UP Election 2022 Predictions: యూపీలో మళ్లీ బీజేపీదే హవా.. మరోసారి సీఎంగా యోగి ఆదిత్యనాథ్.. కానీ!
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. అతి ఎక్కువ కాలం సీఎంగా చేసిన బీజేపీ నేతగా నిలవాలని ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ భావిస్తున్నారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్‌లలో సైతం ఎన్నికలు జరగనున్నాయి. అయితే అందరి చూపు మాత్రం పెద్ద రాష్ట్రమైన యూపీపైనే ఉంది. యూపీలో అధికారం మరోసారి సొంతం చేసుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. అతి ఎక్కువ కాలం సీఎంగా చేసిన బీజేపీ నేతగా నిలవాలని ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ భావిస్తున్నారు.
అతిపెద్ద రాష్ట్రం, అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రమైనప్పటికీ ప్రమాదకర కొవిడ్19 పరిస్థితిని సీఎం యోగి ఎదుర్కొన్న తీరును బీజేపీ అధిష్టానం ప్రశంసించింది. గంగా నదిలో కరోనా బాధితుల శవాలు తేలియాడుతున్న వీడియోలు వైరల్ అయినా.. పరిస్థితి అదుపు తప్పకుండా నియంత్రించడం మాటలు కాదు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందా.. లేదా ప్రత్యర్థి పార్టీలు సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ పుంజుకుంటాయా.. ప్రియాంక గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కూటమి మరోసారి తమ మార్క్ చూపిస్తుందా అనే అంశాలు యూపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.
Also Read: KCR meet Modi : పది సమస్యలు తీర్చండి... ప్రధానికి కేసీఆర్ విజ్ఞప్తులు..!
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రాల్లో తాజా పరిస్థితులపై సీఓటర్ ఓపీనియన్ పోల్ సర్వే నిర్వహించింది. ప్రజలు ఏ పార్టీకి అనుకూలంగా తీర్పిచ్చారో తెలియాలంటే ఈ వివరాలపై ఓ లుక్కేయండి.
సర్వేలో అధికార బీజేపీ 0.4 శాతం ఓట్ల శాతాన్ని పెంచుకుంది. మరోవైపు గత ఎన్నికలతో పోల్చితే సమాజ్ వాదీ పార్టీ 6.6 శాతం ఓట్లను సాధిస్తుందని సర్వేలో తేలింది. బీఎస్పీ మాత్రం 6.5 శాతం ఓట్లను కోల్పోనుంది. కాంగ్రెస్ సైతం 1.2 శాతం ఓటు బ్యాంకు కోల్పోయే అవకాశం ఉందని సర్వేలో తేలింది.
కూటమి 2017 ఫలితాలు 2021 సర్వే మార్పు
బీజేపీ + 41.4 41.8 0.4
ఎస్పీ + 23.6 30.2 6.6
బీఎస్పీ 22.2 15.7 -6.5
కాంగ్రెస్ 6.3 5.1 -1.2
ఇతరులు 6.5 7.2 0.7
ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..
గత అసెంబ్లీ ఎన్నికల్లో 300కు పైగా సీట్లు సాధించిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని నిలుపుకున్నా సీట్లను మాత్రం కోల్పోనుంది. బీజేపీ 62 సీట్లు కోల్పోనుండగా, అఖిలేశ్ యాదవ్ కు చెందిన ఎస్పీ 65 సీట్లను అధికంగా సాధించే అవకాశం ఉందని సర్వేలో వచ్చింది. బీఎస్పీ 5 సీట్లు కోల్పోతుందని, కాంగ్రెస్ సైతం 2 సీట్లు కోల్పోతుందని సర్వే ఫలితాలలో వెల్లడైంది.
కూటమి 2017 ఫలితాలు 2021 సర్వే వ్యత్యాసం
బీజేపీ + 325 263 -62
ఎస్పీ + 48 113 65
బీఎస్పీ 19 14 -5
కాంగ్రెస్ 7 5 -2
ఇతరులు 4 8 4
బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 259 నుంచి 267 సీట్లు సాధించే అవకాశం ఉండగా.. ఎస్పీ 107 నుంచి 117 వరకు సీట్లు నెగ్గే అవకాశం ఉందని సర్వే చెబుతోంది. బీఎస్పీ 12 నుంచి 16 సీట్లు, కాంగ్రెస్ 3 నుంచి 7 స్ధానాలకు పరిమితం కాగా, ఇతరులు 6 నుంచి 10 సీట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది.
అధికార పార్టీ బీజేపీ ఏకంగా 60కు పైగా స్థానాలు కోల్పోనుంది. అయితే సీట్లు తగ్గినా మెజార్టీతో యూపీలో మరోసారి అధికారంలోకి రానుంది. అఖిలేశ్ యాదవ్ ఎస్పీ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. మాయావతికి మరోసారి నిరాశే ఎదురుకానుంది. ప్రియాంక గాంధీని రంగంలోకి దించినా కాంగ్రెస్ మాత్రం కోలుకుని సీట్లు సాధించేలా కనిపించడం లేదని ఏబీపీ, సీఓటర్ సర్వేలో వెల్లడైంది.
Also Read: Mansas Trust: మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్, బోర్డు సభ్యులుగా ఎవరిని నియమించినా పర్లేదు... కానీ
గమనిక: ఈ సర్వేను సీఓటర్ సంస్థ నిర్వహించింది. 18 ఏళ్లు దాటిన వారిలో కొందరిని CATI ఇంటర్వ్యూ చేసి వారిచ్చిన సమాధానాల ఆధారంగా సర్వే ఫలితాలు వెల్లడించారు. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా మరియు మణిపూర్ రాష్ట్రాల్లోని 5 ప్రధాన నగరాలలో మొత్తం 81000 వేలకు పైగా మందిపై 1 ఆగష్టు 2021 నుంచి 2 సెప్టెంబర్ 2021 మధ్య కాలంలో ఈ సర్వే నిర్వహించారు. వచ్చే ఫలితాలు సైతం 3 నుంచి 5 శాతంలో స్వల్ప వ్యత్యాసం ఉండే అవకాశం ఉందని సర్వే సంస్థ భావిస్తోంది.