అన్వేషించండి

Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం - స్టాలిన్‌తో పన్నీర్ సెల్వం భేటీ

Panneerselvam: తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం .. స్టాలిన్ తోసమావేశమయ్యారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని కీలక వ్యాఖ్యలు చేశారు.

Panneerselvam meets Stalin: తమిళనాడు రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం (OPS) , ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.    తమిళనాడు శాసనసభ సమావేశాల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్‌సెల్వం, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను ప్రత్యేకంగా కలిశారు.  ఏఐఏడీఎంకే  లో చోటు చేసుకున్న అంతర్గత విభేదాల వల్ల ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఓపీఎస్, తన సొంత వర్గంతో రాజకీయంగా ఒంటరయ్యారు. ఈ క్రమంలో అధికార పక్ష నేతను ఆయన కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  

అసెంబ్లీలో ఓపీఎస్ మద్దతుదారుడు ఐయ్యప్పన్ ఆసక్తికర వ్యాఖ్యలు 

తమిళనాడు శాసనసభలో రెండ్రోజుల పాటు జరిగిన తాత్కాలిక బడ్జెట్ చర్చల సందర్భంగా ఓపీఎస్ మద్దతుదారుడు, ఎమ్మెల్యే ఐయ్యప్పన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ము.క. స్టాలిన్ మళ్లీ విజయం సాధించి, తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. అంతేకాకుండా, పురట్చి తలైవర్ ఎంజీఆర్, పురట్చి తలైవి అమ్మ  జయలలిత  ఆశీస్సులతో స్టాలిన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలపడం అందరినీ ఆశ్చర్యపరిచింది.   

 

 మళ్లీ డీఎంకే పాలనే.. ఓపీఎస్ ధీమా 

శాసనసభ సమావేశాల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసిన ఓపీఎస్, అనంతరం మీడియాతో మాట్లాడారు. డీఎంకే ఐదేళ్ల పాలన అత్యంత అద్భుతంగా ఉందని కొనియాడారు. అందుకే ఉదయాన్నే ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపానని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే మళ్లీ డీఎంకే అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన విశ్లేషించారు. తన మద్దతుదారు ఐయ్యప్పన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ప్రజల మనోగతానికి ప్రతిరూపమని ఓపీఎస్ సమర్థించారు.

 డీఎంకేలో చేరికపై వేచి చూడండి 

మీరు డీఎంకేలో చేరుతారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఓపీఎస్ స్పందిస్తూ..  కొంతకాలం వేచి చూడండి అని బదులిచ్చారు. ఈ సమాధానం ఆయన పార్టీ మారబోతున్నారనే అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, జయలలిత మరణం తర్వాత ఏఐఏడీఎంకే నుండి బహిష్కరణకు గురైన ఓపీఎస్.. 'ధర్మయుద్ధం' చేసినా, 'హక్కుల పునరుద్ధరణ కమిటీ' పెట్టి పోరాడినా ఆశించిన ఫలితం దక్కలేదు. ఆయన ప్రధాన అనుచరులంతా ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లో చేరిపోగా, ఇప్పుడు ఆయన వద్ద మిగిలింది కేవలం ఎమ్మెల్యే ఐయ్యప్పన్ మాత్రమే. 
 
ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఓపీఎస్ డీఎంకే వైపు మొగ్గు చూపుతున్నారా అనే సందేహం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన స్పష్టత అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.                          

టాప్ హెడ్ లైన్స్

Monsoon Session Parliament: కేంద్రం మాస్టర్ ప్లాన్‌కు జెన్-జీ బ్రేక్ - పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లు ?
కేంద్రం మాస్టర్ ప్లాన్‌కు జెన్-జీ బ్రేక్ - పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లు ?
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
NEET SUPREME COURT:నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
BCCI Selection Twist: అగార్కర్ పై వేటు వేసేందుకు బిసిసిఐ ప్లాన్..! లక్ష్మణ్ కి చీఫ్ సెలెక్టర్ పగ్గాలు, రోహిత్ రిటైర్మెంట్ వివాదంలో ఊహించ‌ని ట్విస్ట్!
అగార్కర్ పై వేటు వేసేందుకు బిసిసిఐ ప్లాన్..! లక్ష్మణ్ కి చీఫ్ సెలెక్టర్ పగ్గాలు, రోహిత్ రిటైర్మెంట్ వివాదంలో ఊహించ‌ని ట్విస్ట్!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Embed widget