(Source: Poll of Polls)
Bandi Sanjay: కేసీఆర్ యాదాద్రి వద్ద తేల్చుకుందాం రా.. అది నిరూపిస్తే దేనికైనా సిద్ధం
సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ వల్లే దళిత బంధు ఆగిందని నిరూపించేందుకు తాను సిద్దమని సవాల్ విసిరారు.
దళిత బంధు ఆపడానికి బీజేపీ కారణమని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని బండి సంజయ్ అన్నారు. లేనిపక్షంలో సీఎం పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ వల్లే దళిత బంధు ఆగిందని నిరూపించేందుకు నేను సిద్ధమని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసి కేసీఆర్ దొంగ నాటకాలకు తెరలేపాడని ఆరోపించారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ కుమార్ జమ్మికుంట రూరల్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. తొలుత అంకుషాపూర్, మడిపెల్లి గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు.
బండి సంజయ్ ఇంకా ఏమన్నారంటే..
హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసే కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరదీశారు. ఎన్నికల తరువాత కేసీఆరే తన మనుషులతో కోర్టులో కేసు వేయించి దళిత బంధు డబ్బులు దళితులకు అందకుండా చేస్తాడు. బీజేపీని గెలిపిస్తే కేసీఆర్ మెడలు వంచి దళితులందరికీ రూ.10 లక్షల సాయం అందేలా పోరాడుతుంది.
ఈ రోజు అంకుషాపూర్ గడ్డ నుండి ఒక మహానుభావుడికి యావత్ భారత్ తోపాటు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేడు మహత్తరమైన రోజు. ప్రపంచ చరిత్రలోనే గ్రేట్ డే. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉచితంగా అందించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీగారు దేశాన్ని కాపాడిన రోజు ఇది.
కరోనాతో రాష్ట్రం అల్లాడుతుంటే మన ముఖ్యమంత్రి మాత్రం ఫాంహౌజ్ లో పండుకుని పారాసిట్మాల్ వేసుకుంటే సరిపోతుందన్నడు. ఆయనకు కరోనా వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి పోయి చికిత్స చేయించుకుండు. ఆరోగ్య శ్రీకి డబ్బులివ్వలేదు. కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయలేదు. జనం చస్తున్నా పట్టించుకోలే. చివరకు మరణాలను కూడా దాచిర్రు. శవాలను మాయం చేసిర్రు. హుజూరాబాద్ ఎలక్షన్ రాంగనే మెల్లగా బయటకొచ్చి దళితవాడ తిరుగుడు స్టార్ట్ చేసిండు.
హుజూరాబాద్ లో బీజేపీ గెలుపు ఖాయమని సీఎం కేసీఆర్ కూడా అర్థమై పోయింది. అందుకే సోయి తప్పి ఏం చేస్తుండో ఆయనకే అర్ధమైతలేదు. ఓడిపోతామనే భయంతో ‘దళిత బంధు’ ప్రకటించిండు. మేం ఆహ్వానించినం. రాష్ట్రమంతా ఇవ్వాలన్నం. హైదరాబాద్ లో భూములమ్మి వచ్చిన సొమ్ముతో హుజూరాబాద్ లో దళిత బంధు ఇస్తమని ఆశ చూపిండు. అన్ని సర్వేల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని తేలిపోవడంతో దళితులకు డబ్బులెందుకు ఇయ్యాలని చెప్పి అకౌంట్లు ఫ్రీజ్ చేయించిండు.
ఇప్పుడు మళ్లీ కొత్త డ్రామా మొదలు పెట్టిండు. బీజేపీ లేఖ రాసినందువల్లే ఎలక్షన్ కమిషన్ దళిత బంధును ఆపేసిందని చెబుతుండు. అంతా అబద్దం. దళిత బంధు డబ్బులు పేదలకు ఇవ్వాల్సిందేనని మొదటి నుండి చెబుతోంది మేమే. నేను ప్రతిరోజు నా పాదయాత్రలో దళితులకు డబ్బులు రిలీజ్ చేయ్. ఫ్రీజ్ ఎందుకు చేసినవని నిలదీసిన. ఎలక్షన్ కమిషన్ కు కూడా డబ్బులు ఇవ్వాల్సిందేనని లేఖ రాసినం. రాజేందరన్న కూడా ప్రతిరోజు అకౌంట్లో డబ్బులెందుకు ఫ్రీజ్ చేసినవ్. వెంటనే ఇచ్చేయాలని డిమాండ్ చేస్తనే ఉన్నడు.
ఈటల రాజేందర్ సహా ఎందరో తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిండ్రు. ఎన్నో త్యాగాలు చేసిండు. కేసీఆర్, ఆయన కుటుంబం చేసిన త్యాగాలేందో చెప్పాలి. పేదోళ్లు త్యాగం చేస్తే కేసీఆర్ రాజ్యమేలుతుండు. కులాలు, మతాలు, వర్గాలు, సంఘాల పేరుతో పేదోళ్లను చీలుస్తుండు. కొట్లాట పెట్టిస్తుండు. అందుకే పేదోళ్లంతా ఒక్కటి కావాలి. కేసీఆర్ కు బుద్ది చెప్పాలి. ఈటల రాజేందర్ కు ఓటు వేయాలి.
Also Read: ఏపీలో కాకరేపుతున్న పట్టాభిరామ్ కామెంట్స్ .. టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడులు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి