Tamilnadu Stalin: లెఫ్ట్, వీసీకే నిర్ణయంపై స్టాలిన్ సంచలన ప్రకటన - సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్
Stalin: ప్రజాస్వామ్యానికే మా ప్రాధాన్యత ఇస్తామని.. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ఎం.కె. స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. లెఫ్ట్, వీసీకే నిర్ణయాన్ని ఆయన గౌరవించారు.

Stalin sensational statement on Left VCK decision: తమిళనాడులో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనను తొలగించే దిశగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అత్యంత కీలకమైన , వ్యూహాత్మక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్న తన మిత్రపక్షాల నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. సిద్ధాంతపరంగా డీఎంకేతోనే ఉంటూ, పరిపాలనాపరమైన స్థిరత్వం కోసం తమిళగ వెట్రి కళగం కు మద్దతు ఇస్తున్నట్లు వారు ప్రకటించడాన్ని హుందాగా అంగీకరించారు.
లెఫ్ట్, వీసీకేలకు కృతజ్ఞతలు
ప్రస్తుత సంక్షోభాన్ని నివారించడానికి టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని, అయితే సిద్ధాంతపరంగా డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌లోనే కొనసాగుతామని ప్రకటించిన కామ్రేడ్ షణ్ముగం, కామ్రేడ్ వీరపాండియన్, తిరుమావళవన్‌ల నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను అని స్టాలిన్ సోషల్ మీడియాలో ప్రకటించారు. కష్టకాలంలో తమతోనే ఉంటూ తమిళనాడు హక్కుల కోసం పోరాడతామని వారు చెప్పడం డీఎంకేపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఆయన ప్రశంసించారు.
என் உயிரோடு கலந்திருக்கும் தலைவர் கலைஞரின் அன்பு உடன்பிறப்புகளுக்கும், என் உயிர்நிகர் தமிழ் மக்களுக்கும் என் அன்பு வணக்கம்.
— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) May 9, 2026
தேர்தல் முடிவுகள் அறிவிக்கப்பட்ட பின்பு, நடக்கும் நிகழ்வுகளை நீங்கள் பார்க்கிறீர்கள். எந்தக் கட்சிக்கும் ஆட்சி அமைக்கும் பெரும்பான்மை கிடைக்காத வகையில்…
కాంగ్రెస్ తీరుపై అసంతృప్తి
కూటమి తరపున గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనీసం కృతజ్ఞతలు చెప్పేందుకు కూడా రాకుండా, డీఎంకేతో సంబంధాలు తెంచుకోవడంపై స్టాలిన్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అయితే, ఇదే సమయంలో వైకో, ప్రేమలత విజయకాంత్ వంటి ఇతర నేతలు చూపిన నిబద్ధతను ఆయన ప్రశంసించారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని ఈ తరుణంలో, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాము ఎటువంటి అడ్డంకులు సృష్టించబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రజల పక్షాన నిలిచే ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా డీఎంకే పనిచేస్తుందని హామీ ఇచ్చారు.
పథకాల కొనసాగింపునకు విజ్ఞప్తి
గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా సంక్షేమం, యువత , విద్యార్థుల అభివృద్ధి పథకాలను కొత్త ప్రభుత్వం కూడా కొనసాగించాలని ఆయన వ్యక్తిగతంగా కోరారు. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన సాగాలని ఆకాంక్షిస్తూ, ఏర్పాటు కాబోతున్న కొత్త ప్రభుత్వానికి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. లెఫ్ట్ , వీసీకే పార్టీలు విజయ్‌కు మద్దతు ఇవ్వడం వెనుక స్టాలిన్ మౌన ఆమోదం , వ్యూహాత్మక అంగీకారం ఉందనేది ఈ ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Before You Go
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
ట్రెండింగ్ వార్తలు






















