TRS Vs BJP: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారంలో ఉద్రిక్తత... బాహాబాహీకి దిగిన టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు...

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచార ర్యాలీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఓ పార్టీ కార్యకర్త ఎస్సైపై చేయి చేసుకోవడంతో ఘర్షణ తీవ్రంగా మారింది.

FOLLOW US: 

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్ ప్రచారంలో ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ ర్యాలీని అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇరుపార్టీల కార్యకర్తలు పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. వివాదం ముదిరి ఒకరిపై ఒకరు బాహాబాహీకి దిగడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకొంది. కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్సైపై ఒకరు చేయి చేసుకోవడంతో ఇరుపార్టీల మధ్య ఘర్షణ మరింత తీవ్రస్థాయికి చేరింది. పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పి పంపించేశారు. ఈ ఘర్షణపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.  

Also Read: హుజూరాబాద్ కోసం నేరుగా రంగంలోకి కేసీఆర్! రెండ్రోజులు ప్రణాళిక ఇలా..

ఇరువర్గాల తోపులాట 

సిరిసెడు గ్రామంలో కిషన్‌రెడ్డి రోడ్ షోలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఒకరికొకరు ఎదురెదురయ్యారు. ఈ సమయంలో జై కేసీఆర్, జై ఈటల అంటూ పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాలను అడ్డుకునేందుకు పోలీసులు చాలా శ్రమించారు. ఇరువర్గాలకు స్వల్పగాయాలయ్యాయి. కార్యకర్తల బాహాబాహీతో పావుగంట సేపు రోడ్డు మార్గం స్తంభించింది. ఎట్టకేలకు ఇరువర్గాలకు పోలీసులు సర్థిచెప్పి పంపిచేశారు. పోలింగ్‌ సమయం దగ్గర పడుతున్న కొద్దీ హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రచారం జోరు పెరుగుతోంది. రాజకీయ నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 

Also Read: హుజూరాబాద్ కోసం నేరుగా రంగంలోకి కేసీఆర్! రెండ్రోజులు ప్రణాళిక ఇలా.. 

టీఆర్ఎస్ పై బండి సంజయ్ విమర్శలు

పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నుల పేరు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.వేల కోట్లు దోచుకుంటుందని ఆరోపించారు. వాస్తవానికి లీటర్ పెట్రోలుపై కేసీఆర్ ప్రభుత్వం 41 రూపాయలు దోచుకుంటోందన్నారు. కేసీఆర్ కు ప్రజలపై నిజంగా చిత్తశుద్ది ఉంటే ఆ పన్నుల మొత్తాన్ని మినహాయించుకోంటూ రూ.60కే లీటర్ పెట్రోలు అందించవచ్చని సవాల్ విసిరారు. రోడ్లు, డ్రైనేజీ, ఇండ్ల నిర్మాణం, రేషన్ బియ్యం సహా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అయ్యే నిధులను కేంద్రమే అందిస్తోందని బండి సంజయ్ చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆ నిధులను దారి మళ్లించి ఉప ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తుందని మండిపడ్డారు.  

Also Read: లీటర్ పెట్రోల్ పై రూ.41 దోచుకుంటున్న కేసీఆర్ సర్కార్... కేంద్రం నిధులతో టీఆర్ఎస్ నేతలు కార్లు కొంటున్నారు... బండి సంజయ్ సంచలన కామెంట్స్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Oct 2021 11:01 PM (IST) Tags: BJP huzurabad by poll trs by poll telangana latest news Kishan Reddy TS News Etela Rajender

సంబంధిత కథనాలు

Hyderabad News : హైదరాబాద్ లో ఆటోలు, క్యాబ్ లు, లారీలు బంద్, కొత్త మోటార్ వాహనాల చట్టం రద్దుకు డిమాండ్

Hyderabad News : హైదరాబాద్ లో ఆటోలు, క్యాబ్ లు, లారీలు బంద్, కొత్త మోటార్ వాహనాల చట్టం రద్దుకు డిమాండ్

Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ

Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ

Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి

Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు

Weather Updates : చురుగ్గా విస్తరిస్తోన్న నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల్లో మోస్తరు వర్షాలు

Gold Silver Price Today 19th May 2022 : స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు- మీ నగరాల్లో ఉన్న ధరలు ఇవే

Gold Silver Price Today 19th May 2022 : స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు- మీ నగరాల్లో ఉన్న ధరలు ఇవే
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Sarkaru Vaari Paata: కొన్ని ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి - 'సర్కారు వారి పాట' టాక్ పై సూపర్ స్టార్ కృష్ణ రియాక్షన్!

Sarkaru Vaari Paata: కొన్ని ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి - 'సర్కారు వారి పాట' టాక్ పై సూపర్ స్టార్ కృష్ణ రియాక్షన్!

Stock Market Crash: మార్కెట్లో బ్లడ్‌ బాత్‌! రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి - సెన్సెక్స్‌ 1000, నిఫ్టీ 300 డౌన్‌

Stock Market Crash: మార్కెట్లో బ్లడ్‌ బాత్‌! రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి - సెన్సెక్స్‌ 1000, నిఫ్టీ 300 డౌన్‌

AP PCC Chief Kiran : ఏపీ పీసీసీ చీఫ్‌గా కిరణ్‌కుమార్ రెడ్డి ! కాంగ్రెస్‌కు జరిగే మేలెంత ?

AP PCC Chief Kiran :  ఏపీ పీసీసీ చీఫ్‌గా కిరణ్‌కుమార్ రెడ్డి ! కాంగ్రెస్‌కు జరిగే మేలెంత ?

KKR vs LSG: క్రికెట్‌ కాదు LSGతో బాక్సింగ్‌ చేసిన రింకూ! నీలో చాలా ఉంది బాసు!

KKR vs LSG: క్రికెట్‌ కాదు LSGతో బాక్సింగ్‌ చేసిన రింకూ! నీలో చాలా ఉంది బాసు!