TN Assembly on Pawan Kalyan: పవన్ కల్యాణ్ ట్వీట్ పై తమిళనాడు అసెంబ్లీలో చర్చ... అధికారంలోకి రావడానికే రాజకీయం, వచ్చాక కాదు..
జనసేనాని పవన్ కల్యాణ్ ట్వీట్ పై తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ పై పవన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయంగా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. తాజాగా పవన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ పాలనను ప్రశంసిస్తూ ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అయ్యింది. తాజాగా ఈ ట్వీట్ పై తమిళనాడు అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది.
"தமிழ்நாட்டுக்கு மட்டுமின்றி, இந்தியாவில் எல்லா மாநிலங்களும் பயன்பெறும் வகையில் சிறப்பாக ஆட்சி நடத்தும் தமிழ்நாடு முதலமைச்சர் @mkstalin அவர்களுக்கு, பிரபல நடிகரும், ஆந்திர மாநில அரசியல் தலைவருமான திரு. @PawanKalyan அவர்கள் வாழ்த்து தெரிவித்துள்ளார்! https://t.co/kwcAJ2pelz
— DMK (@arivalayam) September 1, 2021
సీఎం స్టాలిన్ పై ప్రశంసల వర్షం
తమిళనాడు అసెంబ్లీలో పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చింది. డీఎమ్ కే ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పెట్టిన పోస్టుని తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తావించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ పాలనపై ఇటీవల పవన్ కల్యాణ్ ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ని అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యన్ ప్రస్తావిస్తారు. పవన్ కల్యాణ్ ట్వీట్ ని ఆయన తెలుగులో చదివి వినిపించారు. ఆయన ట్వీట్ చదువుతున్న సందర్భంలో మిగిలిన ఎమ్మెల్యేలు, సీఎం స్టాలిన్ చిరునవ్వులు చిందించారు. పవన్ కళ్యాణ్ ట్వీట్ చదువుతూ సీఎం స్టాలిన్ పై మంత్రి ప్రశంసల వర్షం కురిపించారు. తనను పొగిడితే చర్యలుంటాయని సీఎం స్టాలిన్ అసెంబ్లీ వేదికగా చెప్పడంతో తన కేబినెట్ లోని మంత్రి ప్రశంసలపై ఎలా స్పందిస్తారో అని సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ వస్తున్నాయి.
Discussion About @PawanKalyan garu's Tweet On TN CM M.K.Stalin Sir In Tamilnadu State Assembly 🔥pic.twitter.com/Tf04nbgXyz
— రాజోలు అబ్బాయి పవన్ (@Pawan_JSP_RZL) September 3, 2021
Also Read: JSP For Roads : రేపట్నుంచి రోడ్లపై ఉద్యమం.. జనసైనికులకు పవన్ కల్యాణ్ ఇచ్చిన సందేశం ఇదే..!
జనసేనాని ట్వీట్
ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమిళనాడు సీఎం స్టాలిన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. స్టాలిన్ తీసుకున్న నిర్ణయాలపై స్పందిస్తూ.. 'ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావటానికి రాజకీయం చెయ్యాలి కానీ.. ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చెయ్యకూడదని పవన్ అన్నారు. ఈ విషయాన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, మీ ప్రభుత్వ పని తీరు మీ ఒక్క రాష్ట్రానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మార్గదర్శకం… స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియచేస్తున్నాను. మీకు నా శుభాకాంక్షలు' అని జనసేనాని అన్నారు.
To Hon. CM @mkstalin garu, pic.twitter.com/iIo0YMD1vT
— Pawan Kalyan (@PawanKalyan) August 31, 2021
Also Read: ఎన్ని సార్లు చేస్తే అంత మంచిదట! ఈ మాత్రం హింట్ ఇస్తే..
Also Read: ఒక వైపు క్రిష్, మరో వైపు సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్.. పవన్ మూవీస్ అప్‌డేట్స్ ఇవే
Also Read: 'పొలిటికల్ పవర్ స్టార్'గా అయ్యేందుకు పవన్ కల్యాణ్‌కి ఉన్న అడ్వాంటేజెస్ ఇవే..
Also Read: Janasena BJP : ఎవరికి వారే రాజకీయాలు ! జనసేన కలుపుకోవడం లేదా ? బీజేపీ కలవడం లేదా ?