అన్వేషించండి

CRPC 107 : ఆ సెక్షన్ కింద పోలీసు కేసులొద్దు - ఏపీ డీజీపీకి హైకోర్టు ఆదేశం..!

సీఆర్పీసీ 107 సెక్షన్ కింద పోలీసులు కేసులు పెట్టవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఇలా నమోదు చేసిన ఓ ఎఫ్ఐఆర్‌ను కొట్టి వేసింది.


సీఆర్‌పీసీ సెక్షన్‌-107 కింద నమోదైన పోలీసులు కేసులు నమోదు చేయవద్దని హైకోర్టు ఏపీ డీజీపీని ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలకు ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 107 కింద తహశీల్దార్లకు బైండోవర్ చేసే అధికారం ఉంది. అయితే పోలీసులు ఆ సెక్షన్‌ను విరివిగా ఉపయోగించుకుంటున్నారు. ఇలా  అనంతపురం జిల్లా ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌లో పరుశురాములు అనే వ్యక్తిపై సీఆర్‌పీసీ సెక్షన్‌-107 కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ కూడా దాఖలు చేశారు. ఇది చట్ట విరుద్ధమని ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. 

Also Read : వినాయక మండపాలు పెట్టుకోవచ్చు..!

ఈ పిటిషన్‌పై విచారణలో అల్లర్లను సృష్టించే వారిని సీఆర్‌పీసీ సెక్షన్‌-107 కింద బైండోవర్‌ చేసే అధికారం తహసీల్దార్లకు మాత్రమే ఉందని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. వారి అధికారాన్ని పోలీసులు లాగేసుకుంటున్నారని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సెక్షన్‌-107 కింద పోలీసులు లక్షల మందిపై కేసులు పెడుతున్నారని కోర్టుకు వివరించారు.వాదనలు విన్న న్యాయస్థానం సీఆర్‌పీసీ సెక్షన్‌-107 కింద కేసులు నమోదు చేయొద్దని ఆదేశించింది.

Also Read : కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ కష్టమే..!


ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎవరినై అదుపులోకి తీసుకోవాలంటే ముందుగా అత్యంత సులువుగా సెక్షన్ 107ను ప్రయోగిస్తున్నారు. రాజకీయ పార్టీల కార్యకర్తలను విపరీతంగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న  పోలీసులు ఈ సెక్షన్ పేరుతో  సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. పరుశురాములు అనే వ్యక్తిపైనా అదే తరహాలో కేసులు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో ఆయన న్యాయపోరాటం చేశారు. పరుశురాములు పోరాట ఫలితంగా పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్న అనేక కేసుల్లో ఎఫ్ఐఆర్‌లు రద్దయ్యే అవకాశం ఉంది. 

Also Read : జగన్‌కు గుదిబండగా మారిన ఐదు హామీలేంటి..?


ప్రస్తుతం పరుశురాములు ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు కొట్టి వేసింది.  ఇదే తరహాలో నమోదైన కేసులపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. డీజీపీ ఈ అంశంపై అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. ఆయన హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆదేశాలు జారీ చేసిన తరవాత సెక్షన్ 107 కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లను తొలగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైకోర్టు తీర్పు అనేక మంది బాధితులకు ఊరటనిచ్చే అవకాశం ఉంది. రాజకీయ కారణాలతో విరుచుకుపడే పోలీసులకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదేనని భావిస్తున్నారు.  

Also Read : ఏపీ సర్కార్‌కు మళ్లీ రంగు పడుతుందా..?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget