టుకోవాలన్నా డబ్బులివ్వాలి - ఇవే నా రేట్లు: ఓర్రి
AP Polling Updates: ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు- పల్నాడులో హింసాత్మకం
ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు- పల్నాడులో హింసాత్మకం
Manisha Koirala: ఇండస్ట్రీలో ఆడవారి రాత మారింది, ఆ సీన్ కోసం 12 గంటల పాటు మట్టి నీళ్లలో ఉన్నాను - మనీషా కొయిరాల
ఇండస్ట్రీలో ఆడవారి రాత మారింది, ఆ సీన్ కోసం 12 గంటల పాటు మట్టి నీళ్లలో ఉన్నాను - మనీషా కొయిరాల
Allu Arjun: పవన్‌కు నా లవ్, సపోర్ట్ ఎప్పుడూ ఉంటాయ్ - నంద్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతుపై అల్లు అర్జున్ క్లారిటీ 
పవన్‌కు నా లవ్, సపోర్ట్ ఎప్పుడూ ఉంటాయ్ - నంద్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతుపై అల్లు అర్జున్ క్లారిటీ 
Ananya Nagalla: బాలీవుడ్‌లోకి అనన్య నాగళ్ల  - నటిగా కాదు రచయితగా.. ఏ మూవీకో తెలుసా?
బాలీవుడ్‌లోకి అనన్య నాగళ్ల - నటిగా కాదు రచయితగా.. ఏ మూవీకో తెలుసా?
Embed widget