ఉత్తరాఖండ్ లో 11 మంది ట్రెక్కర్లు మృతి.. మిగతా వారి కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరాఖండ్ లో మరో ఘోర విషాద ఘటన జరిగింది. ట్రెక్కింగ్ కోసం వెళ్లిన 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఉత్తరాఖండ్ లో మరో 11 మంది మృతదేహాలను రెస్క్యూ బృందాలు గుర్తించాయి. అక్టోబర్ 18న 17 మంది ట్రెక్కర్లు మిస్ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాను ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌తో కలిపే అత్యంత ప్రమాదకరమైన పాస్‌లలో ఒకటి - లమ్‌ఖగా పాస్‌కు వెళ్లే ప్రాంతం అది.
కొంతమంది ట్రెక్కింగ్ వెళ్లి మిస్ అయ్యారని తెలిసిన తర్వాత.. అక్టోబర్ 20న అధికారులు చేసిన ఎస్ఓఎస్ కాల్‌కు భారత వైమానిక దళం స్పందించింది. రాష్ట్రంలోని పర్యాటక హిల్ స్టేషన్ అయిన హర్సిల్ చేరుకోవడానికి రెండు అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది. అదే రోజు.. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏఎల్‌హెచ్ క్రాఫ్ట్‌లో రెస్క్యూ ప్రారంభించింది. చివరకు వారు రెండు రెస్క్యూ సైట్‌లను గుర్తించగలిగారు.
ట్రెక్కింగ్‌కు వెళ్లిన 17 మందిలో 11 మంది మృతులై తేలారు. ఉత్తరాఖండ్‌కు 17వేల అడుగుల ఎత్తులో ఉన్న లమ్‌ఖగా పాస్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ చేపడుతోంది.. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాను.. ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌తో కలిపే అత్యంత ప్రమాదకరమైన పాస్‌లలో లమ్‌ఖగా పాస్ ఒకటి. జాతీయ విపత్తు నిర్వహణకు చెందిన ముగ్గురు సభ్యులతో కూడిన బృందం హెలికాఫ్టర్‌లో 19,500 అడుగుల ఎత్తుకు చేరుకుని.. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొంది.
గల్లంతైన మిగిలిన వ్యక్తులను గుర్తించడానికి ఏఎల్‌హెచ్ సిబ్బంది శనివారం రెస్క్యూ చేపట్టనున్నారు. సహాయక బృందాలు మృతదేహాలను స్థానిక పోలీసులకు అప్పగించారు. గాయపడినవారిని ఉత్తరకాశీలోని జిల్లా ఆసుపత్రికి పంపే ముందు హర్సిల్‌లో ప్రథమ చికిత్స చేయించారు. ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో 50 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Congress: 100 కోట్ల డోసులా..సెప్టెంబర్‌లోనే చైనా 200 కోట్లు క్రాస్ చేసింది: కాంగ్రెస్
Also Read: PM Modi Speech Highlights: వ్యాక్సినేషన్‌లో భారత్ 100 కోట్ల మార్క్.. ప్రపంచ దేశాలు షాక్: మోదీ