అన్వేషించండి

Kerala Assembly Elections 2026: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ - కానీ విజయం ముందు బొర్లా పడుతుందా?

Kerala Politics: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కూడా బలమైన శక్తిగా ముందుకు వస్తుందని కేరళ రాజకీయం అంచనా వేస్తోంది.

Kerala Assembly elections Three-way contest: కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2026 సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర రాజకీయ వాతావరణం అత్యంత ఆసక్తికరంగా మారింది. వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్  పోరాడుతుంటే, ఈసారి ఎలాగైనా పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రం  వ్యూహాలు రచిస్తోంది. తన ఉనికిని బలంగా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.  

యూడీఎఫ్ కు బూస్ట్ ఇచ్చిన స్థానిక ఎన్నికల ఫలితాలు

కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్స్‌గా నిలిచాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 38.8 శాతం ఓట్లతో  మున్సిపాలిటీలు ,  పంచాయతీలను కైవసం చేసుకుని అధికార ఎల్డీఎఫ్ కు గట్టి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఎల్డీఎఫ్ కంచుకోటలుగా భావించే కన్నూర్, కొచ్చి వంటి నగరాల్లో కూడా కాంగ్రెస్ కూటమి పాగా వేయడం ఆ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడంలో తాము విజయం సాధించామని యూడీఎఫ్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్న ప్రజల మద్దతు తమకే ఉందని వి.డి. సతీశన్ వంటి కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. అయితే ఇదే సమయంలో సీనియర్ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పినరయి విజయన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన అంచనా వేయడం సొంత పార్టీలోనే విస్మయం కలిగించింది. అయినప్పటికీ, మైనారిటీ ఓట్లు ,  రైతుల మద్దతును కూడగట్టడం ద్వారా 2026లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది.

మునుపెన్నడూ లేని  విధంగా పుంజుకున్న బీజేపీ 

ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సాధించిన విజయాలు. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీ మొదటిసారి అతిపెద్ద కూటమిగా అవతరించి చరిత్ర సృష్టించింది. దాదాపు 45 ఏళ్ల లెఫ్ట్ పాలనకు ముగింపు పలికి 50 వార్డులను దక్కించుకోవడం ద్వారా బీజేపీ కేరళలో మూడో శక్తిగా ఎదిగింది. మున్సిపాలిటీలు,  గ్రామ పంచాయతీల్లో కూడా బీజేపీ ఓట్ల శాతం పెరగడం ఈసారి కేరళలో  ముక్కోణపు పోటీ  ఖాయమనే సంకేతాలను ఇస్తోంది.

ఎల్డీఎఫ్ మళ్లీ గెలుస్తుందా? 

వరుసగా రెండుసార్లు విజయం సాధించి రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఈ సారి కూడా ఎల్డీఎఫ్ కే విజయం వరిస్తుందని భావిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో ఎదురైన పరాజయాలను విశ్లేషించుకుని, తప్పులను సరిదిద్దుకుంటామని ఎల్డీఎఫ్ కన్వీనర్ ప్రకటించారు. ముఖ్యంగా సామాజిక పింఛన్ల పెంపు, ఉచిత విద్య వంటి ప్రజాకర్షక పథకాలను ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రవేశపెట్టి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే అవినీతి ఆరోపణలు, కే-రైల్ ప్రాజెక్టుపై నిరసనలు ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి.
 
ప్రజా సమస్యలే అజెండాగా ఎన్నికల కురుక్షేత్రం 

రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు ,మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన అంశాలుగా మారనున్నాయి. కేరళ ఓటర్లు ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని 2021లో ఎల్డీఎఫ్ బ్రేక్ చేసింది. ఇప్పుడు 2026లో మళ్లీ అదే సంప్రదాయం కొనసాగుతుందా లేక పినరయి విజయన్ హ్యాట్రిక్ కొడతారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. బీజేపీ చీల్చే ఓట్లు ఏ పార్టీకి నష్టం కలిగిస్తాయి అనే దానిపైనే రాష్ట్ర అధికార పీఠం ఎవరిదనేది ఆధారపడి ఉంటుంది. 

టాప్ హెడ్ లైన్స్

Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Embed widget