అన్వేషించండి

AIADMK Leadership Crisis 2026: తమిళనాట సంచలనం - అన్నాడీఎంకేలో చీలిక - పళనిస్వామికి 17.. వేలుమణికి 30 !

ADMK MLA Split: అన్నాడీఎంకేలో ముదిరిన ముఠా తగాదాలు. ఎడప్పాడికి షాక్ ఇస్తూ 30 మంది ఎమ్మెల్యేలతో ఎస్.పి. వేలుమణి తిరుగుబాటు. అసెంబ్లీలో అసలైన అన్నాడీఎంకే ఎవరిది?

AIADMK SP Velumani vs EPS: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే మరోసారి నిలువునా చీలిపోయే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేస్తూ.. మాజీ మంత్రి ఎస్.పి. వేలుమణి వర్గం సెపరేట్ గ్రూపుగా ఏర్పడటం ప్రకంపనలు సృష్టిస్తోంది.
  
తమిళనాట ద్రవిడ రాజకీయాలు మరోసారి ఉత్కంఠ భరితమైన మలుపు తిరిగాయి. గత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అన్నాడీఎంకేలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి ఎస్.పి. వేలుమణి నేతృత్వంలో మెజారిటీ ఎమ్మెల్యేలు గళమెత్తారు. దీంతో అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత ఎవరన్న అంశంపై ఇప్పుడు పెద్ద యుద్ధమే నడుస్తోంది.

అన్నాడీఎంకేకు చెందిన సుమారు  30 మంది ఎమ్మెల్యేలు  ఎస్.పి. వేలుమణిని తమ శాసనసభాపక్ష నేతగా ఎంచుకున్నారు. మరోవైపు, ఎడప్పాడి పళనిస్వామికి కేవలం 17 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇరు వర్గాలు తమ తమ నేతలే  అసలైన అన్నాడీఎంకే అని పేర్కొంటూ అసెంబ్లీ సెక్రటరీకి విడివిడిగా లేఖలు అందజేసినట్లుగా తెలుస్తోంది.  పశ్చిమ తమిళనాడులో బలమైన పట్టున్న వేలుమణి, ఇప్పుడు చెన్నై వేదికగా ఎడప్పాడిపై తిరుగుబాటు చేయడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. 

 స్పీకర్ చేతిలో అన్నాడీఎంకే భవితవ్యం 

అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా,  అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎవరిని గుర్తించాలనే నిర్ణయం ఇప్పుడు  అసెంబ్లీ స్పీకర్ చేతిలోకి వెళ్లింది. కొత్తగా ఎన్నికయ్యే స్పీకర్ ఈ రెండు లేఖలను పరిశీలించి, సంఖ్యాబలం ఆధారంగా ఏ వర్గానికి గుర్తింపు ఇవ్వాలో నిర్ణయిస్తారు. అది వరకు అసెంబ్లీలో అన్నాడీఎంకే సీటింగ్ అమరిక,  ప్రతిపక్ష నేత హోదాపై సందిగ్ధత కొనసాగే అవకాశం ఉంది.

 విజయ్ పార్టీ  వైపు చూపు? 

 ఈ చీలిక వెనుక రాజకీయ వ్యూహాలు కూడా ఉన్నాయి. సీనియర్ నేత సి.వి. షణ్ముగం నేతృత్వంలోని మరో వర్గం కూడా ఎడప్పాడిపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ రెబెల్ ఎమ్మెల్యేలలో కొందరు విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కజగం  కు మద్దతు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఫలితాల్లో మూడో స్థానానికి పడిపోయిన అన్నాడీఎంకేను కాపాడుకోవాలంటే నాయకత్వ మార్పు తప్పదని వేలుమణి వర్గం వాదిస్తోంది.  వరుస ఓటములతో సతమతమవుతున్న అన్నాడీఎంకేను ఇప్పుడు అంతర్గత విభేదాలు దహించివేస్తున్నాయి. ఎడప్పాడి పళనిస్వామి తన పట్టు నిలుపుకుంటారా లేక వేలుమణి వర్గం అసెంబ్లీలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటుందా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఒకవేళ వేలుమణి వర్గాన్ని స్పీకర్ గుర్తిస్తే, అన్నాడీఎంకేలో ఎడప్పాడి శకం ముగిసినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
PM Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
2036 ఒలింపిక్స్ ఆతిథ్యంతో పాటు నేషన్ వైడ్ టాలెంట్ హంట్.. క్వాలిఫై కానీ ఈవెంట్లపై ఫోకస్: ప్రధాని మోదీ
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
Embed widget