అన్వేషించండి

CM Vijay meets former CM MK Stalin: స్టాలిన్‌తో సీఎం విజయ్ భేటీ - తమిళ రాజకీయాల్లో కొత్త విలువలు

CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం విజయ్.. మాజీ సీఎం స్టాలిన్‌ను ఇంటికి వెళ్లి కలిశారు.

Tamil Nadu CM Vijay meets former CM MK Stalin: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.   ఎన్నికల రణక్షేత్రంలో హోరాహోరీగా తలపడిన ఇద్దరు అగ్రనేతలు, ఫలితాల తర్వాత ప్రజాస్వామ్య విలువలకు పట్టాభిషేకం చేస్తూ సీఎం విజయ్.. మాజీ సీఎం స్టాలిన్‌ను ఇంటికి వెళ్లి కలిశారు.  తన రాజకీయ ప్రస్థానాన్ని విజయంతో ఆరంభించిన ముఖ్యమంత్రి విజయ్, బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నివాసానికి వెళ్లి కలవడం ద్వారా ద్రవిడ రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించారు.

 పగ కాదు.. ప్రజాస్వామ్య పోటీ! 

తమిళనాడు రాజకీయాల్లో రాజకీయం అంటే వ్యక్తిగత శత్రుత్వంగా ఉంటుంది. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే విజయ్ అలాంటి రాజకీయాలు చేయబోనని సంస్కారాన్ని చాటుకున్నారు. స్టాలిన్ నివాసానికి చేరుకున్న విజయ్‌కు విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలికారు.  దశాబ్దాల కాలంగా తమిళనాడులో జయలలిత - కరుణానిధి  మధ్య కొనసాగిన వ్యక్తిగత వైరంతో కూడిన రాజకీయానికి భిన్నంగా తమిళనాడు రాజకీయాలు కనిపిస్తున్నాయి.  ఎన్నికల వరకు ప్రత్యర్థులుగా విమర్శలు చేసుకున్నప్పటికీ, గెలిచిన తర్వాత ఆ రాజకీయాన్ని పక్కనపెట్టి సీనియర్ నేతను కలవడం విజయ్ చూపిన  పొలిటికల్ మెచ్యూరిటీ కి అద్దం పడుతోందన్న ప్రశంసలు వినిపిస్తున్నాయి. 

 స్టాలిన్ సలహా.. విజయ్ వినయం! 

ఈ భేటీలో కేవలం రాజకీయాలే కాకుండా పాలనాపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. అంతకుముందే సోషల్ మీడియా వేదికగా స్టాలిన్ తన అనుభవాన్ని జోడిస్తూ విజయ్‌కు కొన్ని సూచనలు చేశారు. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉంది అనడం కంటే, ఉన్న నిధులతో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ముఖ్యం  అని స్టాలిన్ ఇచ్చిన సలహాను విజయ్ చాలా సానుకూలంగా స్వీకరించారు. విమర్శలను కూడా ఒక పాఠంగా భావిస్తూ, సీనియర్ల అనుభవాన్ని గౌరవించడం ద్వారా విజయ్ తన వ్యక్తిత్వాన్ని మరో మెట్టు ఎక్కించుకున్నారు.   

 ద్రవిడ రాజకీయాల్లో నవ శకం 

 ఈ భేటీని  ప్రజాస్వామ్యానికి పట్టిన పచ్చ తోరణం గా తమిళ రాజకీయవర్గాలు చెబుతున్నాయి.  200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా రక్షణ దళం వంటి కీలక హామీలపై తొలి సంతకాలు చేసి దూకుడు మీదున్న సీఎం విజయ్, ఇలాంటి మర్యాదపూర్వక భేటీల ద్వారా  అందరి  మనసులను కూడా గెలుచుకుంటున్నారు. రాజకీయాలు అంటే తిట్టుకోవడం మాత్రమే కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పని చేయడం అనే సంకేతాన్ని విజయ్ - స్టాలిన్ బలంగా పంపారు.

విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు స్టాలిన్ పరోక్ష సహకారం      
 
అధికారం దక్కగానే అహంకారం ప్రదర్శించకుండా, తన కంటే సీనియర్లను గౌరవిస్తూ విజయ్ వేసిన ఈ అడుగు తమిళనాడు రాజకీయాల్లో ఒక సానుకూల మార్పును సూచిస్తోంది. స్టాలిన్ అనుభవం, విజయ్ ఉత్సాహం.. ఈ రెండూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తూ, ఒక హుందాతనమైన రాజకీయ ప్రయాణానికి ఈ భేటీ నాంది పలికింది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు స్టాలిన్.. తన మిత్రపక్షాలకు అడ్డుకోకుండా మద్దతుగా నిలిచారు. మరోఆరు నెలల వరకూ ప్రభుత్వంపై విమర్శలు కూడా చేయబోమని అన్నారు.    

టాప్ హెడ్ లైన్స్

FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 20 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget