TS Inter Exams 2021: తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు లైన్ క్లియర్.. పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు విచారించింది. విద్యార్థుల భవిష్యత్ కోసం పరీక్షలు కొనసాగించాలని, వాయిదా వేయకూడదని వ్యాఖ్యానించింది.
TS Inter Exams 2021: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు అక్టోబర్ 25 నుంచి ప్రారంభం కానున్నాయని తెలిసిందే. అయితే ఈ పరీక్షలను వాయిదా వేయాలని తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. తల్లిదండ్రుల సంఘం తరఫున న్యాయవాది రాపోలు భాస్కర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ 25 నుంచి ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్షలను ఆపడం సమంజసం కాదని హైకోర్టు అభిప్రాయపడింది.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలనే లంచ్ మోషన్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు... పరీక్షలు నిర్వహించుకోవచ్చునని స్పష్టం చేసింది. పరీక్షలు నిర్వహించుకోవచ్చు అని ఇంటర్ బోర్డుకు హైకోర్టు సూచించింది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిందని, పిటిషన్ దాఖలు చేయడంలో చాలా ఆలస్యమైనందని కోర్టు అభిప్రాయపడింది. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పిటివేషన్ వెనక్కి తీసుకోవాలని పిటిషనర్లకు సూచించింది.
హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి
Also Read: ఏడో తరగతి పూర్తైన బాలికలకు అద్భుత అవకాశం.. RIMCలో ప్రవేశానికి TSPSC ప్రకటన జారీ
70 శాతం సిలబస్‌లోనే పరీక్షలు
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 2020- 21 విద్యా సంవత్సరానికి ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. కోవిడ్19 తీవ్రత కారణంగా గతేడాది ఇంటర్ పరీక్షలు నిర్వహించని కారణంగా విద్యార్థులను నేరుగా సెకండియర్‌కు ప్రమోట్ చేశారు. గతంలో ప్రకటించిన విధంగా.. 30 శాతం సిలబస్‌ను తప్పించి, 70 శాతం సిలబస్‌లోనే పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డు ఇదివరకే స్పష్టం చేసింది. బ్రిడ్జి కోర్సు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి
Also Read: సీబీఎస్‌ఈ బోర్డు కీలక ప్రకటన.. ఎగ్జామ్ సెంటర్ మార్పునకు ఓకే!
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల పూర్తి షెడ్యూల్..
పరీక్ష తేదీ | సబ్జెక్టులు |
అక్టోబర్ 25 | సెకండ్ లాంగ్వేజ్ |
అక్టోబర్ 26 | ఇంగ్లీష్ |
అక్టోబర్ 27 | మ్యాథ్స్-1ఏ, బోటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 |
అక్టోబర్ 28 | మ్యాథ్స్-1బీ, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 |
అక్టోబర్ 29 | ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1 |
అక్టోబర్ 30 | కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 |
నవంబర్ 1 | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1 (బైపీసీ విద్యార్థుల కోసం) |
నవంబర్ 2 | మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1 |
Also Read: Career Guidance: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి..