అన్వేషించండి

Telugu States Investments : తెలుగు రాష్ట్రాలకేమయింది..? పెట్టుబడులు ఎందుకు అంత తక్కువగా వస్తున్నాయి..!?

2020-21లో దేశంలోకి దాదాపుగా రూ 4.5 లక్షల కోట్ల ఎఫ్‌డీఐలు వస్తే అందులో తెలంగాణకు వచ్చింది రూ. 8617 కోట్లు మాత్రమే. ఇక ఏపీ పరిస్థితి మరీ దారుణం . ఆ రాష్ట్రానికి వచ్చింది రూ. 638 కోట్లు మాత్రమే.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో తెలుగు రాష్ట్రాలు వెనుకబడిపోతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సంలో దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలలో తెలంగాణ రెండు శాతం కూడా సాధించలేదు. ఆంద్రప్రదేశ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దేశంలోకి వచ్చిన మొత్తం ఎఫ్‌డీఐలలో  ఏపీకి వచ్చింది 0.14 శాతమే. కేంద్రం విడుదల చేసిన ఈ లెక్కలు తెలుగు రాష్ట్రాలు పారిశ్రామిక వెనుకబడిపోతున్నాయన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి.
Telugu States Investments :   తెలుగు రాష్ట్రాలకేమయింది..? పెట్టుబడులు ఎందుకు అంత తక్కువగా వస్తున్నాయి..!?

Also Read : యూపీలో మళ్లీ యోగికే చాన్స్

గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి రూ.4,42,568.84 కోట్ల విదేశీ పెట్టబడులు..!

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ఇండియాలోకి మాత్రం పెట్టుబడుల వరద పారిందని చెప్పుకోవచ్చు. ఏడాదిలో భారత్‌లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టబుడుల విలువ రూ. రూ.4,42,568.84 కోట్లు. 2020లో అత్యధిక ఎఫ్‌డీఐలు అందుకున్న ప్రపంచ దేశాల్లో భారత్ 5వ స్థానంలో ఉంది. ఓ రకంగా కరోనా భారత్‌కు మేలు చేసింది. ప్రపంచవ్యాప్త తయారీ రంగం చైనాలో కేంద్రీకృతం అయింది. కరోనా పరిస్థితుల తర్వాత  ఒక్క చోటే ఉండకూడదన్న లక్ష్యంతో ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలు ఇతర దేశాల వైపు చూస్తున్నాయి. చవకగా లభించే మానవవనరులు ఇతర అనుకూలతలు ఉండటంతో  భారత్ వైపు ఎక్కువ మంది పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు.

Telugu States Investments :   తెలుగు రాష్ట్రాలకేమయింది..? పెట్టుబడులు ఎందుకు అంత తక్కువగా వస్తున్నాయి..!?

Also Read : నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలపై ఏబీపీ-సీఓటర్ సర్వే ఫలితాలు

గుజరాత్‌కే వెళ్లిపోతున్న పెట్టబుడులు..!

దేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో అత్యధికం ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్‌కు వెళ్లిపోతున్నాయి. వచ్చిన రూ.4,42,568.84 కోట్ల పెట్టుబడుల్లో గుజరాత్‌కు 36.79  శాతం అంటే రూ. 1 లక్షా 62వేల 830కోట్లు గుజరాత్‌లోనే పెట్టుబడులుగా పెట్టారు. తర్వాతి స్థానం మహారాష్ట్రది ఆ రాష్ట్రం కూడా దాదాపుగా రూ. 1 లక్షా ఇరవై వేల కోట్ల పెట్టుబడులను సాధించింది. ఇక పారిశ్రామిక పరంగా ఎంతో అభివృద్ధి చెందిన కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే వీరికి వస్తున్న పెట్టుబడులు తక్కువే. తొలి స్థానంలో గుజరాత్‌కు  . 1 లక్షా 62వేల 830కోట్లు పెట్టుబడులుగా వస్తే ఐదో స్థానంలో ఉన్న తమిళనాడుకు వచ్చింది రూ.17,208కోట్లు మాత్రమే.
Telugu States Investments :   తెలుగు రాష్ట్రాలకేమయింది..? పెట్టుబడులు ఎందుకు అంత తక్కువగా వస్తున్నాయి..!?

Also Read : వ్యాక్సిన్ వేయించుకున్న వారికే మద్యం అమ్మకం

తెలంగాణకు కాస్త ఊరట..!

తెలుగురాష్ట్రాల వైపు పెట్టుబడిదారులెవరూ పెద్దగా చూడటం లేదు. పెద్ద ఎత్తున పరిశ్రమల్ని ఆకర్షిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నవేవీ లెక్కల్లో కనిపించడం లేదు. గత ఆర్థిక సంవత్సంలో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు కేవలం రూ. 8617కోట్లు. దేశంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఇది రెండు శాతం కూడా లేదు. రాష్ట్రాల వారీగా చూస్తే మొత్తంగా ఏడో స్థానంలో నిలిచింది. ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ మెరుగైన పరిస్థితులోనే ఉందనుకోవాలి. ఎందుకంటే తెలంగాణ కంటే తక్కువగా పదకొండు రాష్ట్రాలు  పెట్టుబడులను ఆకర్షించాయి. అయితే హైదరాబాద్ లాంటి అతి పెద్ద పారిశ్రామి, వాణిజ్య, వ్యాపార కేంద్రం ఉన్న తెలంగాణకు ఆశించినట్లుగా పెట్టుబడులు రాలేదన్నది వ్యాపార నిపుణుల అంచనా.
Telugu States Investments :   తెలుగు రాష్ట్రాలకేమయింది..? పెట్టుబడులు ఎందుకు అంత తక్కువగా వస్తున్నాయి..!?

ఏపీ పరిస్థితి దారుణం..!

ఒకప్పుడు కియా లాంటి అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించి ప్రపంచ వ్యాపార రంగాన్ని తన వైపు తిప్పుకున్న ఆంధ్రప్రదేశ్ వైపు ఇప్పుడు పెట్టుబడిదారులెవరూ చూడటం లేదు. దేశంలో అతి తక్కువ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సాధించిన రాష్ట్రాల్లో ఏపీ కింద నుంచి నాలుగో స్థానంలో ఉంది. ఏపీ కంటే అధ్వానంగా ఉన్న రాష్ట్రాలు బీహార్, ఒడిశా, గోవా మాత్రమే. గత ఏడాది దేశంలోకి వచ్చిన రూ.4,42,568.84 కోట్ల పెట్టుబడుల్లో ఏపీకి వచ్చింది రూ.638 కోట్లు మాత్రమే.  ఇది ఒక శాతం కూడా కాదు. 0.14 శాతం మాత్రమే. శుక్రవారం పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేస్తూ సీఎం జగన్ రూ. 30వేల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. కానీ అలాంటి పరిస్థితి లేదని కేంద్రం విడుదల చేసిన నివేదికలో వెల్లడయింది.
Telugu States Investments :   తెలుగు రాష్ట్రాలకేమయింది..? పెట్టుబడులు ఎందుకు అంత తక్కువగా వస్తున్నాయి..!?

పెట్టుబడులొస్తేనే ఉపాధి, అభివృద్ది..!

ఏ రాష్ట్రం అయినా పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రధానంగా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఒక్క సారి పెట్టుబడి వస్తే దీర్ఖకాలంగా ప్రభుత్వానికి లబ్ది ఉంటుంది. అక్కడి ప్రజలకు ఉద్యోగాలు లభిస్తాయి. ప్రత్యక్ష పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వానికి పన్నుల ఆదాయం ఉంటుంది. అంతకు మించి ఆ పరిశ్రమ వల్ల అనుబంధ పరిశ్రమలూ వస్తాయి. ఒక్క పెట్టుబడి పెద్ద ఎత్తున ప్రజల జీవితాల్లో మార్పు తెస్తుంది. ఈ పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాలే అభివృద్దిలోనూ ముందుకెళ్తాయి. గుజరాతే దీనికి ఉదాహరణ. 

Also Read : యాపిల్ కారు మేడిన్ టొయోటా

Also Read : ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తున్న గూగుల్ పే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్Adilabad Aatram Suguna Face To Face: ఆదిలాబాద్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటున్న ఆత్రం సుగుణTDP Sankar | Srikakulam | పదవి ఉంటే ఒకమాట.. లేదంటే మరో మాట... ధర్మాన ఎప్పుడూ అంతేElections 2024 Tirupati Public Talk: తిరుపతి ఓటర్ల మదిలో ఏముంది..? ఎవరికి ఓటేస్తారు..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Chandrababu :  జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
BJP Chengicherla politics : తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
తెలంగాణలో మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తున్న బీజేపీ - చెంగిచెర్ల ఘటనపై దూకుడు రాజకీయం !
Ap Elections: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులు - కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
CJI: సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
సీజేఐకు 600 మంది లాయర్ల లేఖ - కారణం ఏంటంటే.?
Embed widget