అన్వేషించండి

Israel Hamas War: మరి కొద్ది గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం, ఏ క్షణాన్నైనా మొదలు కావచ్చు!

Middle East: మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇజ్రాయేల్‌పై హెజ్బుల్లా రాకెట్‌లతో దాడులు చేసింది. అటు ఇజ్రాయేల్ కూడా గట్టిగానే బదులు ఇస్తోంది.

Middle East Tensions: ఇజ్రాయేల్ హమాస్ యుద్ధం అటు మధ్యప్రాచ్యంలోనూ అలజడి సృష్టిస్తోంది. మూడో ప్రపంచ యుద్ధం తప్పదన్న స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా సంచలనమవుతోంది. ఇరాన్‌ జోక్యంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటికే ఇజ్రాయేల్‌పై హెజ్బుల్లా రాకెట్‌లతో విరుచుకు పడింది. టెహ్రాన్‌లో హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయేల్ హనియేని మట్టుబెట్టిం ఇజ్రాయేల్. అప్పటి నుంచి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయేల్‌పై పగ తీర్చుకునేందుకు ఇరాన్‌ సిద్ధమైంది. అమెరికా జోక్యం చేసుకుని హెచ్చరించినా ఇరాన్ ఏ మాత్రం లెక్క చేయడం లేదు. ఇజ్రాయేల్‌పై రాకెట్‌లతో దాడులు మొదలు పెట్టింది. ఇరాన్ ఇజ్రాయేల్‌పై దాడులు చేస్తుందని ముందే ఊహించామని అమెరికా ప్రకటించింది.

అయితే...హెజ్బుల్లా చేసిన దాడులను తిప్పికొట్టామని ఇజ్రాయేల్ ప్రకటించింది. డోమ్‌ సిస్టమ్‌ ద్వారా ఆ రాకెట్‌లను నిర్వీర్యం చేశామని స్పష్టం చేసింది. ఇజ్రాయేల్ మిత్ర దేశమైన అమెరికా కీలక ప్రకటన చేసింది. మధ్యప్రాచ్యంలో తమ సైన్య బలాన్ని పెంచుతున్నట్టు వెల్లడించింది. ఇజ్రాయేల్‌కి అండగా నిలహడతామని తేల్చి చెప్పింది. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌ని సిద్ధంగా ఉంచనున్నట్టు తెలిపింది. బాలిస్టిక్ క్షిపణుల్నీ పంపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. త్వరలోనే ఇరాన్‌ కచ్చితంగా వెనక్కి తగ్గుతుందా అన్న ప్రశ్నకు ఆయన "కచ్చితంగా చెప్పలేం" అని బదులిచ్చారు. 

బీరట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మార్గదర్శకాలు జారీ చేసింది. లెబనాన్‌లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే అక్కడి నుంచి వచ్చేయాలని సూచించింది. వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటపడాలని తెలిపింది. మరి కొద్ది రోజుల్లో అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేమని ఆందోళన వ్యక్తం చేసింది. జోర్డాన్, ఫ్రాన్స్, కెనడాతో పాటు భారత్ కూడా ఇవే మార్గదర్శకాలు జారీ చేసింది. లెబనాన్‌లోని భారతీయులు వెంటనే వచ్చేయాలని ఇండియా ప్రకటించింది. అటు ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. హమాస్ లీడర్‌ని చంపినందుకు ఇజ్రాయేల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. హెజ్బుల్లాతో పాటు ఇరాన్‌ మద్దతునిస్తున్న ఇరాక్, యెమెన్, సిరియా కూడా ఇజ్రాయేల్, పాలస్తీనా యుద్ధంలో పరోక్షంగా పాల్గొంటున్నాయి. ఫలితంగా మిడిల్ ఈస్ట్‌లో అలజడి అంతకంతకూ పెరుగుతోంది. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయేల్ దాడి చేసింది.

హెజ్బుల్లా లీడర్ అలీ అబ్ద్ అలీ ఈ దాడిలో హతమయ్యాడు. ఈ మేరకు హెజ్బుల్లా కూడా ప్రకటన చేసింది. అలీ చనిపోయినట్టు వెల్లడించింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. గాజాలోని స్కూల్‌పై ఇజ్రాయేల్ దాడి చేసింది. ఈ దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక భారత్‌లోని ఫేమస్ ఆస్ట్రలాజర్ కుశాల్ కుమార్ మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని సంచలన ప్రకటన చేశారు. అంతకు ముందు ఇజ్రాయేల్, హమాస్...రష్యా ఉక్రెయిన్ యుద్ధాల్ని ముందే పసిగట్టి చెప్పిన కుశాల్ కుమార్ ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్‌ గురించీ హెచ్చరించారు. జూన్ 18వ తేదీనే ఈ యుద్ధం మొదలవుతుందని అంచనా వేశాడు. కానీ ఆ అంచనా తప్పింది. ఇప్పుడు మరోసారి ఆగస్టు 5వ తేదీన వార్ మొదలవుతుందని చెప్పాడు. 

Also Read: Viral News: సెల్ఫీ కోసం ఆరాటం, కాలు జారి 60 అడుగుల లోయలో పడిన మహిళ - పరిస్థితి విషమం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget