Huzurabad Bypoll: హుజూరాబాద్ కోసం నేరుగా రంగంలోకి కేసీఆర్! రెండ్రోజులు ప్రణాళిక ఇలా..
హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేటలో నిర్వహించ తలపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ విషయంలో పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది.
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం ఇకపై మరింత రంజుగా జరగనుంది. టీఆర్ఎస్ తరపున ఇప్పటికే మంత్రుల స్థాయి నేతలు సహా ముఖ్యనేతలంతా అక్కడే మకాం వేసి రోడ్ షోల్లో పాల్గొంటూ హోరాహోరీ ప్రచారం చేస్తుంటే.. త్వరలో ఏకంగా టీఆర్ఎస్ అధినేత రంగంలోకి దిగనున్నారు. ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి పొరుగున ఉన్న జిల్లాల్లో సభలు, సమావేశాలు నిర్వహించకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు విధించిన వేళ టీఆర్ఎస్ అధిష్ఠానం మరో ప్లాన్ వేసింది.
Also Read: '100 కోట్ల టీకా' ఘనత గీతం విన్నారా? అదిరిపోయింది కదా!
ఉప ఎన్నిక జరిగే హుజూరాబాద్‌కు పొరుగున ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేటలో నిర్వహించ తలపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ విషయంలో పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది. సభ సాధ్యం కాకపోతే హుజూరాబాద్ నియోజకవర్గంలోనే రెండు రోజుల పాటు రోడ్‌షోలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇవాళ (అక్టోబరు 22) సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read: దర్శకుడు శంకర్ అల్లుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు.. క్రికెట్ కోచింగ్ కోసం వచ్చిన అమ్మాయిని..
ఈ నెల 30న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత కేసీఆర్ 26 లేదా 27వ తేదీన సభ నిర్వహించాలని తొలుత భావించారు. కానీ, గురువారం కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేయడంతో పరిస్థితి తారుమారైంది. ఎన్నిక జరిగే పొరుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలవుతుందని, కాబట్టి.. సభలు, సమావేశాలు పెట్టకూడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం గురువారం తన నివాసంలో మంత్రులు, ఇతర పార్టీ నేతలతో సమావేశం అయ్యారు.
హుజూరాబాద్‌లోని మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్ పల్లి వినోద్‌కుమార్, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. సభపై ఆంక్షలున్నందున దానికి ప్రత్యామ్నాయంగా ఎన్నికల నిబంధనలు అనుసరించి నియోజకవర్గంలోనే రోడ్ షోలు నిర్వహించాలనే అంశం కూడా చర్చించారు. ఈ నెల 26, 27 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించాలని మంత్రులు కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రణాళికను కూడా ఈ రోజే ఖరారు చేసే అవకాశం ఉంది.
Also Read: ప్రపోజ్ చేస్తే ఒప్పుకోని యువతికి గంజాయి గిఫ్టుగా ఇచ్చాడు.. తర్వాత ట్విస్టు మామూలుగా లేదు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి