Phone Addicted: ఫోన్ ఎక్కువగా వాడితే గజినీ అవుతారు.. తల్లిదండ్రులనూ మర్చిపోయిన ఈ యువకుడే ఉదాహరణ
ఫోన్ ఎక్కువ వాడితే వచ్చే సమస్యలు అన్నీ.. ఇన్నీ కావు. అయినా వాడుతూనే ఉంటారు. చివరకు ఎక్కడ లేని సమస్యలు తెచ్చుకుంటారు. ఓ యువకుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు.
ఎవరు ఎంత చెప్పినా.. స్మార్ట్ ఫోన్ వాడకం పెరుగుతుందే గానీ.. తగ్గడం లేదు. ఓ యువకుడు కూడా ఫొన్ ఎక్కువగా వాడొద్దు అని ఎవరు చెప్పినా వినలేదు. స్మార్ట్ ఫోన్‌కు విపరీతంగా అడిక్ట్ అయ్యాడు. ఎంతలా అంటే.. తన గతాన్ని కూడా మర్చిపోయాడు. ఫోన్ వాడి.. వాడి.. మానసిక సమస్యలు వచ్చాయి. దాంతో.. కన్నతల్లిదండ్రులను కూడా గుర్తించలేని పరిస్థితికి చేరుకున్నాడు.
రాజస్థాన్‌లోని చూరు జిల్లాలో సహ్వా టౌన్‌కు చెందిన అక్రామ్ అనే 20 ఏళ్ల యువకుడు.. ఫోన్ ఎక్కువగా వాడతాడు. ఎలా అంటే.. కొన్ని రోజులుగా.. తను చేస్తున్న పనిని కూడా వదిలేసుకున్నాడు. ఇటు ఆదాయానికి కాదు.. మనసుకు నష్టం చేసుకున్నాడు. ఫోన్ వాడివాడి.. కొన్ని రోజులుగా నిద్రపోవడం కూడా మానేశాడు. తినడం కూడా చాలావరకు తగ్గించాడు. ఇదంతా గమనించిన కుటుంబ సభ్యులు.. భార్టియా ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతడు వైద్యులు పర్యవేక్షణలో ఉన్నాడు. యువకుడికి చికిత్స అందిస్తున్నామని మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ జితేంద్ర కుమార్ తెలిపారు.
మా ఊరిలో అక్రమ్ కు ఎలక్ట్రిక్ షాప్ ఉంది. కొద్ది రోజుల నుంచి అతడు ఎక్కువగా ఫోన్ లోనే గడుపుతున్నాడు. ఫొన్ చూస్తూ.. చేస్తున్న పని కూడా మానేశాడు. ఎంత చెప్పినా అస్సలు వినలేదు. రాత్రంతా మొబైల్‌లో చాట్స్, గేమ్స్ ఆడేవాడు. తినడం, తాగడం కూడా మానేశాడు... అని యువకుడి మామ అర్బాజ్ తెలిపారు.
Also Read: మనిషి జీవిత సారాన్ని పాటల్లో చెప్పిన రుషి... మహర్షి... సీతారామశాస్త్రి!
Also Read: తొలిపాటకే 'నంది' అందుకున్న సిరివెన్నెల.. రాయడానికి ఎన్నిరోజులు పట్టిందంటే..
Also Read: Omicron Scare: 'ఒమిక్రాన్'పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు.. ఇవి తప్పనిసరి!
Also Read: 12 MP Suspension: ఎంపీల సస్పెన్షన్‌పై వెనక్కి తగ్గని వెంకయ్య.. విపక్షాలు వాకౌట్
Also Read: Omicron Variant: 'ఒమ్రికాన్'పై కేంద్ర ఆరోగ్యమంత్రి కీలక ప్రకటన.. ఏం చెప్పారంటే?
Also Read: New Chief Of Indian Navy: భారత నౌకాదళ కొత్త అధిపతిగా హరి కుమార్.. ఆయన ప్రత్యేకతే వేరు!
Also Read: Corona Cases: ఒమిక్రాన్ భయాందోళన వేళ ఊరట.. భారీగా తగ్గిన కరోనా కేసులు
Also read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు
Also read: శీతాకాలంలో ఏ సమయంలో తగిలే ఎండ వల్ల విటమిన్ డి లభిస్తుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?
Also read: మీ జీవితభాగస్వామిపై నమ్మకం పోయిందా? అయితే ఇలా చేయండి, బంధాన్ని నిలబెట్టుకోండి...
Also read: ఇంట్లో ఇవి ఉంటే నెగిటివ్ ఎనర్జీ... డబ్బును రాకుండా అడ్డుకుంటాయి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి