అన్వేషించండి

OPS Meets Stalin: ఒంటరి పోరాటం చేస్తున్న పన్నీర్ సెల్వం DMK వైపు? సంచలన నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

OPS Meets Stalin: రాజకీయాల్లో ఒంటరిగా మిగిలిపోయిన మాజీ ముఖ్యమంత్రి ఓపీఎస్.. తీవ్ర నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. స్టాలిన్‌ను కలిసి ఆయన డీఎంకే గూటికి వెళ్తున్నట్టు సమాచారం.  

OPS Meets Stalin: మాజీ ముఖ్యమంత్రి, జయలలితకు వీరాభిమాని అయిన ఓ. పన్నీర్ సెల్వం తన రాజకీయ జీవితంలో దాదాపు ఒంటరి అయిపోయారు. అన్నాడీఎంకేలో తిరిగి చేరడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. అందుకే ఇప్పుడు ఆయన ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌తో సమావేశమై అభినందనలు తెలిపారు. తమిళనాడులో డీఎంకే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉందని ఆయన ఒక మీడియాతో చెప్పుకొచ్చారు. దీంతో ఆయన డీఎంకేలో చేరతారా లేదా అనే ప్రశ్నలు తలెత్తాయి.  

ఓపీఎస్ మద్దతుదారు ఎమ్మెల్యే అయ్యప్పన్ అసెంబ్లీలో కీలక ప్రకటన 

తమిళనాడు శాసనసభలో రెండు రోజులుగా ప్రభుత్వ తాత్కాలిక బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. ఈ సమావేశాల్లో పన్నీర్ సెల్వంకు మద్దతు ఇచ్చే అన్నాడీఎంకే ఎమ్మెల్యే అయ్యప్పన్ అసెంబ్లీలో కీలక ప్రటన చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎం.కె. స్టాలిన్ మళ్లీ గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. విప్లవ నాయకుడు ఎంజీఆర్, విప్లవ నాయకురాలు అమ్మ జయలలిత ఆశీస్సులతో ఎం.కె. స్టాలిన్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.

డిఎంకె మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న పన్నీర్‌సెల్వం  

తమిళనాడు శాసనసభ సమావేశాలు ముగిశాయి. ఇంతలో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను కలిసి కొద్దిసేపు మాట్లాడారు. దీని తర్వాత ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. 5 సంవత్సరాల DMK పాలన బాగుందని, దానికి అభినందనలు తెలిపేందుకు ముఖ్యమంత్రి M.K. స్టాలిన్‌ను కలిశానని ఆయన అన్నారు. 5 సంవత్సరాల DMK పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారని తమిళనాడులో వారు మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందని కూడా ఆయన అన్నారు.

ఎమ్మెల్యే అయ్యప్పన్ చేసిన ప్రకటనపై ప్రశ్నకు సమాధానంగా, ప్రజలు ఏమనుకుంటున్నారో దాని గురించి మాత్రమే తన మద్దతుదారు ఎమ్మెల్యే అయ్యప్పన్ అసెంబ్లీలో మాట్లాడారని అన్నారు. తరువాత, మీరు డిఎంకెలో చేరుతారా అని అడిగినప్పుడు, ఓపిఎస్, "వేచి చూడండి" అని అన్నారు. దీనితో ఆయన డిఎంకెలో చేరుతారా లేదా అనే సందేహాలు తలెత్తాయి. 

రాజకీయాల్లో ఒంటరి అయిన ఓపీఎస్

జయలలితకు గట్టి మద్దతుదారుగా ఉన్న పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రిగా చేశారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించినందుకు ఆయనను పార్టీ నుంచి వెళ్లగొట్టారు. ఆయన ఎంత ప్రయత్నించినా నేటికీ అన్నాడీఎంకేలో తిరిగి చేరలేకపోయారు.

మరోవైపు, ప్రత్యేక పార్టీని ప్రారంభించడానికి బదులుగా, హక్కుల పునరుద్ధరణ కమిటీని ఏర్పాటు చేసి పోరాడాడు. కానీ ఆయనకు విజయం లభించలేదు. మద్దతుదారులు కూడా ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోయారు. వివిధ పార్టీల్లో చేరిపోయారు. ఇప్పుడు ఆయన తరఫున ఉన్నద్ది ఎమ్మెల్యే అయ్యప్పన్ మాత్రమే.

తాను ఒంటరిగా మిగిలిపోయి ఎక్కడికీ వెళ్లలేని స్థితిలో ఉండటం వల్లే డీఎంకేలో చేరాలని తీవ్ర నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ ప్రశ్నకు సమాధానం త్వరలోనే తెలుస్తుందని ఆయన అభిమానులు చెబుతున్నారు.                 

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
HYDRA Jobs: ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
ఏయే నా కొడుకు ఎక్కువ మాట్లాడాడో గుర్తించండి! హైడ్రా జాబ్స్ కోసం వచ్చిన అభ్యర్థులపై దురుసు ప్రవర్తన
Embed widget