IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Liquor Vaccine : 2 డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారికే మద్యం అమ్మకం ! ఇక స్ట్రిక్ట్ రూల్స్ అంతే..

తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్న వారికే లిక్కర్ అమ్మాలని నిర్ణయించింది. నీలగిరి జిల్లాలో మొదటగా అమలు చేస్తున్నారు.

FOLLOW US: 

కరోనాకు ప్రత్యేకంగా వ్యాక్సిన్ ఎందుకు మద్యమే పెద్ద వ్యాక్సిన్ అని మందుబాబులు లాజిక్‌లు లాగడం మనం చాలా సార్లు చూసి ఉంటారు. కరోనా వ్యాక్సిన్ పేరుతో ఓ బ్రాండ్ కూడా  అమ్మకానికి వచ్చినట్లుగా చూశాం. అందుకే మందు బాబులు అసలైన వ్యాక్సిన్‌ను వేయించుకోవడానికి ఆసక్తి చూపరు. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం మందు వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా సంబంధం లేదు కానీ  నిజమైన కరోనా వ్యాక్సిన్ వేయించుకోకపోతే.. మద్యం వ్యాక్సిన్ దొరకకుండా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణ ప్రకటించింది. ఓ జిల్లాలో అమలు చేయడం కూడా స్టార్ట్ చేసేసింది.

Also Read : టాలీవుడ్ డ్రగ్స్ లింక్ దొరికింది ఎఫ్‌ క్లబ్‌లోనే..!

మద్యం కొనుగోలు చేయాలంటే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలి. షాపు దగ్గరకు వెళ్లి డైలీ కస్టమర్‌నే గురూ అంటే సరిపోదు ఖచ్చితంగా వ్యాక్సిన్ సర్టిఫికెట్ తీసుకెళ్లాలి. రెండు డోసులు వేయించుకున్నట్లుగా ఆధారం చూపించారు. ఆ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌కు మరో ఫ్రూఫ్‌గా ఆధార్ కార్డు కూడా తీసుకెళ్లాలి. అప్పుడు మాత్రమే మద్యం అమ్ముతారు. లేకపోతే లేదు. ఈ విధానం తెలుగు రాష్ట్రాల్లో కాదు కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అక్కడి ప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది.  కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలనుకుంది.

Also Read : తమిళనాడు అసెంబ్లీలో పవన్ కల్యాణ్ డైలాగ్

మద్యం దుకాణాలు కూడా కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారాయన్న నివేదికలు రావడంతో సీఎం స్టాలిన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టి కొన్ని నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే మద్యం అమ్మాలనే నిర్ణయానికి వచ్చారు. ముందుగా నీలగిరి జిల్లాలో అమలు చేయడం ప్రారంభించారు. నీలగిరి జిల్లాలో మొత్తం 76 మద్యం దుకాణాలు ఉన్నాయి. అక్కడ రోజుకు రూ. కోటి వరకూ లిక్కర్ అమ్మకాలు జరుగుతూ ఉంటాయి.  నీలగిరి జిల్లానే ప్రభుత్వం ఈ ప్రయోగానికి ఎంచుకోవడానికి ఓ కారణం ఉంది అదేమిటంటే.. వ్యాక్సిన్ ఎక్కువ మందికి వేయడం.

Also Read : తెలంగాణ బీజేపీలో పాదయాత్ర జోష్

18 ఏళ్లకు పైబడినవారు 5.82 లక్షల మంది నీలగిరి జిల్లాలో ఉన్నారు. వీరిలో  70శాతం మందికి టీకాలు వేశారు. ఎలాగూ పద్దెనిమిది ఏళ్ల లోపు వారికి మద్యం అమ్మరు కాబట్టి 70 శాతం మంది ప్రజలు మద్యం కొనుగోలుకు అర్హులు కాబట్టి అమ్మకాల మీద కూడా పెద్దగా ప్రభావం పడదన్న ఉద్దేశంతో  ప్రభుత్వం అక్కడ అమలు చేయడం ప్రారంభించింది. పరిస్థితిని బట్టి అన్ని జిల్లాలకు విస్తరించే అవకాశం ఉంది. అంటే ఇంక ఆధార్ కార్డుతో పాటు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కూడా జేబులో పెట్టుకోవాల్సిందేనన్నమాట. 

Published at : 03 Sep 2021 01:40 PM (IST) Tags: corona vaccine Covid Vaccine Tamil Nadu CM Stalin Nilgiris district

సంబంధిత కథనాలు

AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !

AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !

Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ

Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ

Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం

Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం

Petrol-Diesel Price, 24 May: వాహనదారులకు షాక్! నేడు మళ్లీ పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ మాత్రమే తగ్గుదల

Petrol-Diesel Price, 24 May: వాహనదారులకు షాక్! నేడు మళ్లీ పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ మాత్రమే తగ్గుదల

Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్

Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Guppedantha Manasu మే 24 ఎపిసోడ్: వసుధారకు అసలు సంగతి చెప్పడానికి రెడీ అయిన రిషి- వెడ్డింగ్‌ డిజైన్ చేసిన మహేంద్ర

Guppedantha Manasu మే 24 ఎపిసోడ్: వసుధారకు అసలు సంగతి చెప్పడానికి రెడీ అయిన రిషి- వెడ్డింగ్‌ డిజైన్ చేసిన మహేంద్ర

Viral: భార్య మీద ప్రేమతో మోపెడ్ కొన్న బిచ్చగాడు, ఇప్పుడిద్దరూ మోపెడ్ పై తిరుగుతూ భిక్షాటన చేస్తారట

Viral: భార్య మీద ప్రేమతో మోపెడ్ కొన్న బిచ్చగాడు, ఇప్పుడిద్దరూ మోపెడ్ పై తిరుగుతూ భిక్షాటన చేస్తారట

Gold-Silver Price: స్వల్పంగా ఎగబాకిన బంగారం ధరలు, నేటి ధరలు ఇవీ - వెండి కూడా నేడు పైపైకి

Gold-Silver Price: స్వల్పంగా ఎగబాకిన బంగారం ధరలు, నేటి ధరలు ఇవీ - వెండి కూడా నేడు పైపైకి

Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!

Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!