Amit Shah: జమ్ము, కశ్మీర్‌లో ఇదో కొత్త అధ్యాయం, వివక్ష లేని అభివృద్ధి జరుగుతోంది-కేంద్ర మంత్రి అమిత్‌షా
జమ్ము, కశ్మీర్‌లో అన్ని వర్గాల ప్రజలకూ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు.
కశ్మీర్‌లో రామానుజచార్య విగ్రహావిష్కరణ..
లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాలనలో జమ్ము, కశ్మీర్ అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు హోం మంత్రి అమిత్ షా. ఈ పురోగతి ఏ ఒక్క వర్గానికో పరిమితం కాకుండా, అందరికీ ఆ ఫలాలు అందుతున్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో అణిచి వేయగలిగామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. "ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జమ్ము, కశ్మీర్‌లో శాంతి, అభివృద్ధి కనిపిస్తున్నాయి. ఎల్‌జీ మనోజ్ సిన్హా సమర్థంగా పని చేశారు" అని ప్రశంసలు కురిపించారు. సోనావర్‌లో రామానుజాచార్య విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి వివక్ష లేని అభివృద్ధి సాధించటంలో ఇక్కడి యంత్రాంగం సక్సెస్ అయిందని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తరవాతైనా జమ్ము, కశ్మీర్‌లో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావించారని, ఆ అంచనాలకు అనుగుణంగానే అది సాధ్యమైందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆ కలని నెరవేర్చారని చెప్పారు. 2019 ఆగస్టు 5వ తేదీన జమ్ము, కశ్మీర్‌లో కొత్త అధ్యాయం మొదలైందని వ్యాఖ్యానించారు.
श्रीनगर के शुरयार मंदिर में श्री यदुगिरी यतिराज मठ द्वारा स्थापित 'स्टैच्यू ऑफ पीस' स्वामी रामानुजाचार्य जी की प्रतिमा का वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से अनावरण किया।
— Amit Shah (@AmitShah) July 7, 2022
कश्मीर में स्थापित रामानुजाचार्य जी की ये प्रतिमा न केवल कश्मीर बल्कि पूरे भारत में शांति का संदेश देगी। pic.twitter.com/JR529ZaKKp
ఇది జమ్ము, కశ్మీర్‌కు శుభసూచికం..
శాంతిని కోరుకున్న రామానుజ చార్యులు విగ్రహం ఆవిష్కరించటం, జమ్ము కశ్మీర్‌కు శుభసూచికమని అభిప్రాయపడ్డారు. శ్రీనగర్‌లోని సూర్య దేవాలయాన్ని పునరుద్ధరించటం ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. రామానుజ చార్యుల ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ, శాంతులతో
జీవిస్తారని చెప్పారు. ఇదే విషయాన్నిట్విటర్ ద్వారా వెల్లడించారు అమిత్ షా. శ్రీనగర్‌లోని షురియర్ ఆలయంలో శ్రీ యదుగిరి యతిరాజ్ మఠ్‌లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన అమిత్‌షా, దేశానికంతటికీ ఇది శుభపరిణామని వెల్లడించారు.
Also Read: Why Nagababu Target Modi : మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్‌గానే చెబుతోందా ?
Also Read: Lantana Camara Plant : సైంటిస్టులను భయపెడుతోన్న పులి కంప పొదలు