Kerala: వయనాడ్ విలయంపై శశి థరూర్ పోస్ట్, క్షణాల్లోనే కాంట్రవర్సీ - క్లారిటీ ఇచ్చినా ఆగని ట్రోలింగ్
Wayanad Landslides: వయనాడ్ విధ్వంసంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పెట్టిన పోస్ట్ వివాదాస్పదమవుతోంది. ఇదేం క్యాప్షన్ అంటూ బీజేపీ తీవ్రంగా మండి పడుతోంది.
Wayanad Landslides News Today: వయనాడ్ విధ్వంసంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన ఓ పోస్ట్ వివాదాస్పదమవుతోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై బీజేపీ తీవ్రంగా మండి పడుతోంది. అక్కడి సహాయక చర్యలకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు శశిథరూర్. అయితే..ఆ వీడియోకి ఇచ్చిన క్యాప్షన్ కాంట్రవర్సీ అవుతోంది. "వయనాడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజులు ఇవి" అని క్యాప్షన్ ఇచ్చారు.అయితే... memorable అనే పదంపైనే చాలా మంది ఫైర్ అవుతున్నారు. అదేమైనా శుభకార్యమా ఎప్పటికీ గుర్తుండిపోవడానికి అంటూ మండి పడుతున్నారు. వయనాడ్‌లోని ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు శశిథరూర్. ఓ ట్రక్‌లో దిండ్లు, పరుపులు వచ్చాయి. వాటిని అక్కడి బాధితులకు పంచారు. ఆ తరవాత రిలీఫ్ క్యాంప్‌లలో ఉన్న వారిని పరామర్శించారు. ఇదంతా బానే ఉన్నా ఈ వీడియోకి ఆయన ఇచ్చిన క్యాప్షన్‌పై బీజేపీ నేతలు తీవ్రంగా మండి పడుతున్నారు.
Some memories of a memorable day in Wayanad pic.twitter.com/h4XEmQo66W
— Shashi Tharoor (@ShashiTharoor) August 3, 2024
బీజేపీ నేత అమిత్ మాల్వియా శశి థరూర్‌కి చురకలు అంటించారు. "ఇంత విధ్వంసం, ఇన్ని మరణాలు శశి థరూర్‌కి గుర్తుండిపోతాయట" అని సెటైర్లు వేశారు. మరి కొంత మంది నేతలూ ఇదే స్థాయిలో ఫైర్ అయ్యారు. నెటిజన్లూ ఇదే స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "అంత విధ్వంసం జరిగి 300 మందికి పైగా చనిపోతే ఈయనకు ఇదంతా ఓ మెమరీ లాగా ఉందా" అని కామెంట్స్ చేస్తున్నారు. "సాయం చేయడం కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడంపైనే ఫోకస్ అంతా ఉన్నట్టుంది" అని ఇంకొందరి విమర్శించారు. ఈ ట్రోలింగ్ తరవాత శశి థరూర్ మరో పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. memorable అని ఎందుకు అన్నారో వివరించారు. తనకు ఎంతో ప్రత్యేకమైన రోజు కాబట్టే అలా పెట్టానని చెప్పారు. అయినా ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. జులై 30వ తేదీన వయనాడ్‌లో కొండ చరియలు విరిగి పడ్డాయి. మెప్పడి, మందక్కై, చూరల్‌మల ప్రాంతాలపై తీవ్రంగా ప్రభావం పడింది. ఎక్కడ చూసినా బురద మేటలే కనిపిస్తున్నాయి. ఇళ్లు, భారీ భవనాలు అన్నీ ధ్వంసమయ్యాయి. మృతుల సంఖ్య 358కి పెరిగింది. (Also Read: Viral News: అంత రాత్రి పూట రోడ్డు మీద ఏం చేస్తున్నావ్, లైంగిక వేధింపుల బాధితురాలితో పోలీసుల దురుసు ప్రవర్తన)
Deaths and disaster are memorable for Shashi Tharoor. https://t.co/40zjGW6c0b
— Amit Malviya (@amitmalviya) August 3, 2024
వయనాడ్‌లోని పరిస్థితులపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ విపత్తు నుంచి సురక్షితంగా బయటపడ్డ వాళ్లను ఉద్దేశిస్తూ కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. ఇళ్లు కోల్పోయిన బాధితులందరికీ ప్రత్యేకంగా టౌన్‌షిప్ నిర్మించి ఇస్తామని వెల్లడించింది. ఇప్పటికే కర్ణాటక కూడా ఇదే ప్రకటించింది. రాహుల్ గాంధీ హామీ మేరకు ఇక్కడి నిరాశ్రయులకు ఇళ్లు కట్టిస్తామని స్పష్టం చేసింది.
Also Read: Israel Hamas War: మరి కొద్ది గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం, ఏ క్షణాన్నైనా మొదలు కావచ్చు!