అన్వేషించండి

Tamilnadu Updates: ఎట్టకేలకు విజయ్‌కు VCK సపోర్ట్ లెటర్ - ఈ సారి గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అంగీకరించడం లాంఛనమే

CM Vijay: తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. విజయ్ ప్రభుత్వానికి వీసీకే అధికారికంగా మద్దతు ఇచ్చింది. దాంతో విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి ఆటంకాలు తొలగిపోయాయి.

VCK support letter to Vijay:   తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది.  తమిళగ వెట్రి కళగం   అధినేత విజయ్‌కు మద్దతు ఇచ్చే విషయంలో దోబూచులాడిన  విడుతలై చిరుతైగల్ కట్చి ఎట్టకేలకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. వీసీకే అధ్యక్షుడు తోల్ తిరుమావళవన్ శనివారం సాయంత్రం అధికారికంగా మద్దతు లేఖను టీవీకే ఎన్నికల వ్యూహకర్త, కీలక నేత ఆదవ్ అర్జునకు అందజేశారు. దీంతో టీవీకే కూటమి బలం మ్యాజిక్ ఫిగర్ 118 దాటి  119  కు (TVK 108, కాంగ్రెస్ 5, లెఫ్ట్ పార్టీలు 4, VCK 2) చేరుకుంది.

శనివారం ఉదయం నుండి జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం వీసీకే తన పట్టును సాధించుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో భాగస్వామ్యం, కీలక పదవుల విషయంలో విజయ్ నుండి గట్టి హామీ పొందిన తర్వాతే తిరుమావళవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆదవ్ అర్జున గతంలో వీసీకేలోనే పనిచేసిన అనుభవం ఉండటంతో, ఆయన మధ్యవర్తిత్వం ఇరు పార్టీల మధ్య పొత్తు కుదరడంలో కీలక పాత్ర పోషించింది. వీసీకే మద్దతుతో విజయ్ పక్షాన ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య పెరగడంతో, ఆయన ముఖ్యమంత్రి కావడం ఇప్పుడు లాంఛనంగా మారింది.   

గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఈ సాయంత్రం తిరువనంతపురం వెళ్లే లోపే విజయ్ ఆయన్ని కలిసి మద్దతు లేఖలను సమర్పించనున్నారు. ఇప్పటికే మూడుసార్లు రాజ్‌భవన్‌కు వెళ్లిన విజయ్, ఈ సారి పూర్తి మెజారిటీకి సంబంధించిన 119 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అందించనున్నారు. అన్నీ అనుకూలిస్తే, ఆదివారం  లేదా ఎల్లుండి జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని టీవీకే వర్గాలు చెబుతున్నాయి.  

మరోవైపు, సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీలు ఇప్పటికే బయట నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించగా, వీసీకే మాత్రం ప్రభుత్వంలో చేరే అవకాశం ఉందని తమిళ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. తిరుమావళవన్ కోరుకున్నట్లుగా సామాజిక సమీకరణాల ఆధారంగా కేబినెట్‌లో ప్రాధాన్యత ఇచ్చేందుకు విజయ్ అంగీకరించినట్లు తెలుస్తోంది.  తమిళనాడులో గత అయిదు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి ముగింపు దశకు చేరుకుంది. ఒక స్టార్ హీరోగా వెండితెరను ఏలిన విజయ్, ఇప్పుడు పక్కా రాజకీయ లెక్కలతో అధికారాన్ని చేజిక్కించుకోవడం భారత రాజకీయాల్లోనే ఒక అరుదైన ఘట్టంగా నిలవనుంది. విజయ్ తన ప్రమాణ స్వీకారం తేదీని నేటి రాత్రికి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget