News
News
X

Bandi Sanjay: లీటర్ పెట్రోల్ పై రూ.41 దోచుకుంటున్న కేసీఆర్ సర్కార్... కేంద్రం నిధులతో టీఆర్ఎస్ నేతలు కార్లు కొంటున్నారు... బండి సంజయ్ సంచలన కామెంట్స్

కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యిందని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన డబ్బులతో టీఆర్ఎస్ నేతలు కార్లకు ఆర్డర్లు ఇచ్చారని ఆరోపించారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్ బాక్స్ బద్దలవ్వాలన్నారు.

FOLLOW US: 

పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నుల పేరు టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.వేల కోట్లు దోచుకుంటుందని ఆరోపించారు. వాస్తవానికి లీటర్ పెట్రోలుపై కేసీఆర్ ప్రభుత్వం 41 రూపాయలు దోచుకుంటోందన్నారు. కేసీఆర్ కు ప్రజలపై నిజంగా చిత్తశుద్ది ఉంటే ఆ పన్నుల మొత్తాన్ని మినహాయించుకోంటూ రూ.60కే లీటర్ పెట్రోలు అందించవచ్చని సవాల్ విసిరారు. రోడ్లు, డ్రైనేజీ, ఇండ్ల నిర్మాణం, రేషన్ బియ్యం సహా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అయ్యే నిధులను కేంద్రమే అందిస్తోందని బండి సంజయ్ చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆ నిధులను దారి మళ్లించి ఉప ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తుందని మండిపడ్డారు. 

టీఆర్ఎస్ నేతలు కార్లు కొంటున్నారు

ఒక్కో ఓటుకు రూ.20 వేలు ఇచ్చేందుకు టీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారని బండి సంజయ్ ఆరోపించారు. ఇందులోనూ రూ.15 వేలు టీఆర్ఎస్ నేతలు కొట్టేసి ఓటర్లకు రూ.5 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. మిగిలిన సొమ్ముతో కొత్త కార్లు కొంటున్నారన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాపూర్ లో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు. టీఆర్ఎస్ నేతల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

"   "టీఆర్ఎస్ నేతలు ఓటుకు రూ.20 వేలు ఇస్తుండ్రట. వచ్చినాయా? టీఆర్ఎసోళ్లు పంచడం మొదలు పెట్టిండ్రు. దొంగ నోట్లు ఉంటాయోమో లెక్కపెట్టుకోండి. ఓ కార్ల కంపెనీయన కలిసిండు. టీఆర్ఎసోళ్లు కొత్త కార్లకు అడ్వాన్సులు ఇచ్చిండ్రట. ఓటుకు రూ.20 వేలు ఇస్తుంటే...వాళ్లు అందులో రూ.15 వేలు తీసుకుని ఓటర్ కు రూ.5 వేలే ఇస్తారట. మిగిలిన సొమ్ముతో కార్లు కొంటానికి అడ్వాన్స్ ఇస్తుండ్రట. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రేనేజీ, మరుగుదొడ్లు, స్మశాన వాటికల నిర్మాణం సహా అభివ్రుద్ది, సంక్షేమ పథకాలకు కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్లించి ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు ఖర్చు పెడుతున్నరు." "
-బండి సంజయ్, తెలంగాణ బీజేపీ చీఫ్

టీఆర్ఎస్ బాక్స్ బద్దలు
 
తెలంగాణలో టీఆర్ఎస్ దోపిడీ పాలన అంతం కావాలని బండి సంజయ్ అన్నారు. 30న జరిగే పోలింగ్ లో బీజేపీకి ఓటువేసి టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కొట్టాలన్నారు. కేసీఆర్ మైండ్ షాక్ కావాలి. వచ్చే నెల 2న ‘ట్రిపుల్ ఆర్ సినిమా’ను ప్రగతి భవన్ ముందు ప్రొజెక్టర్ వేసి కేసీఆర్ కు చూపిస్తామన్నారు. అందులో ఒక ఆర్.. రాజాసింగ్..., రెండో ఆర్ రఘు నందన్....ఇక గెలవబోయే మూడో వ్యక్తి రాజేందర్...ఈ ముగ్గురితో ‘ట్రిపుల్ ఆర్’ సినిమా చూపించబోతున్నమన్నారు. దేశంలో 100 కోట్ల డోసులను ఉచితంగా వేయించిన ఘనత ప్రధాని మోదీదన్నారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ నేతలు దండుపాళ్యం బ్యాచ్ లా తిరుగుతున్నారని ఆరోపించారు. ఈనెల 27 తరువాత వీళ్లెవరూ కనిపించరన్నారు. హుజూరాబాద్ లో సేవ చేసేది ఈటల రాజేందర్ మాత్రమే అన్నారు. 

Also Read: హుజూరాబాద్ కోసం నేరుగా రంగంలోకి కేసీఆర్! రెండ్రోజులు ప్రణాళిక ఇలా.. 

రైతు బంధు ఇచ్చి అన్నీ బంద్

దొంగ సర్వేలతో కేసీఆర్ మాయమాటలు చెబుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. టీఆర్ఎస్ గెలుస్తుందని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ కు ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. రైతు బంధు ఇచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ బంద్ చేసిందని ఆరోపించారు. కేంద్రం ఎరువుల సబ్సిడీ కోసం రూ.79 వేల కోట్లు రైతుల కోసం చెల్లిస్తుందన్నారు. యూరియా అసలు ధర రూ.1170 అయితే సబ్సిడీపై రూ.270 మిగిలిన రూ.900 లు కేంద్రమే చెల్లిస్తుందన్నారు. డీఏపీ బస్తా రూ. 2450లు ఉంటే రూ.1200ల సబ్సిడీ మోదీ ప్రభుత్వం ఇస్తోందన్నారు. రైతు కట్టేది రూ.1250 మాత్రమే అని గుర్తుచేశారు. 

Also Read: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు లైన్ క్లియర్.. పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

నియంత పాలనలో తెలంగాణ బందీ

తెలంగాణ కోసం శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య, సుమన్, ఇషాంత్ రెడ్డి వంటి 1400 మంది యువత ప్రత్యేక రాష్ట్రం వస్తే పేదల బతుకులు బాగుపడతాయని బలిదానం చేస్తే పెద్దోళ్లు రాజ్యమేలుతున్నారని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఆయన కుటుంబం చేసిన త్యాగాలేంటని ప్రశ్నించారు. మంత్రి హరీష్ రావు చేసిన త్యాగమేంటి అన్నారు. కేసీఆర్ నియంత పాలనలో తెలంగాణ బందీ అయ్యిందని విమర్శించారు. 

'నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదు? దళితులకు మూడెకరాలు ఎందుకు ఇవ్వడం లేదు? డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు కట్టడం లేదు? అంటూ పేదల తరపున కొట్లాడితే పార్టీ నుండి బయటకు పంపారు కేసీఆర్...దళిత బంధు ఈటల రాజేందర్ వల్లే ఆగిందంటూ...ఇప్పుడు టీఆర్ఎస్ మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దళిత బంధు పేరిట ఇచ్చిన చెక్కులేవీ పనిచేయడం లేదు. అకౌంట్లో వేసిన డబ్బులను ఫ్రీజ్ చేసిండ్రు.'

- బండి సంజయ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు

Also Read: కేసీఆర్ యాదాద్రి వద్ద తేల్చుకుందాం రా.. అది నిరూపిస్తే దేనికైనా సిద్ధం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Oct 2021 07:36 PM (IST) Tags: cm kcr trs telangana latest news Huzurabad By Election Bandi Sanjay Kumar Petrol Prices Etela Rajender

సంబంధిత కథనాలు

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

ED Raids: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో హైదరాబాద్‌ సహా 35 చోట్ల ఈడీ సోదాలు

ED Raids: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో హైదరాబాద్‌ సహా 35 చోట్ల ఈడీ సోదాలు

Breaking News Telugu Live Updates: హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు 

Breaking News Telugu Live Updates: హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు 

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Munugodu By Election: నేటి నుంచి మునుగోడు ఉపఎన్నికకు నామినేషన్లు

Munugodu By Election: నేటి నుంచి మునుగోడు ఉపఎన్నికకు నామినేషన్లు

టాప్ స్టోరీస్

భగవంతుని ఆగ్రహానికి గురి కావద్దు- టీటీడీకి విజయ శంకర స్వామి వార్నింగ్

భగవంతుని ఆగ్రహానికి గురి కావద్దు- టీటీడీకి విజయ శంకర స్వామి వార్నింగ్

Godfather Box Office : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?

Godfather Box Office : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?

YSRCP MLA: మాకు ఓటు వేయకపోతే పింఛన్లు ఆపేస్తాం - వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

YSRCP MLA: మాకు ఓటు వేయకపోతే పింఛన్లు ఆపేస్తాం - వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

US Airstrike in Syria: సిరియాలో అమెరికా వైమానిక దాడి- ఇద్దరు టాప్ ISIS ఉగ్రవాదులు హతం!

US Airstrike in Syria: సిరియాలో అమెరికా వైమానిక దాడి- ఇద్దరు టాప్ ISIS ఉగ్రవాదులు హతం!